నటన

జీవితనాటక రంగస్థలంపై అందరూ బ్రహ్మాండంగా నటిస్తున్నారు
ఎవరికి వారే నాయికా నాయకులై నటించమంటే జీవిస్తున్నారు
గర్భంలోనే టీవీ సీరియల్స్ చూసి, విలన్స్ గా పుడుతున్నారు 
పుట్టగానే ఏడవాల్సిన వారు నవ్వుతో నటన ప్రారంభిస్తున్నారు!

జీవితం యాంత్రికం కాదంటూనే నిద్ర లేవడంతోటే నటిస్తున్నారు 
స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు ఇష్టంలేని చదువును బట్టీకొట్టేస్తున్నారు
టీచర్లు చదువు చెప్పేస్తున్నామంటూ విపరీతంగా నమ్మిస్తున్నారు
అమ్మానాన్నలు తమ పిల్లలు వృద్దిలోకి వస్తారని నమ్మేస్తున్నారు!

జీవించే క్రమంలో ప్రేమ కూడ ప్రాక్టికలని నమ్మేలా నటిస్తున్నారు 
ఏది ప్రేమో ఎంత నిజమో తెలియనంతగా డైలాగ్స్ చెబుతున్నారు 
అంతా నటనేనని తెలిసీ తెలియబరచక మేకప్ వేసుకుంటున్నారు
ఏ పాత్రనైనా అవలీలగా నటించడానికి అలవాటు పడిపోతున్నారు!

జీవం పోయాల్సిన డాక్టర్లు డబ్బులు దండుకోడానికి నటిస్తున్నారు
రోగులు ఆరోగ్య పధకాలు అమలు కావని హైరానా పడుతున్నారు
         కూలీవాళ్ళు కూడా పనిచేయక కాలరెగురవేసేలా నటించేస్తున్నారు         
ప్రాణమున్న ప్రతీఒక్కరూ నటించడం నేర్చుకుని జీవించేస్తున్నారు!

జీవించడంలో ఎవరికి వారే హీరో హీరోయిన్లనుకుని నటిస్తున్నారు
నటించడం రాకపోతే వారిని వెర్రివాళ్ళుగా జమకట్టి వెలివేస్తున్నారు
        అసలు రూపాలు మర్చిపోయి మారువేషాలలో మాయచేస్తున్నారు        
నటనతో ఆస్కార్ అవార్డ్ కొట్టేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు!

40 comments:

  1. jivitam natinchadamu anta subhataramu kadu, natanalo melukuvalu telusukuni konnee gelavdaniki enno kolpovalasi untundi.
    meru rasina natana poem nannu alochinche vidhamu vaipuku tesukuni velutunnadi.

    ReplyDelete
    Replies
    1. natinchadamu sulabhamu kaakapoeyinaa tappanisarigaa natinchaali.

      Delete
  2. నాటకంలోనే బతుకు సాగించడం అంటే అంత సులభం కాదు.

    ReplyDelete
    Replies
    1. అన్నీ సులభతరంగా అవ్వాలి అనుకోవడం అవివేకం ఏమో!?

      Delete
  3. జీవితం అంటేనే పెద్ద నటన అంటారు
    అటువంటప్పుడు నటించక తప్పదు.

    ReplyDelete
    Replies
    1. అవును అంతే అంతే

      Delete
  4. జీవితం ఎన్ని కష్టనష్టాలు పడైనా జీవించక తప్పదు అనుకున్నప్పుడు నటిస్తే తప్పు ఏమిటండి.?

    ReplyDelete
    Replies
    1. తప్పు కానే కాదుగా

      Delete
  5. పుట్టగానే ఏడవాల్సిన వారు నవ్వుతో నటన ప్రారంభిస్తున్నారు!S true

    ReplyDelete
    Replies
    1. సింపుల్ గా చెప్పేసారు :)

      Delete
  6. 6 months savasam cheste vallu vellu avtaru antaru, alantidi manam Movies, Serials, kotha ga Series la tho day start ayyi, purti avvani manam Natinchaka em chestam.

    Meeru annatlu Nootikoo, Kotikoo నటించడం raani వారిని వెర్రివాళ్ళుగా జమకట్టి వెలివేస్తున్నారు. Samajam Kullipoindi, andulo meeru, nenu kuda paatra daarulame. Em antaru?

    ReplyDelete
    Replies
    1. జీవితంలో నటించని వారు కూడా నేర్చుకుని నటించ వలసిందే తప్పదు. అలా నటించలేనంఫ్ఫుడు అది జీవితమే కాదేమో అనిపిస్తుంది ఒకోమారు. మీరు చెప్పినట్లు ఆరు మాసాలు అయితే వారు వీరు అవుతారు కదండీ...అలా అనుకుంటే మీకు ఈ పాటికి నటించడం వచ్చే ఉంటుంది. కాదంటారా ;)

      Delete
  7. జీవించాలంటే నటించక తప్పని పరిస్థితులు
    మీరు నేను మనందరమూ నటిస్తున్నాము

    ReplyDelete
    Replies
    1. అంతే అంతా నటనే

      Delete
  8. నటించడం రాని నాలాంటి వారు హలో లక్ష్మణా అంటూ రోధించవలసిందే

    ReplyDelete
    Replies
    1. నో రోదన ఓన్లీ నటన

      Delete
  9. ఏ పాత్రనైనా అవలీలగా నటించడానికి అలవాటు పడిపోతున్నారు-ఇది తప్పు
    ఏ పాత్ర పోషించాలన్నా చాలా క్లిష్టతరమే. నటించడం కూడా ఒక వరమే. అది అందరూ ఎలా అవలీలగా చేస్తున్నారు అనుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. క్లిష్టతరమైనా తప్పక నేర్వ వలసిందేగా

      Delete
  10. జీవితం నాటక రంగస్థలం.

    ReplyDelete
  11. జీవించే క్రమంలో ప్రేమ కూడ ప్రాక్టికలని నమ్మేలా నటిస్తున్నారు..ఇది నిజం

    ReplyDelete
  12. మనవారంటు జీవిస్తుంటే మోసం కపట నాటకమని ముసుగులేసుకుంటున్నారు..
    చివరి నిమిషాన మన వారెవరో కాని వారెవరో తెలుసుకునేలోపు
    శ్వాస ఆడక జగన్నాటకానికి సూత్రం తెగి స్వర్గానికేగుతారు..

    మా తాతయ్య గారు స్వర్గాస్తులై అపుడే రెండు నెలలు.. వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటు.. మరియు యూట్యూబ్ లో అనతి కాలం లోనే ఎంతో మంది వీక్షకులని సంపాదించుకుని గత నెలలో ఆకస్మికంగ తనువు చాలించిన "గ్రాండ్ పా కిచెన్" తాతయ్య నారాయణ రెడ్డి గారికి అశృతప్త ఘన నివాళులర్పిస్తు..

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. తాతగారికి శ్రద్దాంజలి _/\_


      Delete
  13. అందరూ మహానటులు

    ReplyDelete
  14. రంగస్థలం పై నటించవలసిందే.

    ReplyDelete
  15. yes very true. anta natanane.

    ReplyDelete