ప్రియుడు కావాలి!

నాకు ఒక మంచి బాయ్ ఫ్రెంఢ్ కావాలి
వీలుంటే ఒడ్డూ పొడుగు ముద్దుగుండాలి
లేకున్నా పరువాలేదు మనసు ఉండాలి
కాసులు లేకున్నా పెద్ద కలేజా ఉండాలి
ప్రేమించానని గట్టిగా నలుగురికీ చెప్పాలి!   

ప్రేమలో పండిన పద్మకు ప్రియుడుకావాలి
కుదిరితే అస్లీ లేకుంటే నక్లీ అయ్యుండాలి
పెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి
చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి 
ప్రేమని పంచడంలో మాత్రం కింగ్ అవ్వాలి!

అర్పిత అంటే అల్లాటప్పా కాదని తెలియాలి
తెలిసీ మనసు మెదడు రెంటితో ప్రేమించాలి 
కులగోత్రాలు లేని గుణసంపన్నుడు కావాలి
చేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి
వాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!

50 comments:



  1. వాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!


    శీఘ్రమేవ ప్రాప్తి రస్తు :)


    రాను రాను పద్మమ్మ మరీ పడుచై పోతోందోచ్ :)




    జిలేబి

    ReplyDelete
  2. ప్రేమలో పరిపక్వత
    మెండుగా ఉన్న మీకు
    ప్రియుడు దొరకడు
    సరి సరి నీకెవ్వరు
    గడుసరి చాలు చాలు..

    ReplyDelete
  3. ఘాటైన ప్రేమకు ఆటుపోట్లు తప్పవు
    అడ్జస్ట్ అయిపోవాలి అటో ఇటో...Ha ha ha

    ReplyDelete
  4. "Naakoka Girlfriend kaavalera" anna Boys Movie lo Song ki female version la undhi. Chala baaga chepparu meeku kavalsindhi.

    ReplyDelete
  5. ఇంకా స్టిల్ వేటుకులాటలో ఉంటే ఎలా
    సెటిల్ అయిపొవాలి ఇప్పటికి...😁

    ReplyDelete
  6. అర్పిత అంటే అల్లాటప్పా కాదని...లాగి చెంపదెబ్బ కొట్టారు ఎవరిని?

    ReplyDelete
  7. Nirmohamaatam bhavalu cheppadamlonu bommalu sarainavi kanulaku impuga post cheyadam lo mee prathibha amogham

    ReplyDelete
  8. చేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి, కట్టిపడేసారు. ఇంక ఎక్కడికి పోతాడు చిన్నవాడు అదే మీ ప్రియుడు.

    ReplyDelete
  9. అర్పిత అంటే అల్లాటప్పా కాదు...నిజమా!???

    ReplyDelete
  10. ప్రేమలో పండిన పద్మ

    ReplyDelete
  11. పెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి, చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి ఇది ఎలా సాధ్యం. మీ కోరికలకు అంతులేదు.

    ReplyDelete
  12. రాతిని ఉలితో చెక్కగా శిలా సైతం శిల్పవగా
    గుణగణాలు మిళీతమై ప్రేమానురాగాలు కురియగా
    నింగి నేల పరిమితి దాటని వాత్సల్యతే సంపూర్ణమవగా
    అన్యమనస్కంగా అచేతనావస్త కాస్త అభిమానం నిండిన బంధమవగా
    నిండు నూరేళ్ళు ఒకరికొకరై భాసిల్లగా

    ~శ్రీత ధరణీ

    ReplyDelete


  13. కోరంగ నిత్య శోభన
    మే రమణి పరిశ్రమించి మేని యహో బే
    జారై పద్మార్పితకై
    బారునఁ గూర్చున్నవాఁడె భక్త "వరు" డగున్! :)



    జిలేబి

    ReplyDelete
  14. మరి ఇప్పటివరకూ మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని ఏం చేస్తారు? హ హ అహ్హ

    ReplyDelete
  15. prema panchadam lo king anaru
    mari meeru premanu panchadam queen ah?

    ReplyDelete
  16. ప్రేమలో పండి :)

    ReplyDelete
  17. అసలీ సరే నకిలీ ఏమిటో ఎందుకో అర్థము కాలేదు.
    మీరు కోరుకున్న ప్రియుడు మీ నుండి అవే ఆశిస్తాడు మరచిపోకండి అర్పితగారు.
    PICTURE AMAZING

    ReplyDelete
  18. Padmarpita is not a Ordinary Lady.

