మనసు తనువు రెండూ నలుగుతుంటే
మానస కాల్పనిక ఊహా నేస్తమా..
ఒంటరి జీవితానికప్పుడు నీవే ఆసరాకా!
స్వచ్ఛంద పరమార్థమే తెలుసుకోక
స్వార్థాన్ని అవసానపట్టి సాధన చేయక
సతమతం అవుతుంటే మేల్కొల్పి..
నా భుజస్కంధాలకు ఊతమే నీవుకా!
సత్కార్య సంకల్పమే చేయ నెంచితే
నా మనోవికాస విశ్వాసమే సడలిపోతే
నన్నంటి ఉండి లోకంపోకడ తెలిపి..
కనులవెలుగై నడిపించి నాలో ఏకంకా!
మనిషికి మనిషికి నడుమ భౌతికంగా దూరాలున్నా
ReplyDeleteమనసుకి మనసుకి నడుమ దగ్గరగా ఉండాలని
కొన్ని కొన్ని భావాలకు అక్షరాలు సరితూగవని
వాటిని మనసుతో తప్ప దేనితోను తెలుసుకోలేమని
ఆశ నిరాశల పోరులో ఆశ నెగ్గాలని
మదిలో మెదిలే భావాల గమకమే కావ్యమని
మీ శైలిలో మీ తరహాలో చెప్పిన తీరు బాగుంది పద్మ గారు
అనుక్షణం పరితపించే మనసుకు మాటతోనే సాంత్వన
Deleteఅనునిత్యం కలవరించే తలపులకు మౌనంతోనే పొంతన
గాయమైన మనసుకు ఊరటనిచ్చే మాటలు
ఎదురు చూసే కన్నులకు కన్నీరు కాకూడదు అలంకారాలు
కనుక..
ఆశ అడియాశల పోరులో అడియాశనే నెగ్గని
నిట్టూర్పు సెగలే భగ్గున మండి చల్లారి పోని
వేకువే కానరాక చుట్టు చీకటే అలుముకోని
ఐనా కాని..
అతలాకుతలమైన సంద్రంలో మాత్రమే నావ పయనించగలదు
రాగద్వేషాలతో మమేకమైన మనసు మాత్రమే సంతోషాన్ని వెలికితీయగలదు
~శ్రీ~
ఏం వ్రాశారు పద్మగారు
ReplyDeleteచిత్రంలో మొత్తం భావం గుప్పించారు
నావలా ఒడ్డుకు చేర్చమనడం అమోఘం.
మనోవికాస విశ్వాసమే సడలిపోతే..మీకా? ఎప్పటికీ సడలదు ఇది మా నమ్మకం. చాలా మంచి కవితను అందించారు.
ReplyDeleteNever get depress
ReplyDeleteeye are so beautiful in the pic.
ReplyDeleteవిప్పారిన నేత్రంలో
తప్పిన పరువాల శూన్య తత్వాలకటా
యుప్పిరి గొన పద్మార్పిత
విప్పెను పురి, నాట్యమాడె విలసత్వమునన్ !
జిలేబి
సత్కార్యాలు చేయడానికి సంకల్పము ఉంటే చాలునంటారు మరి ఇలా నిరాశ బాటలో ఎందుకు పయనం. చిత్రం చక్కగా నప్పింది.
ReplyDeleteమనకు మనమే తోడు ఎప్పటికీ**మంచి కవిత పద్మార్పిత**
ReplyDeleteఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకోవడం పొరపాటు.
ఒంటరి జీవితానికి నీవే ఆసరాకా
ReplyDeleteకనులవెలుగై నడిపించి నాలో ఏకంకా
మనసుపొరల్లో నిక్షిప్తం అయ్యే మాటలు.
padma manasu doche aksharalu rasinavu great ra, ila sagipo.
ReplyDeleteమానస కాల్పనిక ఊహా నేస్తమా..ఎవరు వీరు? :)
ReplyDeleteఎవరిని నుండీ ఏదీ ఆశించవద్దు అనుకుంటాము. కానీ మనం ఇష్టపడే వాళ్ల నుంచి మనకు తెలియకనే ఆశిస్తూ ఉంటాము. ఆశించి జరగనప్పుడు బెంగపడిపోవడం సాధారణం. అటువంటి సమయంలోనే ధైర్యాన్ని వీడక నిబ్బరంతో ముందుకు సాగిపోవాలి-హరినాథ్
ReplyDelete"మానస కాల్పనిక ఊహా నేస్తం" బాగుంది.
ReplyDeletedidi kamal ka hai aap ki confidence.
ReplyDeleteస్వాభిమానాన్ని చంపుకోకుండా సెల్ఫ్ కాంఫిడెన్స్ ఎంతో అవసరం.
ReplyDelete-----మంచి కవితను అందించారు.
supporting life style.
ReplyDeleteసత్కార్య సంకల్పమే చేయనెంచ మనోవికాస విశ్వాసమే సడలిపోదుగాక పోదు మీరు ధైర్యాన్ని వీడక కొనసాగనివ్వండి.
ReplyDeleteచివరి అక్షరం "కా" అంటూ కొత్తగా పలికిన తీరు బాగుంది. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఈ నిస్పృహా?
ReplyDeleteవెలుగై నడిపించి నాలో ఏకంకా..మనసు తాకింది
ReplyDeleteఏవో భావాలు మదిన రేపి
ReplyDeleteకనులలో శూన్యం చూపి
వెన్నెల్లో జలకమాడించి
మాటల్లో వలపు రగిలించి
కలవరింతలకు గురిచేసి
అలుపెరుగని ఆలోచనలు
పుట్టించకే పదముల గడుసరి..
ధన్యవాద నమోఃవందనములు _/\_
ReplyDeleteఅందరి స్ఫూర్తి అభిమాన స్పందనలకు