మీమాంసలో..

ఈ కాలమెంత కఠోరమైనదననా..
లేక మనం చేసిన నేరమనుకోనా!

నా హృదయంలో కాపురమననా.. 
లేక నా దగ్గరలేవు ఎందుకనుకోనా!

ప్రేమలో పస తగ్గెనని బాధపడనా..
లేక నావలపు లోపం ఉందనుకోనా!

మన కలయికకే అడ్డంకులేలననా..
లేక ఎదురీదని ప్రేమ ఎందుకనుకోనా! 

నేను తాకంది నామది తాకెనననా..
లేక ప్రేమించడం నీలక్ష్యం కాదనుకోనా!

                        ***

25 comments:

  1. మీమాంసలో
    నో ప్రశ్నలు
    నో జవాబులు
    జీవితం ఇంతే

    ReplyDelete
  2. మనసుని తాకే పదాలు బాగున్నాయి.

    ReplyDelete
  3. నమ్మకం కోల్పోయినప్పుడు ఉద్భవించేవే ఈ ప్రశ్నించుకోవడాలు తర్జనభర్జనలు పద్మగారు.
    అయినా ప్రేమ అనుకుని పుట్టదుగా అనుకుని బాధపడి ఆలోచించడానికి మీకు తెలియనిది కాదు.

    ReplyDelete
  4. ప్రేమ వైఫల్య చిహ్నాలు.

    ReplyDelete
  5. నాదీ అనుకున్నప్పుడు ఏం చేసేందుకైనా జంకరు
    మన అనుకుని చూసినప్పుడు ఏదో చేసేయాలనే ధ్యాసుండదు

    ReplyDelete
  6. ఓక్కోసారి తన వారి ఆప్యాయతయే చేదులా అనిపించే వేళ
    మాటలన్ని మౌనాలై మస్తిష్కాన్ని మభ్య పెట్టే వేళ
    తోబుట్టువు సైతం తనవారి ప్రేమను పక్షపాతమని అవహేళన చేసే వేళ
    తగదు తగాదయని తటపటాయిస్తు తడికన్నుల తేమను తల్లడిల్లి తుడిచే వేళ
    ఎటూ తేల్చుకో కుండ కోలుకోలేని వ్యథను తట్టుకుంటు ఎటూ తేలని మిమాంసలో కన్నవారు ఉన్న వేళ

    ఆలంబన సహారా

    ReplyDelete
  7. సున్నితమైనపదాలతో మనసులోతుల్లో వెతుకులాట

    ReplyDelete
  8. ప్రేమలో జాబులు జవాబులు ఉంటాయా?
    మీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే

    ReplyDelete
  9. అనురాగం ఉన్న చోట అనుమానం అన్నట్లు ఉంది కవిత. చిత్రం కనులకు ఇంపు.

    ReplyDelete
  10. nuvvu takani varu
    madi takada bagundi

    ReplyDelete
  11. వలపు లోపం ఉందనుకోనా?

    ReplyDelete
  12. ప్రేమ దోమా
    ఎందుకు?
    హాయిగా
    ఎగిరిపోక!

    ReplyDelete
  13. అతిగా ఆలోచించే వారిలో ఇలా ప్రశ్నించి వారిలో వారు మాట్లాడుకుని జవాబులు కూడా వెరికి వారే చెప్పేసుకుంటారని ఎక్కడో చదివిన గుర్తు.

    ReplyDelete
  14. నీలక్ష్యం?

    ReplyDelete
  15. మీమాంసలో still unara?

    ReplyDelete
  16. విడివిడిగా ప్రతిస్పందన వ్రాయాలన్నా
    ఏదో తెలియని మీమాంసలో...
    మనసు తర్జన భర్జన పడుతుంది
    అందుకే ఇలా ఒగ్గేయండి నన్ను _/\_

    ReplyDelete
  17. ఒక్కోసారి నవ మాసాలు మోసి కని పెంచిన వారే అమాంతం వారి సంతానం పై పగ పెంచుకునేంతగా ద్వేషించేలా వ్యవహరిస్తుంటే ఇక తోడ బుట్టిన వారిని అని ఏమి లాభం.. కడ దాక కోపాన్ని వీడక అల్లకల్లోలమైన మనసును పదే పదే రేకేతించే వేళ మనసు పడే మథనం మిమాంసయే కదా.. ఎవరిని తప్పు పట్టలేము.. ఎవరిని నిందించలేము.. మానసిక క్షోభలో కూరుకుపోయాక తేరుకునే వీలు లేని మిమాంస

    ReplyDelete