విన్నవించవా!!!

ఓ చందమామ.... నాపై వెన్నెలని కురిపించవా
మదిలోని వేదనని మరిపించి మురిపించవా
ఇరువురి నడుమ ఉన్న ఎడబాటుని దూరంచేయవా
సుందర స్వప్నాలలో మమ్ము విహరించ నీయవా!

నేనొక స్వప్నాన్ని నన్ను ప్రేమించమనకు
ప్రేమిస్తే ఇంక నన్ను మరువమని అనకు
గాలితెమ్మెరలు వచ్చిపోతుంటాయని చెప్పకు
కలువకు నీకు నడుమ ఉన్న ఎడబాటుని గుర్తుచేయకు!

పగలు రాత్రి కూడా కలిసే అవకాశముందని చెప్పు
కొమ్మ నుండి వేరైన రెమ్మ కూడా విరబూస్తుందని చెప్పు
వెన్నెలంటి మనస్సుందని నన్ను నీతో పోల్చి చెప్పు
నా పిచ్చి కాని...ఏం చెప్పాలో నీకు తెలియదా చెప్పు!!!

16 comments:

  1. మరేం, ఏం చెప్పాలో అన్ని చెప్పేసి, చివర్లో ఆ కొసమెరుపెందుకటా, వలపులో కూరుపోయినా కాని, మహా జాణతనం వుందే మీ నాయికలో!

    ReplyDelete
  2. నా నాయికకి ఆ జాణతనమే ఆభరణమండి..
    అందానికి తోడు జాణతనం లేకపోతే ఎలా చెప్పండి..

    ReplyDelete
  3. it is wonderful poetry narrating by you. awesome and making us feel to visit this blog again and again. you are great.

    ReplyDelete
  4. మునగచెట్టు ఆసరాగా మరో గట్టి మెట్టు కట్టుకున్నారు కదా ... బహుబాగు

    ReplyDelete
  5. యెంకిని గుర్తు చేశారు.. బాగుంది..

    ReplyDelete
  6. పద్మార్పిత గారు
    అన్నీ మీరే చెప్పేస్తే మేము చాలా బాగుంది అని తప్ప ఏమీ చెప్పలేకుండా చేసారు ..:)

    ReplyDelete
  7. Suresh thanks for your valuable comment!

    @ విజయమోహన్ గారికి, మురళీగారికి, హరేకృష్ణగారికి ధన్యవాదాలు!!!
    @ భాస్కర రామిరెడ్డి గారు...ఒక్కో మెట్టు ఎక్కడానికి మీరు అందిస్తున్న వ్యాఖ్యా చేయుతకి కృతజ్ఞతలు!

    ReplyDelete
  8. అమ్మో!!!! ఎంత తెలివండి....
    నాకు కూడా ఇవ్వచ్చు కదా కొంచెం!

    ReplyDelete
  9. మీ కవితలే కాదు అందులోని కధానాయికలు కూడా కవ్విస్తున్నారండి!!!!

    ReplyDelete
  10. mee blog o albumlaa vumdi. vennelaku virahaaniki vunna teeyani bandham hrudyamgaa chepparu.

    ReplyDelete
  11. ఈ కవితకన్నా బొమ్మ చాలా బావుంది. పద్మార్పిత గారి టచ్ కనబడలేదు. ఏదో సినిమా పాట సాహిత్యం అన్పిస్తోంది.

    ReplyDelete
  12. "నా పిచ్చి కాని...
    ఏం చెప్పాలో నీకు తెలియదా చెప్పు!!!"

    తెలిస్తే చెప్పనా చెప్పు... బాగుందని...

    ReplyDelete
  13. ఏవండి మీ కవితలు చాల బాగున్నాయి ,,వాటికీ దగ్గట్టుగా మ్యాచ్ అయ్యేట్టుగా పిక్చర్స్ పెట్టారు ...బాగున్నాయి

    ReplyDelete
  14. Padmarpitha garu asalu meeku mere stai andi adi edina photo ayeina poetry ayeina Best of luck andi

    ReplyDelete
  15. పద్మార్పిత గారూ!
    నిజమె సుమా జాణతనం లేకుంటే తావిలేని పూవులా ఉంటుందేమో కదా? చాలా బాగా చెప్పారు. సుకుమారమే కాదు తెలివితేటలు కూడా వనితల సొంతం.

    ReplyDelete