వాహ్ వా...ఎంత అందమైన ఆత్మవంచన
కవితలని పద్యాలని పదాలు పేర్చి రాయడం
శవమై తనని తానే భుజాలపై మోసుకోవడం
అద్దాలంటి అక్షరాల్ని అమ్ముకోవాలన్న ఆశతో
అందరూ అంధులున్న నగరంలో తిరగడం!!
పాడెకమ్మీల కర్రను వేణువుగా మలచి మీటి
శ్రావ్యమైన రాగాన్ని వినిపించాలి అనుకోవడం
నిరాశ నిట్టూర్పులతో స్మశానమంతా నిండగా
చచ్చిన ఆశలకు ఊపిరి పోయ పూనుకోవడం
వేదనలు పురివిప్పి నాట్యం చేస్తూ నవ్వుకోగా
ఆనందకేళీ విలాసమే అదంటూ మురిసిపోవడం
అంచనాల అంకురాలన్నీ చెదలుపట్టి కూలిపోగా
అందమైన ఆలోచనలే ఆరోగ్యకరమని అల్లుకోడం
గాయాలు సరసమని సలపరాన్ని మరీ పెంచగా
కన్నీరు రానీయకంటూ నవ్వులో దాచుకోవడం!!
భావాల గొంతుపిసిగి ఆత్మహత్య చేసినంత పాపం
అంతర్లీనంగా తెలియని వ్యధను దాచినట్లుంది పోస్ట్
ReplyDeleteఎంత వరకూ నిజమో తెలియదు...కవితలో డీప్ ఫీలింగ్.
అచ్చు హల్లుల అక్షరాలకు భావం కలగల్పితే కవితయని
ReplyDeleteవెదురులో గాలి గమనం వేణు గానమవుతుందని
ప్రాణమున్ననాళ్ళే జీవాత్మతో పలకరింపులని
పరమాత్మలో లీనమైయ్యాక అదే కాటిలో కాష్టమని
బాధలని ఓర్పు సహనం ఓపికతో భరించాలని
సంతోషాన్ని సమాజంలో నలుగురితో పంచుకోవాలని
సాధారణంగా కనిపించేవి కూడా అసాధారణమేనని
నిన్నటి గాయం మెల్లిగానైతేనేమి మానిపోతుందని
ఒకింత ప్రేరణ ఇస్తూనే.. మునుపటి రూపంలో ఉన్నా వాటి ఇప్పటి విలువలను మరిచి సర్వసాధారణంగా ఏదో ఒక నెపంతో అభాండం వేస్తారు అని మీరు మీ కవితలో చెప్పిన తీరు బాగుంది పద్మగారు.
నిజమే కారు ఢీకొట్టినప్పటి గాయాల బాధను తట్టుకుని గత వారం రోజులుగా నేను పడిన యాతన అంత ఇంత కాదు.. మెల్లగా కోలుకుంటున్నాను.. కాలమే ప్రశ్న కాలమే సమాధానం.. కాని కాలానికున్నంత సహనం నిబద్దత అందరిలో ఉండాలని చెప్పిన ఈ మీ కవిత ఆలోచనాత్మకం పద్మగారు.
జై శ్రీరామ్
తమిళంలో నేరం అంటే సమయం.. వ్యథభరిత సంఘటనలు ఏదైనా గాని సమయమే సమాధానమిస్తుంది.. తెలుగులో ఐతే నేరమనేది మహాపాతకం.. ఆత్మవంచనతో లోలోపలే దుఃఖాన్ని దిగమింగనులేకా కాదని లేని సంతోషాన్ని నటించటము రాకా అయోమయ స్థితిలో భావాలని మనసనే "ఊటబావి" లో మోయటం రాకా.. నవ్వనే ముసుగుతో దాచనులేక.. అలసిన మనసులో మెదిలే భావాలను "ఉట్టి" పై వేలాడదీసిన భావాల కంఠం నులిమి బల్వన్మరణానికి ఉసిగొలిపే తత్వం మీకు "అజ్యం తో పెట్టిన హవనం" వంటిది.. పరిపూర్ణ స్వాహా. (చిన్న విశ్లేషణ)
Deleteసవరణ:
Delete"కంఠం నులిమి.. .. తత్వం మీకు" అని ఉన్న లైన్ ను "కంఠం నులిమి.. .. తత్వం అంటు విశాదాన్ని విశదికరించటం మీకు" అని అనుకోగలరు.
