పుష్పమా!! నీవింత సుకుమారమా!
తుమ్మెద వాలితేనే త్రుళ్ళిపడేంత భయమా!
గాలికి కూడా ఊగిసలాడే అంత బేల తనమా!!!
ఇలలోని రంగులన్నీ నీకే సొంతమమ్మా!
భగవంతునికి మాకు మధ్య వారధివమ్మా!
ప్రేమను తెలిపే ఒక సాధనం నీవమ్మ!!!
నీ సువాసనలన్నీ మేము దోచుకుంటాము!
జ్ఞాపకాల గుత్తులుగా నిన్ను దాచేసుకుంటాము!
నిన్ను చూసే నవ్వడం మేము నేర్చుకున్నాము!!!
నీవు మౌనంగానే ఊసులాడగలవేమో!
చలికి ముడుచుకుని చెమ్మగిల్లుతావేమో!
తెల్లవారితే మరల నీవెట్లు విరబూయగలవో ఏమో!!!
బాగుందండి పుష్పవిలాసం..
ReplyDeleteభాగుంది.
ReplyDeleteఇవేనా పూలు చేసేది? నెచ్చెలికి మన ఊసులు చెబుతాయి... మనకెన్నో కబుర్లు చెబుతాయి, మన మౌనాన్ని వింటాయి.
వాటినలా చూస్తే మనకెన్నో ఊసులు చెబుతాయి కూడా.
గమ్మత్తుగా వ్రాశారు ఈ కవిత.
బాగా రాసారు .. మరి రుద్రార్పిత అవుతా అని అన్నారు అదెప్పుడుమరి :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteరుద్రార్పితని మరచిపోయి కాసేపు పుష్పార్పిత అయ్యారు లెండి పద్మ గారు....అంతేనా పుష్పార్పిత గారు :)..
ReplyDeleteకలువల పుష్పగుచ్చమా ? బాగుందండి.
ReplyDeleteపద్మార్పిత గారూ,
ReplyDeleteచక్కగా వుంది. ఈ కవితలో ఎలాంటి బాధాఛాయలు లేకుండా మధురంగా వుంది.
మురళీ గారు, గీతాచార్యగారు ధన్యవాదాలు!
ReplyDeleteఆత్రేయగారు అడిగారని ఆవేశానికి అక్షర రూపమిద్దామని ఆలోచిస్తుంటే ఆయసం తప్ప అంగుళం కూడా ముందుకి కదలడం లేదు నేస్తం!
కిషన్ రెడ్డిగారూ మీరు కూడ నన్ను రౌద్రం మీద వ్రాయమనడం భావ్యమా!
భాస్కర రామిరెడ్డిగారు....పుష్పం పై మీకింత అభిమానమా! ధన్యవాదాలు నేస్తమా!!!
సిరాకిపుత్రగారు కృతజ్ఞతలు..మీరన్నమాట(వ్యాఖ్య)
నాకు అందినట్టుంది ఒక పువ్వుల మూట!!!
పద్మార్పితగారు.. ఈసారి పూలబాణాలు వేసారన్నమాట!
ReplyDeleteఏదైనా మీకే చెల్లునండి...
Hi it is nice flower fragnance.... Please check my new post...
ReplyDeletehttp://sarwaforyou.blogspot.com
బాగా రాసారండి. బేసిగ్గా కవితలనే పదార్థం నా బుర్రకి కిలోమీటరు ఎత్తునుండి వెళ్ళిపోతాయి....మీ బ్లాగులోని చాలా పద్మాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి...అయినా మీరు పెట్టే images కోసం చూస్తాను.
ReplyDeleteఈసారి బొమ్మా(ఇవి కూడా మీరే వేస్తారా ..?), కవితా( ఎందుకో మరి ఈసారి కొంచెం అర్థమైంది) రెండూ బావున్నయ్.
పద్మార్పితగారూ భలే రాశాఏ. అభినందనలు.
ReplyDeleteఎప్పటిలాగానే బాగున్నది అని కాక ఏమి రాయను అని ఆలోచన....
ReplyDeleteపద్మార్పితగారు,చాలా బాగుంది..
ReplyDeleteచెప్పలేని భావమేదో నీవైపు తరుముతున్నది,
ReplyDeleteవినని మనసేమో నీ స్నేహం విడువనన్నది
సృజనగారి, సర్వగారికి, నాగార్జునగారికి, వైష్టవిగారికి, యొహంథ్ గారికి, తృష్ణగారికి, హనుగారికి ధన్యవాదాలండి..
ReplyDeleteVery smooth expression. Sensitive as well as sensible.
ReplyDeleteపుష్ప సౌరభం గుభాళిస్తోంది మీ కవితలో ...
ReplyDelete