జీవితం నాకు నేర్పింది..
ఎవ్వరిమీద ఆధారపడవద్దని
ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని!
జీవితం నాకు నేర్పింది..
నన్నునేను ప్రేమించమని
ఎదుటివారిలో మంచిని ఎంచుమని!
జీవితం నాకు నేర్పింది..
నీకు ఏదీ చెడుగా కనపడదని
ఎదుటివారి దృష్టితో చూడమని!
జీవితం నాకు నేర్పింది..
నీదికానిదానిపై మక్కువ వలదని
దక్కిన దానితో తృప్తి పడమని!
జీవితం నాకు నేర్పింది..
మంచివాడు మోసం చేయలేడని
మోసగాడు మంచిని చూడలేడని!
జీవితం నాకు నేర్పింది..
సంతోషాన్ని నీవు వెతకవద్దని
వెతికితే సంతోషం దొరకదని!
Chala Bagundi.
ReplyDeleteChala Bagundi
ReplyDeleteచాలా చాలా బావుంది పద్మార్పిత గారూ.. ప్రతీ ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినవి ఇవన్నీ.
ReplyDeleteబాగుందండి...
ReplyDeleteజీవితం నాకు నేర్పింది,
ReplyDeleteనీతోడు వీడొద్దని,
వీడిని మరుక్షణం బ్రతకొద్దని.
పద్మార్పిత గారు చాలా బాగుంది.
పూలబాణాలు సంధించినా, జీవిత సత్యాలు విరచించినా.. పద్మార్పితకే చెల్లు. బాగున్నాయి కవితలు నేస్తం.
ReplyDeletechala bagundi andi padampritagaaru,
ReplyDeletekaani last rendu line loni nirasaa gaa unnayii...naaku avi nachchaledu.
What u want to convey is gr8 friend. But something is missing in this one.
ReplyDeleteజీవితం నాకు నేర్పింది..
సంతోషాన్ని నీవు వెతకవద్దని
వెతికితే సంతోషం దొరకదని!
I don't agree with this one. Happiness eludes those who don't go after it.
Happiness likes those who search for it.
vedikithe dakke ekaika nidhi santhosham.
nice
ReplyDeleteఅబ్బో..! బాగుందే..!
ReplyDeleteజీవితం నేర్పిన పాఠాలు జనరంజకంగా చెప్పారు. తానందించిన అపురూప అవకాశాల గురించి ప్రస్తావించలేదే. అదే తృప్తికి, ఆనందానికి మూలం. శోధనలోనే సౌఖ్యం వుంటుంది. నిర్వేదంలో శోకం వుంటుందనీ. సాధన మానకనీ సహనం వదలకనీ కూడా నాకు నేర్పింది. ఇవన్నీ పేనిన సంతృప్తి నా మదిలో సంతోష దీపం వెలిగించింది, శాంతి గీతం ఆలాపించింది. అవును జీవితం గడుస్తూ నన్ను పెంచి పెద్ద చేసింది.
ReplyDeleteపద్మార్పిత గారు మంచి విషయాలు చెప్పారు
ReplyDelete"నీకు ఏదీ చెడుగా కనపడదని
ReplyDeleteఎదుటివారి దృష్టితో చూడమని!"
చాలా బాగుందండి.
adrushta vantulu
ReplyDelete