ఆమె...'నీ'భయం

 అప్పుడు వారు ఆమెను అత్యాచారం చేయలేదు
ఆమె పేగులతో ఆడుకుని పైత్యం తీర్చుకున్నారు
ఢిల్లీ బస్సులో రేప్ చేసి త్రోసివేసినా భయపడొద్దని
"నిర్భయ" అని నామకరణం చేసి నిద్రపుచ్చారు!
బాలికల బలత్కారాలెన్ని జరిగినా పట్టించుకోలేదు
అరకొరకగా న్యాయమంటూ అరిచారు నోరున్నవారు
అరవలేక అలసిన అమాయక పసిపిల్ల పెద్దవాళ్ళని
నిర్భందించి లేచిన అంగాన్ని ఆడించి నిద్రపోయారు!
కొవ్వు కరిగినా ఆమెను ఊపిరి పీల్చుకోనీయలేదు
ఒక్కడి దూలతో తృప్తి పడక గుంపుగా పైనపడ్డారు
అమానుషంగా అనుభవించిన తరువాతైనా అబలని
నిశ్చింతగా వదిలేయక కాల్చి నిద్రపొమ్మంటున్నారు!
ఇప్పుడూ జరుగుతున్నాయి ఎన్నో లెక్కతేలడంలేదు
పెంపకం తప్పనీ కాదు మగతనమదని చర్చిస్తున్నారు
చలించినవారు వ్యాఖ్యాలతో అలంకరించేసి తెల్లపేజీలని
"నిర్భయ3" లేదా 4-5-6 చట్టాలని నిద్రపోతున్నారు!
కొవ్వొత్తంటించే ఏ స్త్రీ ఎగిరే మొడ్డనెందుకు కాల్చలేదు
ఆడతనం అమ్మతనమని ఆమెను అణగమంటున్నారు
బలవంతం చేసేవాడి బుల్లిని కోసే బిల్లుని ప్రవేశపెట్టలేని
                                                                           ఏ ప్రతినిధులు ఆమెను నిర్భయంతో నిద్రపొమ్మనలేరు!                                         

27 comments:

  1. హేయమైన సమాజం వైపు దిక్సూచి
    ఆడవారి పట్ల అమానుష చర్య
    లోకం పోకడ అల్లకల్లోలమే
    సభ్యత సర్వనాశనమే
    మానవీయత కోల్పోయిన వేళ
    భావి భారతావని అతలాకుతలమే

    ఘోరాలన్ని క్షణికావేశాలైతే
    వాటిని సమూలంగా నిర్మూలించటానికి మాసాలు ఏళ్ళా
    పాశవికోన్మాద రాక్షసుల బారి నుండి రక్షకై బహుశ
    మరల అవతరించాలేమో దేవుడే ఆలంబనగా
    నేరస్తులని శిక్షించకుండ తక్షణం ఎందుకో మరి కాలయాపన
    చలించే ప్రతి హృదయం కోరేది ఒక్కటే
    అమ్మగా అక్కగా చెల్లిగా ఆలిగా కూతురిగా వేర్వేరు పాత్రల్లో మన చుట్టు మన శ్రేయస్సు కోరుకునే మగువకు చేతనైతే గౌరవాన్ని ఇద్దాం వారి మానసిక వికాసానికి తోడ్పాటు ఔతుంది కాని తెలిసి కూడా వారికి హాని తలపెట్ట కూడదు.

    డిస్ క్లైమర్: పైన తెలిపినవి నా భావాలు మాత్రమే. ప్రస్తుత పరిస్థితులు స్థితిగతులపై నాకు తోచిన ఆలోచనలను ఏకరూపు పెట్టినాను. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ నీతిని న్యాయాన్ని తప్పు పట్టటం లేదు. జాప్యాన్ని త్యజించి నేరస్తులను కఠినంగా శిక్షించేలా మరియు ఇకపై ఇటువంటి అసాంఘిక శక్తుల బారి నుండి భావి భారతావనిని కాపాడే దిశ లో చట్టాల సవరణ జరగాలని ఆశిస్తు.
    సర్వే జనాః సుఖినో భవంతు

    ReplyDelete
    Replies
    1. దిశ నిందితులు నలుగురిని చటాన్ పల్లి శివారులో ఎన్ కౌంటర్ చేసి న్యాయాన్ని చట్టాన్ని ధర్మాన్ని పరిరక్షించారు. సెల్యూట్ టూ దీ పోలీస్ పర్సోనెల్. జై హింద్..!

