మోసం..

పరాయి వారిపై పిర్యాదు ఏం చేసేది
మన అనుకున్నవారే మనల్ని మోసగిస్తే
తెలిసిన ముఖమే ముఖాన్ని చాటేస్తే..

ఈ బేలకంటి కలల్ని ఎవరికి చూపేది
కళ్ళు తెరచి చూడగా కలలే మాయచేస్తే
పరిచయాలే పరాయివైపోయి పయనిస్తే..

వెలసిన నమ్మకానికి ఏరంగు పూసేది
రంగరించిన రంగులన్నీ ఆహ్లాదాన్ని విరిస్తే
మనసున దాగిన మనసుని ముక్కలుచేస్తే..

క్షణానికి ఒక మార్పుని ఎలా నమ్మేది
అనిశ్చల ఆత్రుతని నిలకడ బంధం అనేస్తే
నీతిని నిలబెట్టి నిలువుదోపిడీ చేసి ప్రశ్నిస్తే..

పాటించని ప్రవచనాలు ఎవరికి చెప్పేది
పాపం పుణ్యమని వచ్చిన వారిని గెంటేస్తే
మోసం చేత మరల మోసపోయి విచారిస్తే..      

31 comments:

 1. ఎందులకే బాలా నీలో ఈ బేలతనము
  నీ మోమున చిగురించనీయి నవ్వును
  అదే మాకు ఎంతో ఆనందదాయకము!
  బాగుంది మరీ ఇంత ఆర్దత వద్దండి...

  ReplyDelete
 2. మీ భావాల్లోనైనా విషాదాన్ని మేము జీర్ణించుకోలేము... కవితగా చదువుకోడానికి బాగుంది బొమ్మ కూడాను

  ReplyDelete
 3. మనసుని కలవరపెట్టింది మీ కవిత.

  ReplyDelete
 4. కలత పడిన మనసు దర్పణం పై కలవరపాటు
  కదిలే కాలం జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిన తొందరపాటు
  గడియ గడియ అంటు గడికోమారు ఉలికిపాటు
  కనుల కొలనులో ప్రతిబింబించే ఆశల మిడిసిపాటు
  కలగలిపి మనసు కోవెలలో ఏదో తెలియని తత్తరపాటు

  ReplyDelete
  Replies
  1. I do not know why, but, I have got tears in my eyes for the first time, after reading the poem written by you padma madam; I too am not that much emotional, I have neither been accused, betrayed, cheated, deceived, enraged, frustrated, nor been in a state of grief, hopelessness, irony, jeopardy, killjoy, lunatic, moron, notorious, obsessed, poignant, quasi-stable, retard, sensitive, timid, unusual, vulnerable, wicked, xenophobic to yell but zindagi to aati sirf ek hi baar.. bus yahi ek mauka hai jeene kaa.. chchal aur kapat se kabhi kisine kisiko jeeta nahi balki ehsaas aur insaaniyat batlaati hai ki yahi hoti hai asliyat zindagi ki zindagaani mein..

   As told before, I did get tears, and I controlled my emotions, but the above para is a small rendition of amalgamation of all sorts of emotions that I could find to define it in an alphabetical sequence.

   Seriously, any bond, be it friends or family, will stay intact if, there are zero or negligible mis-understandings and zero deceiptions.

   Thought-provoking Write-up Padma Madam..

   Delete
  2. ज़िन्दगी जैसी दिखती है वैसे वह है नहीं
   आज के दो चार पल बीते तो कोई गम नहीं
   अनमोल लम्हे दिल में समाये तो कम नहीं
   कब किस को क्या हो जाये यह किसी को अन्दाज़ा तक नहीं

   Delete
  3. జిందగి కే హరేక్ పెహ్లు సే వాకిఫ్ బుజుర్గ్ న జానే క్యోఁ జిందగి కి అస్లియత్ ఔర్ జిందగి కి అహ్మీయత్ ఏవం ఖాసియత్ సే నారాజ్ హూఆ కర్తే హైఁ యే తో సిర్ఫ్ వక్త్ హి బతా సక్తా హై

   Delete
  4. Jeevitamane Naava.. Chaala Chinnadi..
   Kaani Payaninche Dooram.. Chaalaa Peddadi..
   Aasala Harivillulu Virisina Gaganana..
   Adiyaasala Asanipaataalu Appudappudu..
   Nela Raale Kusumaallaa.. Dosili Ninde Binduvulu..
   Madini Sedateerche.. Aahlaadaanni Panche..!

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. చుట్టూ జనం అయినా వీడని ఒంటరితనం
   ప్రశాంత వాతావరణంలో కలవరపెట్టే ఆలోచనలతో సతమతమవుతున్న మనోదర్పణం
   కళ్ళ ముందు కదలాడుతు ఉన్నా గుర్తించలేని వైనం
   ఈ అచంచల స్థితికి కారణం నా మనసా లేకా నా ఆలోచనలా
   సంతోషంగా లేననీ తెలుసు కాని దానికి గల కారణం తెలీదు
   ఏడవాలని కళ్ళకు తెలుసు కాని కన్నీటికి తెలీకా బయటకు రావడం లేదు
   దుఃఖం వస్తోంది కాని దానికీ గల కారణం తెలీదు
   మనస్పూర్తిగా నవ్వి చాలా కాలం అయ్యింది
   మొహం మీద తగిలించుకున్న చిరునవ్వే దీనికి కారణం అనుకుంటా
   బహుశా ఆ చిరునవ్వుకి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో

