ఖబడ్దార్ కరోనా..


రానా వద్దాని అడక్కుండానే వచ్చిసచ్చిందిగా కరోనా..
కలవరమెందుకు దాన్ని తరిమికొట్టడం మనకు చేతకాకనా
అన్నీ శుభ్రంగా కడుక్కోవడం మనకు తెలియదనుకునా
వచ్చాక చావకొట్టే ప్రయత్నం గట్టిగానే చేద్దాం ఏదేమైనా!

ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి మమ్మల్ని హడలుగొడతావేమే కరోనా..
ఎడమెడంగుంటూ కలవకుండా నిన్ను మట్టు పెట్టలేమనా
బయట తిరక్కుండా ఇంటిపట్టునుంటే నీకు లేదుగా టికానా
రెక్కాడితేగాని డొక్కాడని మాతో పెట్టుకోకే చుప్పనాద్దానా!

తుమ్ముదగ్గు జలుబు జ్వరంగా వచ్చి జలదరింప చేయకే కరోనా..
మాస్క్ ముసుగేసుకుంటే నీకు ఊపిరాడదంట అవునా
ఎప్పుడెలా అంటుకుంటావోనని చస్తూ బ్రతుకుతున్నాం ఏదైనా
మేమంతా తలచుకుంటే నిన్ను నాశనం చేయడం పెద్దపనా!

ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తాం కాచుకో కరోనా..
ధైర్యమే మా ఆయుధం తెలుసుకోవే కర్కోటకమైనదానా
ఇరవైఒకటి రోజులు ఇంట్లో ఉండి దీక్ష చేస్తున్నాం పారిపో సైతానా
 కోవిడ్-19 పుట్టగతుల్ని కాల్చిబూడిద చేయడానికి అందరూ రెడీనా!

39 comments:

 1. ఇసుక రేణువంత కూడా లేని కోవిడ్ ౧౯ వైరస్
  జన సంద్రాన్ని అతలాకుతలం చేసేంతగా
  రచ్చ గెలిచి ఇంట గెలవాలని ఫోకస్
  హుబేయి వుహాన్ నుండి ఇంపోర్ట్ అయ్యిందిగా
  ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అవుతోంది డిస్కస్
  మాస్కులతో ఓవర్ కోట్ లతో ఐసోలేషన్ పకడ్బందిగా
  నాలుగు ఖాండాలలో వ్యాపించి మార్చేను ప్రపంచ స్టేటస్
  వ్యవహరించాలేమో లాక్ డౌన్ లో మనమంత దురుసుగా
  అపుడే కొంత లో కొంత మేరకు చల్లబడుతుందేమో రక్కస్

  ReplyDelete
  Replies
  1. Controversial Onset Reduced Offset Novel Anti-human Vulnerable Immunity Revoking Ubiquitous Syndrome

   #CoViD

   Delete
  2. 05/04
   05:P+04:P
   00:09:00
   Torch, Flashlight, Candle,
   Bonfire, Clay Lamp, Lantern,
   Daytime Running LED Lights,
   Halogen Projection Lamp, Laser Baton

   #CoViD
   Fight Against Corona

   Delete
  3. కోవిడ్ ఒక కండీషన్ మాత్రమే
   ప్రతీది ప్రకృతిలో మిళీతమే
   కాకపోతే తక్కిన వాటిని అణగార్చే శక్తి దేహానికి కాస్తో కూస్తో ఉన్నా
   ఈ కరోనా విచ్చలవిడితనాన్ని అరికట్టే స్థాయికింకా ఆమడ దూరంలో ఉంది ఇమ్యూనిటి
   వ్యాధి గురించి తెలిసినపుడు ఇదేదో నిపా హంటా పెంటా రోటా అనుకున్నారు
   ప్రపంచాన్ని తలకిందులు చేసి గందరగోళం సృష్టించి విలయ తాండవం చేస్తునపుడు శరణని వేడుకోలు
   ఊపిరి బిగపట్టుకుని మ్యాస్కులతో సహజీవనం చేసేలా ప్రేరేపిస్తున్న ఈ సో కాల్డ్ మహమ్మారి సైతం ఏదో ఒక రోజు చరిత్ర పుటల్లోకెక్కాల్సిందే
   అప్పటి వరకు ఎవరి జాగ్రతలో వారుంటే అదే అందరికి శ్రీరామరక్ష
   ఎవరి ఆరోగ్య రక్షణకు వారే బాధ్యులు

   Delete
  4. Everyone is suffering Alike.. Never Get Disheartened.. Solar Minimum due to Corona, Depletion of Geomagnetic Field, CoViD-19 Coronavirus Pandemic.