      Delete
    2. Honesty, good social attitude, helping nature and kind hearted, moral values, mindset must be for every person sadly these are eliminating from current society which causes this type of issues.

      Delete
    3. చాలా చక్కని వివరణ, బట్ విచారకరం Sridharani garu

      Delete
    4. థ్యాంక్యూ సర్..
      ~శ్రీధర్

      Delete
  2. power pasa rendu rangarinchi vraasaaru neati paristhitiki goddalipettu.

    ReplyDelete
  3. At present situation ki apt post.
    I appreciate Police Encounter in this case.

    ReplyDelete
  4. Behind every exquisite thing that existed, there was something tragic. You have blessed skills of expressing thoughts be on that job. God bless you dear.

    ReplyDelete
  5. పద్మార్పితా..మొత్తానికి స్త్రీజాతి ఘోష మారుమ్రోగినట్లుంది. రాక్షస సం హారానికి దిశ నిర్దేశించబడి నేటి ఉదయం రాక్షస సం హారము జరిగింది. ఇది మిగతావారి పట్ల కూడా అవలంబింపజేస్తే అమానుషాకృత్యాలకు బలై అసువులుబాసిన వారి ఆత్మ శాంతిస్తుంది.
    ఇవి ఇక్కడితో ఆగక ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని అల్పులు పలికితే పలుకుగాక. తప్పు చేసిన అందరికీ శిక్ష పడకపోయినా కొందరైనా శిక్షించబడితే న్యాయం ధర్మ ఇంకా బ్రతికి ఉందని అనిపిస్తుంది లేదంటే న్యాయం కోర్టు పోలీసు వ్యవస్థ పై పూఎర్తిగా నమ్మకాన్ని కోల్పోతాము.

    ReplyDelete
  6. సమయానికి తగు మాటలు అంటే ఇవే కామోసును సుమా...మీ రమణి!

    ReplyDelete
  7. బలవంతం చేసేవాడి బుల్లిని కోసే బిల్లుని ప్రవేశపెట్టలేని ఏ ప్రతినిధులు ఆమెను నిర్భయంతో నిద్రపొమ్మనలేరు...ఇది ఖచ్చితంగా పవర్ ఆఫ్ పద్మార్పితదే

    ReplyDelete
  8. A post with powerful words.

    ReplyDelete
  9. change the topic and write padmarpita, very its became very bore now.

    ReplyDelete
  10. Ekkado unna moon meeda water kanippetti edo goppaga cheppukovadam kaadu, ilanti vedavalani kanipetti veelynantha thondaraga shiksha padela cheyandi, ilantivi ikapai jarakunda chudnadi.......

    ReplyDelete
    Replies
    1. మూన్ (తెలుగులో చంద్రుడు అంటారు) మీద వాటర్ (తెలుగులో నీళ్లు అంటారు) కనిపెట్టింది శాస్త్రవేత్తలు (తెలుగులో సైంటిస్టులు అంటారు).
      మీరు చెప్పినలాంటి వాళ్ళని కనిపెట్టాల్సింది పోలీసులు.
      వీళ్లు చెయ్యాల్సిన పని వాళ్ళని చేయమంటే ఎలా సాధ్యం ?హౌ?!

      Delete
  11. Feeling shame as a boy 😢

    ReplyDelete
  12. Happy to see this blog and beautiful paintings.

    ReplyDelete
  13. చీల్చి చెండారారు,అందరి లోపల ఉన్న ఆవేశాన్ని వెలికి తోడారు.

    ReplyDelete
  14. ఆకతాయి వెధవల్ని అడ్డంగా నరికేయాలి..అదే సరైన శిక్ష.

    ReplyDelete
  15. Pranam...It's unique sty of Padmarpita

    ReplyDelete
  16. ఆమె మగవారికి అందంగా కనబడినత కాలం భయం ఎక్కడ పుడుతుందని.

    ReplyDelete
  17. ame ante bhayam evariki ledu kevalam oka atavastuvu anukovadamanubhavinchadam.

    ReplyDelete