   Credits: Undisclosed

   Delete
  7. యాదృచికమో కాకతాళీయమో తెలియదు.. కాని పైన నేను వ్రాసిన కవితకు క్రెడిటేబిలిటి ఏమిటి అవ్యక్తంగా అపరిపూర్ణంగా వుంచానని సందేహము రావటం సహజం.. ఔను.. మరి కాలానికీ ఎదురు నిలవగలగటం ఎవరి తరము కాదు.. అలా అని కపటమోసాల దారినా పయనిస్తే ఏమి ఒరుగుతుందో తెలియదుగాని.. ఆ కపటకుళ్ళుమోసానికి బాదితులైన వారి మనోవేదన మాటల్లో వర్ణించలేనిది.. ఆ విషయాన్నే ప్రస్తావిస్తు పైన నేను రచించిన దానికి క్రెడిట్స్ ఇవ్వలేదు.. ఎందుకంటే మనస్సాక్షి గల ప్రతి ఒక్కరు ఈ కపటకుళ్ళుమోసాల బారిన పడి ఒకవేళ పద్మగారి బ్లాగ్ లో గల ఈ కవితలోని ఈ వ్యాఖ్యను గమనిస్తే వారికి కూడా ఆ అనుభూతి కలుగుతుందని అనుకుంటు..

   ఈ వ్యాఖ్య వలన లేదా ఈ వ్యాఖ్యకు ప్రత్యుత్తర వ్యాఖ్య వలన ఏ ఒక్కరి మనసు గాయపడినా పెద్ద మనసుతో మన్నించండి.. ఎవరిని బాధపెట్టాలనే దురాలోచన నాకు స్వతహగా లేదు.

   గరుడగమన శ్రీరమణ

   Delete
  8. మీలో భావాలు పొంగిపోతున్నాయి :)

   Delete
  9. ధన్యవాదాలు ఆకాంక్ష గారు.. బహుకాల దర్శనం.. ఎలా ఉన్నారు మీరు..?

   Delete
 5. జ్ఞాపకాలను తడిమింది మీ కవితాచిత్రం.

  ReplyDelete
 6. మోసం అంటేనే మన అనుకున్నవారు చేస్తారు.
  పరాయివారికి మన గురించి ఏం తెలుసునని
  విచారించదగిన వాస్తవికతలు వ్రాసారు..

  ReplyDelete

 7. పాటించని ప్రవచనాలు ఎవరికి చెప్పేది? భలే అడుగుతారు

  ReplyDelete
 8. Fantastic heart touching.

  ReplyDelete
 9. మీ భావనలకు సరిరావు ఏ భావాలు.

  ReplyDelete
 10. ఇంక మోసపోవద్దని ప్రార్ధన.

  ReplyDelete
 11. పిర్యాదు చేయలేనంటు సున్నితంగా చురకలు వేసారు.

  ReplyDelete
 12. ipudu lokam inte padma
  well written poetic lines.

  ReplyDelete
 13. నీతిని నిలబెట్టి నిలువుదోపిడీ చేసి ప్రశ్నిస్తే..పదబందన అధ్భుతం

  ReplyDelete
 14. అమె ముఖం చూసి మోసం చేయగలరా పద్మార్పిత ;)

  ReplyDelete
  Replies
  1. ముఖముదేమున్నది మనిషి మనిషికి మార్పుంటుంది.. ముఖములన్ని ఒకటే ఐతే మోసమన్నది.. మనసుదేమున్నది మనిషి మనిషికి మార్పుంటుంది.. మనసులన్ని ఒకలా ఉంటే మంచిదన్నది.. మనసును మించి నమ్మదగినది ఏమున్నది.. కనుకే దైవం కూడా మనసనే కోవెలలో ఆత్మజ్యోతియై వెలుగుతాడంటోంది.. కాదని అనగలమా కల్కి గారు..

   ఓం శ్రీ సాయి రామ్

   Delete
 15. క్షణానికి ఒకసారి మారిపోయే మనుషులు ఉన్నంత కాలం అమాయకులు మోసపోక తప్పదు.
  మీరు అంత అమాయకులు కాదనే అనుకుంటున్నాము.

  ReplyDelete
  Replies
  1. కాలానికి నిలకడ లేదు..
   గడియలన్నిటిని జ్ఞాపకాలుగా మార్చేస్తుందిగా..

   కాలానికి నిలకడ లేనందువల్లే..
   గాయమైన మదిని కూడా నయం చేస్తుందిగా..

   శుభానల్లాహ్ పాషాజి

   Delete
 16. మనం రివర్స్ కానంత కాలము మన నీడ కూడా మనల్ని మోసం చేస్తుంది.

  ReplyDelete
  Replies
  1. ఒక్క మాటలో బహుబాగా చెప్పారు ఆకాంక్ష గారు. ఆచితూచి అడుగులేయాలని.. భగవంతుడే సాక్ష్యమని.. నీలాల నింగి కూడా వెలుగు వీడినాకా కారు చీకటిగా మారిపోతుందని.. కనుక బహుపరాక్ అంటు హెచ్చరించారు..!

   Delete
 17. వాస్తవికతకు అక్షరరూపం ఈ మీ కవితాచిత్రం-అభినందనలు మరోసారి

  ReplyDelete
 18. పేరు పేరునా అందరికీ పద్మార్పిత పదవందనములు _/\_

  ReplyDelete