ఆ రూపం..

నిత్యం తలపులతో మ్రోగేటి గుండె లయలు
తన్మయ నర్తనతో ప్రతిధ్వనించు మువ్వలు..
  
ఊహలు తుమ్మెదలై వదనాన్ని ముద్దాడగా 
చిరునవ్వు అధరాల తేనె జుర్రుకోక ఆగునా..

హృదయంలో వలపు ఉచ్ఛ్వాసై ఊపిరి పోయ 
మరో మదిలో సుగంధభరిత నిచ్ఛ్వాస ఛాయ.. 

సరసాలతో ఆలింగనమైన ప్రణయ సామ్రాజ్యం 
విడిపోని సుందర సుమధుర సువిశాల జగం..   

ప్రేమని కనురెప్పల్లో దాచుకున్న కలువపువ్వు 
వెన్నెలై లేని కోరికల్ని రెచ్చగొడుతుందా నవ్వు..

నవరసాలు ఉన్న అమాయక ముఖకవళికలు
ప్రతిజన్మ నీవేనని చేసుకుంటున్న ప్రమాణాలు..   

30 comments:

 1. మారుమ్రోగగా మోహన మురళి
  ఆగేనా ఆపినా మువ్వల రవళి

  జీవాత్మ సంజ్ఞ హృదయ లయగతులు
  పరమాత్మ సంజ్ఞ ఉఛ్వాస నిఃశ్వాసలు

  రుపుదిద్దుకునే అక్షరాలు అనంతానంత భావాలు
  దేదీప్యమానమై వెలిగే అనంతానంత అక్షరహారాలు

  ~శ్రీ~

  Your poetry is a total blend of emotions that are cast in the moulds of the mind, Padma Gaaru

  06:30
  25 Mar 2017

  ReplyDelete
  Replies
  1. ಜೀವಿತಂ ಒಕ ಅಂದಮೈನ ಪೂಲತೋಟ ಐತೇ
   ಕಲಲನ್ನಿ ವಿಚ್ಚುಕೋಬೋತುನ್ನ ಕುಸುಮಾಲು
   ಆಶಲನ್ನಿ ಅರವಿರಿಸಿನ ವಿರುಲು
   ಅಲ್ಲರಿ ಅಲವೋಕಗಾ ವೀಚೇ ಗಾಲಿಲೋ ಸುಮಗಂಧಂ
   ಕ್ಷಮಾಗುಣಂ ತುಂಚಿನ ಪುಷ್ಪಂ ಚೇತಿಕಿ ಜತಚೇಸೇ ಪರಿಮಳಂ
   ಬಾಧ ಭರಿಂಚೇ ತತ್ವಾನ್ನಿ ಅಲವರ್ಚುಕುನಿ ಪ್ರತಿ ಉದಯಂ ಮೊಗ್ಗಲು ತೋಡಿಗೇ ಆಮನಿ ವಸಂತಂ ಈ ಚೈತ್ರಾಗಮನ ಉಗಾದಿ. ಗುಡ್ ನೈಟ್ ಪದ್ಮ ಗಾರು. ಹೇವಿಳಂಬಿನಾಮ ಉಗಾದಿ ಶುಭಾಭಿನಂದನಲು ಮೀಕು ರೆಂಡು ಗಂಟಲು ಮುಂದಸ್ತುಗಾ

   ~ಶ್ರೀ~

   జీవితం ఒక అందమైన పూలతోట ఐతే
   కలలన్ని విచ్చుకోబోతున్న కుసుమాలు
   ఆశలన్ని అరవిరిసిన విరులు
   అల్లరి అలవోకగా వీచే గాలిలో సుమగంధం
   క్షమాగుణం తుంచిన పుష్పం చేతికి జతచేసే పరిమళం
   బాధ భరించే తత్వాన్ని అలవర్చుకుని ప్రతి ఉదయం మొగ్గలు తొడిగే ఆమని వసంతం ఈ చైత్రాగమన ఉగాది. గుడ్ నైట్ పద్మ గారు. హేవిళంబినామ ఉగాది శుభాభినందనలు మీకు రెండు గంటలు ముందస్తుగా

   ~శ్రీ~

   Delete
  2. ఏ తపము చేసేనో మరి ధరణి.. తాను మారేను కదా అంబగా జగదాంబికకే
   ఏ తపము చేసేనో మరి జనక మహారాజు.. సాక్షాత్తు మహాలక్ష్మీయే వారింట నడయాడే

   ఏ తపము చేసేనో మరి ధరణి.. రామపాద ధూళితో ధరిత్రి పావనమాయే
   ఏ తపము చేసేనో దశరథ మహారాజు.. భగవంతుడే బాలకుడై వారింట సాక్షాత్కరించే

   శ్రీరామ నవమి విషెస్ పద్మ గారు

   Delete
 2. ప్రేమని కనురెప్పల్లో దాచుకున్న కలువపువ్వు పాత మధుర తలపు.

