భగవంతుడా!
అందమైన రూపాన్ని ప్రసాదించవేల?
నిర్మలత్వాన్ని మించిన నిగారింపు నీకేల!!!
ఆనంద ఢోలికలలో ఊగించవేల?
తృప్తిని మించి ఆనందము ఉన్నదందువా బాల!!!
అష్ట ఐశ్వర్యాలను ఒసగరాదటేల?
ఆశాసౌధాలకి అంతమే లేదేల!!!
ప్రేమానురాగాలను అందించరావేల?
ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోమని వేరే చెప్పాల!!!
ఇందరిలో నాకే ఇన్ని కష్టాలేల?
మెరిసేదంతా పుత్తడి కాదు తెలుసుకోవేల!!!
మనశ్శాంతిని కలుగచేయ రావేల?
రాగద్వేషాలలో నీవు బంధీవైనావేల!!!
ఎదుటి వారికొరకై నే ప్రార్ధన చేయనేల?
చేయూతనీయని చేతలులేని ప్రార్ధన చేయు పెదవులేల!!!
భగవంతునికి విన్నవించారా లేక ప్రశ్నించారా?
ReplyDeleteఅమ్మో!ఆయన ముందు మనమేమి తట్టుకోగలమండి?
* అన్నీ ఆ జగన్నాటక సూత్రధారి లీలలే. అసలుకి స్క్రిప్ట్ కూడా ఆయనే వ్రాసేసి మనతో నాటకాలాడించి వినోదిస్తాడు. అలా తెలియని విషయాలు అప్పటికప్పుడు నేర్చుకుని బండి లాగించెయ్యటమే. కాస్త బుద్దిమతి చేసిన నిందాస్తుతిలా మరి కాస్త మందమతిలా అమాయకంగా ప్రశ్నిస్తూ రామదాసు గారి చెరసాల పద్యాల్ని తలపుకి తెచ్చారే.
ReplyDeleteబొమ్మ మీరే వేసారా??? బాగుంది కవిత ,బొమ్మ :)
ReplyDeleteవినని పాలు కూడా వుంటాయా?
ReplyDeleteబావుంది
టచ్ చేసారు
nesthama padma garu,
ReplyDeletebagavanthudini prashnichara ala prashnishe ela andi manamu, ayien nevu adigina vidhanmu bagundi, bomma kuda chala bagundi nesthama good keep it up
best of luck
harish varma
ప్రతి ద్విపదలోనూ పై పాదంలో విన్నపం , క్రింది పాదంలో దానికి సమాధానం ..
ReplyDeleteఇలా చాలా చక్కగా సాగింది సంవాదం !
జానపదులు పాడుకొనే " తత్త్వాల "ను జ్ఞప్తికి తెచ్చారు.
అభినందనలతో .....
డా || ఆచార్య ఫణీంద్ర
అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు.
ReplyDeleteరాగ ద్వేషాలు ఎరగని వాడు.
కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు?
స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ
చేసే అన్యాయాలెన్నో?
నరకముందంటూనే చేసే పాపాలెన్నో?
విన్న పాలూ ..సమాధానాలూ ....బావున్నాయండీ ...
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు.....ఆలస్యమైనందుకు మన్నించాలి...
ReplyDeleteబాగుంది
ReplyDeleteనా ఆలోచనేమిటంటే
విధాతను ఎందుకు ప్రశ్నించడం మన విజ్ఞానాన్ని ప్రశ్నించుకోలేమా??