ఆ లైన్ ను మరల చూసినపుడు తప్పు దొర్లిందని తెలిసొచ్చింది పద్మ గారు. అన్యథ భావించకండి.
Correction in the Above Lines: The Previous Comment gave a wrong meaning and was not in line with what I thought to describe.
I wanted to convey that you have the ability to mould even grief in a manner where it finds a sensible place in your poem without changing the original theme.
krish ki kashtam klishtam this kavita .
ReplyDeleteగంభీరంగా సాగిన మీ కవితకు
ReplyDeleteరమణీయమైన చిత్రానికి నా జోహార్లు.
కన్నీరు రానీయకంటూ నవ్వులో దాచుకోవడం..its very hard to hide tears when we are sad.
ReplyDeleteDEEP TOUCH POETRY
ReplyDeleteఅందరూ నేరగాళ్ళు అంటే ఒప్పుకోము :)
ReplyDeleteఅర్థం చేసుకోవడం కష్టం మిమ్మల్ని మీ అక్షరాలను పద్మాజీ
ReplyDeleteపెయింటింగ్లోను పూర్తి అర్థం కనబడలేదు.....:( :( :(
చచ్చిన ఆశలకు ఊపిరి పోయడం అసాధ్యం.
ReplyDeleteఅనుభవాలను అక్షరాల్లో అందించండి.
ReplyDeleteఅంచనాల అంకురాలన్నీ చెదలుపట్టడం
ReplyDeleteఅందమైన ఆలోచనలే అల్లుకోడం
గాయాలు సరసమని సలపడం...మీకు ఇటువంటి వాక్యాలు థాట్స్ ఎలా వస్తాయో?
శవమై తనని తానే భుజాలపై మోసుకోవడం...నిజమే ఆత్మవంచన.
ReplyDeleteవేదాంతం చెప్పి వైరాగ్యాన్ని భోధించడం నీకు సరిపడదు పద్మార్పిత.
ReplyDeleteపాడెకమ్మీల చర్చ నీకేల
ReplyDeleteపరవశంగా పాడితే చాలు
నిట్టూర్పులను దరిచేరనీకు
నిండుజాబిలివోలె వెలుగు
వేదన ఊసులు నీకు వద్దు
నవ్వులు నీ ముఖానికి ముద్దు..
మరీ ఇంత వేదన నిట్టుర్పు భావాలు అవసరమా పద్మా
ReplyDeleteహాయిగా ఆనందంగా నవ్వుకునే నాలుగు మాటలు రాసెయ్
తుపాకీ తూట్లు మీ అక్షరాలు భాధించినంత భాధపెట్టవు మాడం.
ReplyDeleteద్దాలంటి అక్షరాల్ని అమ్ముకోవాలన్న ఆశతో
ReplyDeleteఅందరూ అంధులున్న నగరంలో తిరగడం..హైలెట్
awesome painting didi
ReplyDeleteTypical
ReplyDeleteCritical
Lyrics..
మనం బ్రతికి ఉన్నప్పుడు భావాలూ నిత్యం మనతో ఉంటాయి. అవి చనిపోవాలి అనుకోవడం మనలోని నిట్టుర్పుల చరమస్థాయి. అటువంటి ఆలోచన్లని హత్య చేయాలి అంతే కాని మన భావాలోచనలను కాదు-హరినాధ్
ReplyDeleteహ్యాపీ పోయట్రీ దినోత్సవం
ReplyDeleteపోస్ట్ వ్రాయండి మేడం-
అక్షరాలు అద్దాలు
ReplyDeleteమనలోని లోపాలు చూపునని చక్కగా రాసారు.
విడి విడిగా సమాధానమిస్తూ అభివందనాలు తెలుపుకోలేకపోవడం...నేరం నాది కాదు సమయభారానిది....మన్నిస్తారు కదూ....అందరికీ నమస్సుమాంజలి._/\_
ReplyDelete