తెలివైనోడు..

వలపు పేరిట నడుము వంపులు వత్తుతూ..
వినోదించి వజ్రాలవడ్డాణం చేయిస్తానంటివి నాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు!

మరులెన్నోగొల్పుతూ మునివేళ్ళు పిసికేస్తూ..
మాయమాటల్తో మాటీలు పెడతానంటివి నాడు
మదంతీరితే మాయతొలగె అంటున్నావు నేడు!

చిలిపి చేష్టలతో చిత్రంగా చెక్కిళ్ళు నొక్కుతూ..
చంకలు ఎగరేసి చంద్రహారం వేస్తానంటివి నాడు
చెప్పింది చేయలేనంటూ చతికిలబడ్డావు నేడు!

అందాన్ని తనివితీరా చూసి ఆహాని ఆరగిస్తూ..
అరవంకీలు రెండెరవేసి అక్కడ నొక్కితివి నాడు
ఆ అందాలే చూసి అలసితినంటున్నావు నేడు!

ముద్దొస్తున్నానంటూ ముద్దుపై ముద్దు పెడుతూ..
ముక్కెరే కాదు నత్తూ నా సొంతమేనంటివి నాడు
మోజు తీరినాక ముడుచుకు పడుకున్నావు నేడు!

ఏవంకన ఏఆభరణం అడుగుతానోనని ఆలోచిస్తూ..
అరవైకేజీల అసలు బంగారానికి తెలియలేదు నాడు
మతిలేనోడ్ని మన్నించు బంగారమంటున్నావు నేడు!

22 comments:

  1. అందరూ అదే బాపతు అనుకోకడి.
    ఇజమైన ప్రేమికులూ ఉంటారండోయ్.

    ReplyDelete
  2. Ornaments based post with meaningful sentences.

    ReplyDelete
  3. అవసరానికి వాడుకునే వారు అంతే..మంచి పోస్ట్.

    ReplyDelete
  4. బంగారానికి నగలతో అవసరంలేదని మనసుతో చెబితే ఈ ఆడవారు నమ్మరు అనుకుంటాడు పాపం :)

    ReplyDelete
  5. ఇంతకూ ఏమీ చేయించకనే మురిపించాడు..అహ హా హా

    ReplyDelete
  6. మిమ్మల్ని నిలువెత్తు మేలిమి బంగారం అని అన్నా... తిడతారెంటి సుమండీ

    ReplyDelete
    Replies
    1. మతిలేనోడు "బంగారం" అని కూడా పిలిచాడు కదా ?

      ఇంకేం ఇంకేం కావాలే....
      చాల్లే ఇక చాల్లే...

      Delete
  7. మరేఁ.. భార్య మనసు అర్దం చేసుకునేంతగా పరిపక్వత చెందాలి భర్త యని శెలవిచ్చినారా పద్మ గారు.. భర్త గాంభీర్యంలో కూడ లోతైన ఆప్యాయత దాగి ఉంటుందని మీకు తెలియనిదా చెప్పండి.. సరికొత్తగా రచించినారు.. కాకపోతే నూటికి ముడు పదుల మగవారు అర్దం చేసుకోరు.. అదే నూటికి నాలుగు పదుల ఆడవారు అర్దం కారు.. ఏంతైనా.. ఆలుమగలన్నాక అడపదడప గిల్లికజ్జాలుండాలంటున్నారా.. ఏదైనా శృతిమించితే అంతే సంగతులని సుతిమెత్తగ కవితలో చెప్పిన తీరు ప్రశంసనీయం..

    ~ధరణి

    ReplyDelete


  8. తెలివై నోడండీ మా
    వ! లిప్పు లిప్పుకి నడుమ కువకువ యనంగన్
    సలలితముగ మాటల మూ
    టలతో కనుగప్పినాడు టవలి తెలియకన్ :)


    జిలేబి

    ReplyDelete
  9. ఓసి నాతింగర బంగారమా !
    మూసీ మూయని స్థితిలోని అరమోడ్పు కళ్ళకు తెలుసా ?
    యేయే బాసలాడేనో ,
    ముక్కు మూసుక జపం చేసుకునే మునిలాంటి వాడికి
    ముకుతాడేసేవు . ముందరి కాళ్ళకు బంధం వేసేవు .
    సంసార సాగరంలోకి తోసేసేవు . ఇపుడేదీ దారి ?

    ReplyDelete
  10. రసవత్తర ప్రణయంలో బంగారం అడ్డుకదండీ అందుకే వద్దని కామోసు...అర్థం చేసుకోవాలి

    ReplyDelete
  11. ఆడవాళ్ళు బంగారానికి లొంగిపోయే రకాలు..పసిగట్టి పడేసిన వాడు నిజంగా తెలివైనవాడు.

    ReplyDelete
  12. మీ అక్షర ఆభరణాలకు అభినందనలు.

    ReplyDelete
  13. వారానికి ఒకరకంగా రాసే మీరు మున్ముందు మేరు పర్వతం వలె ఎదిగిపోవాలని కోరుకుంటున్నం.

    ReplyDelete
  14. మీ బాణీలో సాగిన మరో రసాబాస రాసలీల.

    ReplyDelete
  15. ఆభరణాలు ఎర చూపించి ఆడవారిని అవసరానికి వాడుకుకునే వదిలివేసే ప్రబుద్ధులకు మచ్చుతునక మీ కవితానాయకి ప్రియుడు. మా మంచోడు.

    ReplyDelete
  16. "అందాన్ని తనివితీరా చూసి ఆహాని ఆరగిస్తూ" అహం ఆరగించడం ఏమిటది అర్థం కాలేదు.
    మిగతా అంతా బాగుంది.

    ReplyDelete
  17. మీరు చాలా విలువైన ఆభరణం అని తెలిసి చేయించలేదు.

    ReplyDelete
  18. మీరు మీ కవితల్లో చాలావరకు తిడుతున్నారో మెచ్చుకుంటారో అర్థం కాదు. పెయింటింగ్స్ ఒకటిని మించి మరొకటి పెడతారు.

    ReplyDelete
  19. ఇప్పుడు బంగారం కొనమని అడుగితే సన్యాసుల్లో కలవడమే ఉత్తమమని వెళ్ళిపోతాడు జాగ్రత్త :) :)

    ReplyDelete
  20. ఆత్మీయులందరికీ
    పద్మార్పిత..
    అభివందనములు!_/\_

    ReplyDelete