    ReplyDelete
  19. రామ రామ నాలో ఒక్క క్వాలిటీ కూడా లేదు.

    ReplyDelete
  20. ప్రేమలో పండిపోయిన మిమ్మల్ని ప్రేమించడం ఎవరితరమ.

    ReplyDelete
  21. నాకూ ప్రియుడు కావాలి...same 2 same

    ReplyDelete
  22. అమ్మో... నిత్యశోభనమా?? శుభమస్తు

    ReplyDelete
  23. హాయ్ పద్మార్పిత మీ కవితలు బాగుంటాయి

    ReplyDelete
    Replies
    1. మిస్సింగ్ పద్మార్పిత అక్షరజల్లులు.

      Delete
  24. కలం అలసినదా లేక కమలానికి భావం కరువైనవా

    ReplyDelete
  25. ఎందుకో అక్షరం మూగబోయింది? :(

    ReplyDelete
  26. నిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలుపెడితే ప్రియుడూ నీవే ప్రియురాలూ నీవే అవుతావు.

    ReplyDelete
  27. మీ ప్రియుణ్ణి వెతికేపనిలో ఇన్నాళ్ళూ ఫాన్స్ బ్ల్లాగ్ వారు నిమగ్నమై ఉన్నారు... దయుంచి క్షమించండి!
    ఎన్నటికీ పద్మార్పిత అక్షరాలు నిత్య శోభన నక్షత్రాలు కదా,,,, సలాం మేడం!!!

    అభిమానులందరికీ అభివందనం!

    రామ సక్కని భాష్యం!! పోస్ట్ మీకోసం..........

    https://padmarpitafans.blogspot.com/2019/09/by-ram-prasad.html

    ReplyDelete
    Replies
    1. ఇకపై ఫ్యాన్స్ బ్లాగ్ లో రెగులర్గా పోస్టులు ఉంటాయి అని మనవి చేస్తున్నాను... అభిమానులు పంపిన అన్ని అక్షర కుసుమాలూ వారానికి ఒకటి చొప్పున ఫ్యాన్స్ బ్లాగ్లో పరిమళిస్తూ ఉంటాయి....
      ధన్యోస్మి!!

      Delete
    2. నాడు-నేడు
      వ్యత్యాసం ఎంతో
      అప్పటి నదీ ప్రవాహం
      అమె కవితలు
      నేడు కొరవడిన భావాలు
      లోపం ఎక్కడో తెలియదు

      Delete
    3. బహుశా ప్రియుడితో పొట్లాడి ఉంటారు... మళ్లీ పాత అర్పిత వస్తుందని భావిస్తున్నా

      Delete
    4. @ Padmarpita fans blog. ఫ్యాన్స్ బ్లాగుగారు మెయిల్ జవాబు ఇవ్వండి. నేను ఒక కవిత వ్రాసాను పద్మార్పిత గారికి అందించాలని.

      Delete
  28. Padmarpita still not married?

    ReplyDelete
  29. ప్రేమలో పడిన పద్మకు ప్రియుడుకావాలి
    మా మీ అభిమానులకు మీ కవితలు కావాలి
    రారండోయ్ అర్పితగారు కవితలతో అలరించండోయ్

    ReplyDelete
  30. medam its very long gap no postings why?

    ReplyDelete
  31. బ్లాగ్ మొత్తం బోసిపోయినది
    ఏమైనారు పద్మార్పితగారు?

    ReplyDelete
  32. really missing her postings here.

    ReplyDelete
  33. బింకమో లేక బెట్టో?

    ReplyDelete
  34. ప్రియుడి వేటలో పడి పోయట్రీ పోస్ట్ చెయ్యకపోతే అభిమానుల ఆత్మలు ఘోషించేను పద్మార్పితగారు...అహా హా హా వేగిరం వచ్చి వ్రాయండి.

    ReplyDelete
  35. _/\_ఎందుకు ఏమిటి ఏలా?
    అని అర్పితను అడక్కుండా
    మంచి మనసుతో మన్నించాలి_/\_

    ReplyDelete
  36. మీరు లేరని బ్లాగులోకి రావడమే మానేశా ఎక్కడికి పోయారండి చెప్పకుండా....

    ReplyDelete
  37. ఇంకా ఎన్నిరోజులు ఈ వెతుకులాట.

    ReplyDelete