మనసు విప్పి మాట్లాడు!
నీలోని భావాలకి ఒక రూపం ఏర్పడుతుంది.
చిలిపి తగవులతో నాతో పోట్లాడు!
బుజ్జగించడానికి నాకొక వంక దొరుకుతుంది.
మనస్పూర్తిగా నన్ను ప్రేమించు!
ఆ ప్రేమే జీవితానికి ఒక ఆలంబనమౌతుంది.
అంతులేని అనురాగాన్ని చూపించు!
అనురాగమే నా ప్రేమకి ఒక ఆకారాన్నిస్తుంది.
నీ కంటిపాపలో నన్ను సింగారించుకో!
లోకమంతా రంగులమయమై కనిపిస్తుంది.
నీ పెదవులపై చిరునవ్వుగా నన్నుంచుకో!
జీవితమే ఆనంద ఊయలై ఊగుతుంది.....
బాగుందండి.. బొమ్మ అతికినట్టు సరిపోయింది..
ReplyDeleteకవిత చాలా బాగుంది.
ReplyDeleteevandyyoooooooo padma garuu chala bagundi andi keep it up nesthama
ReplyDeletebest of luck
evamdi padma garu neu harish varmani andi mee kavitha chala chala bagundi emiti andi late ayyindi ekkadikina velalra nesthama
ReplyDeleteమురళీగారు ధన్యవాదాలు.
ReplyDeleteజయచంద్రగారు థాంకసండీ.
హరీష్ గారు కొత్తగా ఈ మిర్చీ ఘాటు ఏమిటా అని ఆశ్చర్యపోయాను. మిర్చీతో కామెంట్ పెట్టినందుకు కారం కారంగా మీకు థాంక్స్, ఎంతైనా మా నేస్తం మంచి బాలుడు.
పద్మార్పితగారు... బొమ్మ, కవిత రెండూ కేకండీ!!
ReplyDeleteనీ బ్లాగులొ నా వ్యాఖ్య ప్రచరించు
ReplyDeleteబ్లాగ్లోకంలొ నా పెరు చుసుకుని మురుస్తా!!
just kidding:)
బాగా రాసారు.
ఈసారి ఇలా ప్రయత్నించి చూడండి...
ReplyDeleteమీ కవితలన్నీ ఏ వాక్యానికా వాక్యం స్వంతంత్ర్యంగా మిగిలిన వాక్యాలపై ఆధారపడకుండా ఉన్నాయి. అలా ఉండకూడదనికాదు కానీ, అన్నీ ప్రయత్నించాలి కదా... కవితలోని ప్రతీ వాక్యం ముందరి/తరువాతి వాక్యం పై ఆధారపడేలా (కవిత మొదటి నుండీ చివరి దాకా ఒకటే వాక్యమైనా ఫరవాలేదు. వాక్యాన్ని లైన్లకింద విడగొట్టుకోవచ్చు.) ప్రయత్నించి చూడండి. తేడా మీరే చూడండి.
తృష్ణ గారు ధన్యవాదాలు.
ReplyDeleteబృహస్పతిగారు నా బ్లాగ్ కి స్వాగతం. ఒక చిన్న మచ్చుక పంపి వుంటే ఇంకా సంతసించేదాన్ని.
ఐనా తప్పక ప్రయత్నిస్తాను. మీ సలహాలతో వికాసం చెందాలని ఆశిస్తూ...
అత్యంత బాగుంది అంటే చిన్నబోతుందేమో మీ కవిత!
ReplyDeleteపద్మార్పిత గారూ ! ఐతే అలిగిన వేళ చెలికాని చూడాలని ఉందన్నమాట !
ReplyDeleteబావుందండీ .....మీ బుజ్జగింపు కూడా చూడాలని ఉంది మరో కవితలో ...
పద్మార్పిత గారూ,
ReplyDeleteమీ ఈ కవిత బాగుంది. కాస్త కవితా రూపం ఇవ్వాల్సిందేమో అన్పించింది. చివరి లైన్ నిజంగా ఒక చక్కటి హైలైటు.
బాగుంది.
ReplyDelete" ఊయల " కన్న " డోలిక " అనండి.
మరింత బాగుంటుంది.
అభినందనలు !