   Delete
  5. Samasyalanevi Saashwatam Kaavu
   Vaati Vaati Naanyatanubatti
   Manalo Manake Jarige Tarjana Bharjana Aatupotla Sangharshanalonchi Udbhavinche Bhaavodwegaala Saaram.

   #CoViD

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. జీవితం లో కనిపించిన కవల సంవత్సరమని మురిసిపోయాం.. అంతలోనే కరోనా గుట్టు చప్పుడు కాకుండా తరలి వచ్చింది..
   మనసు వికలంగ ఉందని ఒకరితో పంచుకుందామన్నా తుంపరలో భూతం దాగుందో ఏమో అని భయాందోళన
   తోటివారిని హత్తుకుందామన్నా *ఇరవై అడుగుల* దూరం శరణమట
   ఏ భావోద్వేగానైనా పంచుదామన్నా నోటికి మ్యాస్క్
   బయట కేగుదామన్నా వచ్చే పోయే వారికెవరికైనా కోవిడ్ ఉండ వచనే సూచన

   శార్వరి ఉగాది కాస్త కరోనా శరాలతో విఘాతమే కలిగించింది
   లోకాన ఎక్కడలేని గందరగోళ స్థితికి తెర తీసింది
   వందలు వేలు లక్షల పై చిలుకు కు ఎగబాకుతు ఉంటే బాధితులు
   ఉపశమనమేమిటో తెలియక దిక్కు తోచని స్థితిలో అన్యులు
   జ్వరమొచ్చినా కాలు కీళ్ళు ఆఖరికి ఒళ్ళు హూనమైనా ఎటొచ్చి కోవిడ్ కేంద్రాలే అన్ని

   లాక్ డౌన్ పుణ్యమా అని కాస్తో కూస్తో కోవిడ్ నుండి ఊరట లభిస్తే
   ఎత్తివేస్తే వైరస్ ఉధృతితో కకావికలం
   కలకాలం ఉంచితే ఎక్కడి వారక్కడే ఆకలి కేకలతో అతలాకుతలం
   సడలిస్తే అత్యవసరాలకు మించి
   మహమ్మారి ఉంటుంది అక్కడే ఎక్కడో పొంచి

   రైబో న్యుక్లిక్ యాసిడ్ తో ప్రోటిన్ షెల్ స్ట్రక్చర్
   టీకా తో తడబడుతు పటాపంచల్
   ఐతే "హూ ఇజ్ గోయింగ్ టు బెల్ దీ క్యాట్"
   ధైర్యం, సహనం, ఓర్పు, విశ్వాసం, నియమ నిబంధనలు, విధి విధానాలు, కార్యాచరణ ప్రణాలి అన్నిటికంటే చిత్తశుద్ధితోనే మరి పారద్రోలాలి మనమీ మహమ్మారిని
   యావత్ ప్రపంచాన్నే తలకిందులు చేసి ఆడిస్తున్న రక్కసిని

   Delete
  8. ఈ కోవిడ్ కాలం లో
   ఎక్కడున్నామనేది కాదు.. మనమెంత క్షేమంగా ఉన్నామనేదే అసలైన విజ్ఞత.
   రోజురోజుకు దావానలమై రాజుకుంటు వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళనకరం..
   ప్రయాణాలంటు కోవిడ్ బారిన పడి ఆరోగ్యం క్షిణించి ఒంటరిగా క్వారెన్ టైన్ కావడం కంటే జాగ్రతలు పాటిస్తు క్షేమంగా ఒక చోట కలసి ఉండటం శ్లాఘనీయం..!
   ఏదో ఒక రోజు కోవిడ్ అస్తమయం కాకుండ ఉండబోదు.

