లవ్వు జ్వరం

చలిగా ఉందంటూ దుప్పట్లో ముసుగుతన్ని తొంగుని
వణుకుతూ మూలుగుతూ అటూ ఇటూ పొర్లుతూ..
వచ్చి పోరాదా ప్రియతమాని పలుమార్లు కలవరిస్తూ
అలసి కూర్చున్న నా ఎద ఎగసిపడేలా కుదిపేస్తావు!

చాపక్రింద నీరులా కిమ్మనక కానరాక ఉందామనుకుని
వలపంతా వేడావిర్లుగా చేసి నీ తనువుకు రుద్దుతూ..
దరికి రాకుండా దాకుందామని శతవిధాలా ప్రయత్నిస్తూ
అరమరికలు లేని హృదయాన్ని ఆపలేక అల్లాడతాను!

వయ్యార సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలిని
ధర్మామీటరునై నీ శరీర ఉష్ణోగ్రతను పరీక్షచేయబోతూ..
పాదరసంలాంటి పరువాలు పదునెక్కి నిన్ను రెచ్చగొట్టిస్తూ
నేను నిగ్రహంగుండి నీ ఒంటి వేడినెలా తగ్గించమంటావు!

పున్నమి పూలను శ్వాస పరిమళాలను మూటగట్టుకుని
మమతల్ని మడతల్లో దాచేసి దాగుడుమూతలాడుతూ..
సరసాన్ని సరైన మోతాదులో రంగరించి మాత్రలుగా వేస్తూ
వెచ్చని దాహాన్ని వేడిపాలతో కాక మురిపాలతో తీరుస్తాను!

31 comments:

  1. వామ్మో... కోరికలు గుర్రాలైతే గింతే సంగతి...

    ReplyDelete
  2. మళ్లీ పాత పద్మార్పిత వచ్చేసారు ✌️✌️ సూపర్ మేడమ్.... అక్షర చిత్రాలు... అమోఘం...

    ReplyDelete
  3. నిగ్రము ఇద్దరిలో సమపాళ్ళలో ఉంటే సరి :)

    ReplyDelete
  4. Nice madam write about priyanka reddy rape case mam

    ReplyDelete
  5. చాపక్రింద నీరులా కిమ్మనక ఉండాలి అనుకోవడం ఎందుకు?
    ఒకవేళ అదే విధానము అనుకుంటే ఈ లవ్వు జ్వరం ఎందుకో????

    ReplyDelete
  6. హమ్మయ్యా మొత్తం మీద రోగానికి మందు కనుక్కున్నారు. బొమ్మ బాగుంది.

    ReplyDelete
  7. lovely pic with beautiful feel.

    ReplyDelete
  8. ఉష్టోగ్రతను కొలిచే థర్మామీటరు ఒకరు అయితే పాదరము మరొకరు కాదా/
    ఇక తాపము తీరేది తీర్చుకునేది ఒకరి సన్నిధిలో మరొకరు.
    మంచి యుక్తితో కూడిన భావాన్ని పలికించారు పదాలలో. అభినందనలు పద్మార్పిత

    ReplyDelete
  9. వణుకు పుట్టించే చలిలో
    స్వేదం చిందించే తపము విరహం
    చలి మంటలతో చలి కాచుకోవచ్చేమో
    ఇరువురి ఘర్షణ అనలం తో ముఖమే మాడే
    పళ్ళు కొరికే చలిని తట్టుకోవటం సాహసమే
    పంటి బిగువబట్టి మౌనం దాల్చితే తట్టుకోవటం సునాయాసమా
    పగలు పొగమంచు రేయిన చలితెర ఋతువేమో మూడు మాసాలే
    వగలు గిల్లికజ్జాలు అలక కులుకులు ఆజన్మాంతం ఆచంద్రతారార్కం

    ReplyDelete
  10. పద్మార్పితగారు మీ లవ్వు జ్వరం తగ్గుముఖం పట్టినట్లైతే ఫ్యాన్స్ బ్లాగ్ కు పరుగున వచ్చి ప్రశ్నకు జవాబు ఇవ్వండి.

    ReplyDelete
  11. Romantic with heart touching matter.

    ReplyDelete
  12. korikalu urakalu veasinatlu unnayi me bhavalu :-)

    ReplyDelete
  13. పున్నమి పూలను
    శ్వాస పరిమళాలను
    Lovely feel...

    ReplyDelete
  14. వయ్యార సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలిని
    అప్పటి రాగాలు మరల ఆలపిస్తున్నారు...ఓలమ్మో!!!

    ReplyDelete
  15. Korikelu kadham tokke maatalatho kaipu ekkinchatam meeke sadyam Arpita.

    ReplyDelete
  16. కొత్త కోరికలు విచ్చుకున్నవా లేక పాతవో
    మధురం విరహం కలగలిసినవి

    ReplyDelete

  17. వెచ్చని దాహాన్ని వేడిపాలతో కాక మురిపాలతో సున్నితం

    ReplyDelete
  18. chapakrinda neeru la endaro unnaru.

    ReplyDelete
  19. పాదరసంలాంటి పరువాలు పదునెక్కి:)

    ReplyDelete
  20. జ్వరాలు బహు రకాలు...లవ్వు వైరస్ కు మందు ఏమిటి?

    ReplyDelete
  21. సౌరభాలు ఎరుగని తిమిరమానస ప్రియురాలు..ఎక్కడ?

    ReplyDelete
  22. రెండుభాగాలు ఒక థెర్మామీటరు.

    ReplyDelete
  23. అదే ప్రేమ ఒరవడి మీలో.

    ReplyDelete
  24. హ్యాపీ బర్త్ డే టు పద్మార్పిత

    ReplyDelete

  25. మదిని తాకే మనోభావాలు మీ సొంతం.

    ReplyDelete
  26. వలపు మొలకెత్తనే కూడదు మొలకెత్తిన తరువాత చాపక్రింద నీరులా ఏమిటి రెక్కలు వచ్చిన గుర్రాలై ఎగరాలి అనిపిస్తుంది. దరి చేరిన తరువాత దూరం అవడం చాలా కష్టం. ఎన్ని ఒడిదుడుకులనైనా భరించి కలసి ఉండె ప్రయత్నం చేయాలి.ఆయుష్మాంభవః అర్పిత- హరినాధ్

    ReplyDelete
  27. Lovely paintings collected.

    ReplyDelete
  28. _/\_అందరికీ శతకోటివందనములు_/\_

    ReplyDelete