చాలా బాగుంది పద్మ గారు
ReplyDeleteపద్మ గారు నేను కూడా రాసానూ
ReplyDeleteచూసీ ఎలా అనిపించింది చెప్పగలరూ
మీ మిర్చీ వర్మ ఒక మంచి పిల్లొడు
నా మీదకే నెట్టారూ... సరే, భరించండి
ReplyDeleteమేఘాల లహరిలో విహారినై
ఈ వినువీధిలో నే విహంగానినై
విస్తూ పోతూ విభ్రమంతో
ఈ వింతలు చూసి సంభ్రమంగా
నీలి మేఘాల సోయగాలలో
విస్మయంతో నే విహరిస్తూ
తనువుని సైతం విస్మరిస్తూ
మబ్బుల దిండు పై విశ్రమించి
నా కోరిక నప్పుడు విన్నవిస్తా
నే చెప్పదలుచుకున్నదేమిటంటే, మీ కవితలలో వాక్యాలకి సుస్థిర స్థానం లేదు. ప్రతి వాక్యం స్వతంత్ర్య ప్రతిపత్తి ని సాధించుకుని, కవిత మొత్తం లో ఎక్కడైనా నిలుపుకోగల పధ్ధతిలో సాగింది. ( ఉదాహరణకు పై కవితలో 'మనసు విప్పి ...ఏర్పడుతుంది' తరువాత 'మనస్ఫూర్తిగా...ఆలంబనమౌతుంది' అని వచ్చినా భావానికి గానీ రూపానికి గానీ వచ్చిన ఇబ్బంది లేదు.) ఇలా రాయటం సులభం. కనుకనే మరి కాస్త కష్టపడి చూడండి. ఇక మీ సృజనాత్మకత, కవితాత్మకత, భావుకత లు వంక పెట్టలేని విధంగా ఉన్నాయి.
నా కవిత ఏదో గొప్పదని నేను భావిస్తున్నాననుకునేరు. కేవలం ఉదహరించటానికి మాత్రమే ఇక్కడ ప్రచురించాను.
బొమ్మ చాలా బావుంది.
ReplyDeletebagundandi mee bujjaginpu,,,,chelikaadu vuyalalone nidrapotademo....any way bagundandi,,,,
ReplyDeletemeeeru naa blogs kuda chudagalaru,,ela vunnayoi cheppandi
సృజనగారికి, పరిమళంగారికి, యేహంత్ గారికి, శిరాకిపుత్రగారికి, నేస్తం కి, అంజుగారికి ధన్యవాదాలు.
ReplyDeleteఫణీంద్రగారు 'డోలిక" అని రాసి ఉంటే ఇంకా బాగుండేది... ఎంతైనా మీ అంత గొప్పగా రాయలేనులెండి. ధన్యవాదాలండి!
ReplyDeleteకొత్తపాళీ గారు బహుకాల దర్శనం...చూసారా!!! నా బ్లాగ్ లో మీ వ్యాఖ్యతో ఒక మెరుపు మెరిసింది. మెరిపించినందుకు ధన్యవాదాలండి.
పద్మార్పిత గారు
ReplyDeleteకవిత చాలా బాగుంది.
బృహస్పతి గారు ఇప్పుడే మీ వికాసం చూసి వస్తున్నాను. మంచి ప్రయత్నం. ఇక ఈ కవితపై మీ సూచనలు బాగున్నాయి.
బొల్లోజు బాబా
బాబాగారు...చాలా రోజుల తరువాత నా బ్లాగ్ కి విచ్చేసారు, ధన్యవాదాలండి.
ReplyDeleteఇకపోతే బృహస్పతిగారు చెప్పినట్టు వ్రాసే ప్రయత్నం చేసి ఏవైనా తప్పుగా వ్రాసి భంగ పడతానేమో అని భయంగా ఉందండి..
మీ కవిత తో పాటు మీరు ఇచ్చే చిత్రం ప్రతిసారి చాలా అకట్టుకుంటాయి. మీ సృజనాత్మకతకు జోహార్లు. వాక్యాల మద్య లింకుందాలని రాసారు పెద్దాయన, కాని ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. కంటిన్యూకండి. భావుకత అద్భుతం.
ReplyDeleteనా కొత్త బ్లాగు సహచరుదు చూదగలరు. sahacharudu.blogspot.com.
ReplyDeleteనా ఈ మాటలే పదే పదే గుర్తుకొచ్చాయి మీ కవిత చూస్తే...
ReplyDeleteనీ కనురెప్పల కావలి నేనై నీ చూపు నాపైనే నిలుపుకుంటాను,
నీ గుండె గుడి దీపమై నా చెలిమి చమురు నింపుతాను,
నీ పలుకుల తేనియనై మన సంగమ కృతులు ఆలపిస్తాను,
మళ్ళీ వస్తావా ఒక జీవిత కాలానికి నా అతిధిగా, అపురూప వరంగా?
Ushagaru... beautiful! thanks a lot.
ReplyDeleteవర్మగారు ధన్యవాదాలండి.
ReplyDeleteHi Padma,
ReplyDeleteI am managing telugusms.blogspot.com and thanks for your contribution. In future if you are willing, please do send me good telugu sms to my email id, so that I can make a blog entry and do give a link back to your blog. Please do contact me at webmasters.consortium@gmail.com
regards
పద్మ గారు, అదరగొట్టారు...తేలికయిన పదజాలంతో లోతైన భావం పలికించారు...
ReplyDeletesimple words and deep feeling i like it very much.keep going my friend.
ReplyDeletemodati nalugu panktulu chaala adbuthamgaa unnaayi.
ReplyDelete-tirupati peddy