   Delete
  9. Sleepless Nights
   Agonized Minds
   Overcoming Fears
   Amidst Ordeals
   It is all but what this CoViD Phase has been teaching India and the World These Days.

   We need to Cope Up before We Cough Up
   😷

   Delete
  10. Mask is Always Better than Ventilator
   Home is Always Better than Intensive Critical Care Unit
   Six Feet Social Distancing is Always Better than Six Feet Pyre.

   #staysafe
   #covid

   Delete
 2. మనిషి జీవనవిధానాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నీకు ఖబర్ధార్ అని అరచి గగ్గోలపెడుతున్నాము కరుణించి శాంతించి చల్లగా జారుకోవమ్మా.

  ReplyDelete
  Replies
  1. ఖబడ్దార్ అంటే అది కరుణిస్తుందా? మీరు దాన్ని ప్రార్థిస్తున్నారా లేక హెచ్చరిస్తున్నారా?!

   Delete
 3. Nice Post.
  First immune system strengthen chesukonelaa prajalo avagaahana kalpinchaali next virus organism, activity, daani avoid chese paddathulanu kevalam eppudu maatrame kaakunda eppudu prajala minds lo register ayyela commercial publicity cheyyali.

  ReplyDelete
 4. Is this really a Corona Photo :)

  ReplyDelete
 5. అదలక ఇంట్లో ఉంటే కరోనా రాదు

  ReplyDelete
 6. పడ్డ హైరానా అంతా హుష్
  మీ కరొనా కవిత బాగుంది.

  ReplyDelete
 7. ఎక్కడ చూసినా కరోనా బూతమే
  చివరికి మీరు కూడా ఇవే వ్రాసారు,
  ఓ పసందైన పద్యం మీ నుండి వస్తే చూసి ఆనందిస్తాము

  ReplyDelete
 8. ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి.

  ReplyDelete
 9. అందరూ రాసిందే మీరు రాస్తే గొప్పతనం ఏముంది. ఏదైనా వెరైటీగా రాయడమే మీ స్టైల్ అది కరువైంది ఈ పోస్ట్లో

  ReplyDelete
 10. భయపెట్టకండి పాపం :)

  ReplyDelete
 11. ఈ కరోనాలు వైరసులు ఏమో కానీ ఇంట్లో పిచ్చెక్కిపోతుంది
  మీరు మనసుకి అహ్లాదంగా ఉండే పోస్టులు వ్రాయండి కనీసం ఉల్లాస పరుస్తాయి వాటిని చదివి.

  ReplyDelete
 12. No CORONA
  No Tension
  Be at home
  Be HAPPY

  ReplyDelete
 13. vaddante vachchina
  pommante potundi mana buddulu marchina taruvata.
  anta mana chetullo undi.

  ReplyDelete
 14. Follow all safety measures.

  ReplyDelete

 15. కరోనా కబడ్దార్


  ReplyDelete
 16. good affords in poetic way.

  ReplyDelete
 17. anta bhayankaramga untunda karona

  ReplyDelete
 18. కరోనా...ఈ కవితతో చచ్చావుగా 😂

  ReplyDelete
 19. పద్మార్పితగారు ఎలా ఉన్నారు?
  కరోనా అంటూ కసికళ్ళతో తిట్టి తరిమివేయ రండి...వచ్చి మాంచి భావుకవిత్వం ఒకటి రాసేద్దురూ

  ReplyDelete
 20. కరోనా పై ఏదో రాసి అందరిలో భయాన్ని కొంతైనా తొలగింతాలనుకుని చేసినా ఈ ప్రయత్నం అంత కుదరలేదు అనిపిస్తుంది. మీరు అందరూ రాసిన ప్రోత్సాత్మక వ్యాక్యలకు పద్మార్పిత సదా గులాము _/\_

  ReplyDelete
 21. మీలాగే కరోనా సమయంలో సహాయపడుతున్న ప్రతీ ఒక్కరికీ వందనాలతో నాదో కవిత పద్మార్పిత గారు.
  http://srushti-myownworld.blogspot.com/2020/04/blog-post_22.html

  ReplyDelete
 22. అందరూ భయం భయంగా బ్రతుకుతున్న రోజులు

  ReplyDelete