  ReplyDelete
 3. వెన్నెల్లో వలపంతా ఆరాబోసి పంచినట్లు ఉంది కవితాచిత్రం.

  ReplyDelete
 4. కనులకు
  ఇంపైన చిత్రం
  చెవులకు స్తోత్రం
  మీ కవితలు

  ReplyDelete
 5. very nice pic padma
  lyrics too good as usual

  ReplyDelete
 6. వెన్నెల స్పర్శతో
  మురిసిన కలువరేకులు
  మూసిన కళ్ళలో
  విరిసిన సుందర రూపాలు
  నింగి నుండి జారిన జల్లు
  అధరాల పై చేరగా
  మనసు విరిసిన హరివిల్లు
  పదాలు కవితలై జాలువార
  చదివి మనసు పులకరించి
  ఆనందించెను పలుమార్లు..

  ReplyDelete
 7. పెరుగుతున్న ఎండలో వలపు ముత్యాలవాన కురిపించారు.

  ReplyDelete
 8. wah kya wonderful painting.

  ReplyDelete
 9. మీ కవితల్లో ప్రేమతోపాటు నిగూఢభావం అంతర్లీనంగా దాగి ఉంటుంది
  పద్మార్పిత ప్రణయ భావాలు మధురం

  ReplyDelete
 10. హృదయంలో వలపు ఉచ్ఛ్వాసై ఊపిరి పోయ
  మరో మదిలో సుగంధభరిత నిచ్ఛ్వాస ఛాయ
  ఉఛ్వాస నిఛ్వాసల్లో ఒకరికొకరు అద్భుతం

  ReplyDelete
 11. అందమైన కవితాచిత్రం

  ReplyDelete
 12. భావాలు మొత్తం ప్రేమ సౌందర్యం చుట్టూ అల్లబడ్డవి. చిత్రం కనులకి విందుగొల్పింది

  ReplyDelete
 13. మనసు వయసు రెండూ తన్మయం చెంది నర్తిస్తాయి మీ కవితలు చదివినా చిత్రాలు చూసినా.

  ReplyDelete
 14. పొందిగ్గా అమరిన పదాలు పేర్చి ప్రేమ భావాలని రంగరించారు కవితలో.
  ఎవరో ప్రేమార్పిత సార్ధకనామధేయులు మీరు
  బొమ్మలో మీ భావాలు తేటతెల్లమైనాయి.

  ReplyDelete
 15. ప్రేమను కనురెప్పల్లో దాచుకున్న కలువపువ్వు మీరేనా?

  ReplyDelete
 16. అరె భై అప్పుడప్పుడ్ జిందగిలా పరేశాని పక్కనబెట్టి నవ్వుతుండాలే మస్తుగ.. అట్ల గాకుండా ఉంటే ఎట్లైతది.. సోచాయించు.. సమజైనదా.. యాద్ మరవక్ ఔ మల్ల..! జిందగి న మిలేగి దొబారా.. !!

  ReplyDelete
 17. చక్కటి మరో ప్రేమగీతం మీ కలం నుండి.

  ReplyDelete
 18. Love is always Lovely.

  ReplyDelete
 19. బాగుంది ప్రేమకావ్యం

  ReplyDelete
 20. హృదయంలో వలపు ఉచ్ఛ్వాసై ఊపిరి పోయ
  మరో మదిలో సుగంధభరిత నిచ్ఛ్వాస ఛాయ

  ReplyDelete
 21. చిరునవ్వు అధరాల తేనె తీయన :)

  ReplyDelete
 22. పదాల మధ్య చెరగని ఆ రూపం అపురూపం

  ReplyDelete
 23. తెలుగు నూతన సంవత్సరం మీరు మరింత ఉత్సాహంతో ఉరకలు వేయాలి. మీకు ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
 24. ప్రణయానికి ప్రమాణాలు ఎంతో అవసరం. బాసలు చేయడం ప్రేమను పొందడానికి సులభమైన మార్గం అర్పిత. చిత్రంలో ఆ అందమైన ముఖాన్ని చూస్తూ ఎన్ని బాసలైనా చేసేయవచ్చు.హా హా హా- హరినాధ్

  ReplyDelete
 25. కరువాయె మీ కవితలు
  కుశలమేనా అర్పితగారు?

  ReplyDelete
 26. అందరి అభిమాన ఆప్యాతాక్షరాలకు అభివందనములు.. _/\_

  ReplyDelete