నీ రూపం..

                                                                   కనురెప్పలమాటున దాగిన కలలు కొల్లగొడుతున్నా
కనుపాపలే కుంచెలవ్వ కన్నీరు రంగులుగా మార
సున్నిత భావాలు క్యాన్వాసు గోడకు వ్రేలాడుతుంటే     
హృదయంలో అందమైన నీరూపం చిత్రించబడుతుంది!

చిరుగాలికి అక్షరాలతో ఊసులెన్నో నివేదించుకున్నా

వెలుగు సిరాతో తెల్లకాగితంపై ఆశల ధరకాస్తు పంప 
ఇరుస్పర్శలు పలుకక తడుముకుని ముచ్చటిస్తుంటే
ఆగాగని నీగుండె నిబ్బరంతో నిర్దయగా నిందిస్తుంది!
                                
కంటికి దూరంకావద్దని కలంతో కాలాన్ని వేడుకున్నా
కప్పుంచిన మదిలోని మాటలను బయటపడనీయక 
దూరంగున్నా దగ్గర ఉన్నావన్న భ్రాంతిలో నేనుంటే
నీ మౌనం మనిద్దరి మధ్యా ఉన్నది దూరమంటుంది!

ధీనంగా చెంపలపై జారుతున్న కన్నీటిని అర్ధించుకున్నా

మొద్దుబారిన నీ మదిని తడిపి నన్ను గుర్తుచేయమని
రూపుదిద్దుకున్న నీ చిత్రాన్ని సంపూర్ణం చేయబోతుంటే
వేదన వర్షంలా కురిస్తే అర్పించిన ప్రేమ ఎలా నిలుస్తుంది!

19 comments:

  1. Love it happens
    Dont borrow it from others.

    ReplyDelete
  2. Prema putte time vachinapudu మొద్దుబారిన మదిని kuda niddura leputundhi friend.

    ReplyDelete
  3. సహజత్వాన్ని పుణికిపుచ్చుకునే స్వభావం ఆప్యాయతది
    తనవారి పట్ల కలిగే విధేయత గీటురాయి అనురాగానిది
    నిత్యమై అలరారు వేళ.. చిన్న పొరబాటైనా అతలాకుతలమే

    బాధతప్త హృదయాన ఉబికి వచ్చే కన్నీటి సాంద్రత
    సంతోష సమయాన కనుజారే భాష్పాలకు సరితూగవు
    హృద్మందిరాన ఇంకిన భావోద్వేగాల రంగులన్ని
    మనసు కుంచేతో జీవితమనే కాన్వాసుపై ముద్రించగా
    గతకాల జ్ఞాపకాలు కొన్ని ఇహకాల ఘడియలు మరికొన్ని
    పిమ్మట కాలపు ఆలోచనలను సైతం సునాయాసంగా చిత్రించవచ్చు


    ధరణి
    ఓం కేశవాయ నమః

    ReplyDelete
  4. ప్రేమ రూపురేఖలు దిద్దుకోవడం మామూలు పనియా

    ReplyDelete
  5. prema puttuka vichitram
    adi tenchukoedam chaala kashtam
    prema meeku dasoham

    ReplyDelete

  6. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. జీవితమనే పుస్తకాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా రాసుకుంటారు. జీవితంలో సంతోషంగా, మనశ్శాంతితో ఉండాలంటే కృతజ్ఞతా భావం, ప్రేమ, నిజాయితీ, గౌరవమనే నాలుగు విషయాల కావాలి.

    ReplyDelete
  7. ప్రేమ మనసు జతకట్టి వ్రాసిన కవిత.

    ReplyDelete
  8. ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకొక్కరిదీ ఒకో వాదన, దానికి అనేక రూపాలు చిత్రలు ఉంటాయి.. నిజమైన ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమ అనేది మరొక వ్యక్తి కొరకు సున్నితంగా పదిల పరచుకొనే ఒక లోతైన, అవ్యక్తభావన.

    ReplyDelete
  9. premanu arthinchakandi
    adi avasaram anukunapudu vachi valutundi

    ReplyDelete
  10. కనే కలలు ఎప్పుడూ నిజం కావు. కవితపరంగా భావాలు బాగున్నాయి.

    ReplyDelete
  11. వేదన వర్షం :(

    ReplyDelete
  12. ఊహల మాటున కొలువుండి
    రెప్పలు మూసినవేళ కలవై
    కనులు తెరిచినంతనే
    జ్ఞాపకంలా మిగిలిపోతాయి తలపులు
    స్వప్నం నిజం కాదు
    కాదు అంటే మది ఊరుకోదు
    నువ్వు నిజంకాదన్టే వాస్తవం ఒప్పుకోదు
    ప్రేమ ధ్యాస మనసుని నిద్రపుచ్చదు

    ReplyDelete
  13. ప్రేమ జీవనరాగం.

    ReplyDelete
  14. వలపు తూటాలు ఇంకా ఎన్ని మిగినవి సాంబా :) ప్రేమకు అంతం లేదు అనకు.

    ReplyDelete
  15. ఎందుకని మీ కవితల్లో నిట్టుర్పుసెగలు పెరిగి నిరాశక్తితో కూడిన భావాలు కనబడుతున్నాయి.
    మీ భావాల దారి మళ్ళించండి పద్మార్పితగారు.

    ReplyDelete
  16. ప్రేమలో పడిపోయారు అనుకుంటే ఇలా ప్రణయ విలాపంలో పడిపోయారేంటి?? ప్రేమర్పిత

    ReplyDelete