కాయగూరలతో కబుర్లు!!!

పద్మా...పూలపై, ప్రేమపై, జీవితంపై ఇన్ని రాసావు...మమ్మల్ని రోజూ ఉపయోగిస్తూ కూడా ఒక్కటైనా మాగురించి వ్రాయాలనిపించలేదా? అంటూ ప్రశ్నించాయి....
ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తున్న నాతో...
వంకాయ...వద్దు వద్దంటూనే వండిన విధంగా వండకుండా వివిధ విధాల్లో వండుకుని తింటారంటూ వయ్యారాలుపోయింది.
బెండకాయ...జిగురని, ముదురని, పుచ్చని అంటారేకాని అందరికీ నా తెలివితేటలు ఎంతైనా అవసరమంది.
చిక్కుడుకాయ...చిన్నగా, సన్నగా, గింజవున్నా, లేకపోయినా చీల్చి చెండాడి నారతీసి మరీ వండుకుంటారని చిన్నబోయింది.
గుమ్మడికాయ...ఆకారంలో పెద్దనైన నాకు కూరల్లో మొదటి స్థానం ఇవ్వకపోయినా గృహంలో అడుగిడాలంటే నేను లేనిదే జంకుతారెందుకంటూ గుసగుసలాడింది.
మునక్కాయ...ముక్క ముక్కలై నేను మునగనిదే సాంబారుకి రుచెక్కడిదంటూ ముద్దు ముద్దుగా మూలిగింది.
సొరకాయ...సొంత సోది నాకు లేదుకాని పప్పుకి, దప్పళానికి నేను చేదోడు వాదోడునంది.
దొండకాయ...పండుగా నేను పనికిరానని, చిన్నదాన్నైనా ఉడకడానికి కాస్త బెట్టు చేస్తానంటారే కాని నన్ను ఇష్టపడేవారున్నారంది.
కాకరకాయ... చేదు చేదంటూనే దాన్ని విరచడానికి విశ్వప్రయత్నంచేసి ఆరోగ్యానికి మంచిదని కిమ్మనకుండా కమ్మగా తింటారంది.
అరటికాయ...అల్లం, ఆవపోపుతో నన్ను అలంకరించి మరీ ఆరగిస్తారు అది చాలు నాకంది.
మిరపకాయ...నేను లేనిదే మిగతా కూరగాయలకి ఉనికెక్కడిదంటూ, మీసాలు మెలివేస్తూ మిడిసిపడింది.
పొట్లకాయ...పొడుగైనదాన్నని పొగరునాకేల, పనిజరగాలి కాని పొగడ్తలతో నాకు పనియేలనంది.
టమాట...కూరగాయల సామ్రాజ్యానికే మహారాణిని, నాకు వేరొకరితో పోలికేలనంది.
దుంపకూరగాయలు...దురదని, వాతమని మా జాతిని ఎవ్వరూ వదలకుండా పిండి పిప్పిచేసినా మాకు ఆనందమేనంటూ ఆలు(బంగాళా దుంప) అలవోకగా నవ్వింది.
ఆకుకూరలు...అతితక్కువ ధరలో అందరికీ అత్యవసరమైన ఆహారం మేమేనని అదే మాకు ఆదర్శమంది.
క్యాబేజి, క్యారెట్, కాలీఫ్లవర్...దొరలనుండి దొరలి వచ్చినా మాకు భాష రాకపోయినా కాకాలు పట్టవలసిన అవసరం లేదు, ప్రస్తుతం మాదే పైచేయంది.
పద్మా!! మా పలుకులెప్పుడు ఆలకిస్తావంటూ ఫలాలన్నీ పరుగున వస్తున్నాయండి!!!
అమ్మో!!...ఇదేదో పోటీల వ్యవహారంలా తయారయ్యేటట్లు ఉందండి!!!
ఇంతటితో ముగిస్తాను.....చిత్తగించండి!!!

17 comments:

 1. భలే రాస్తారండీ!!

  ReplyDelete
 2. బీర కాయ, బెంగ పెట్టుకుంది పద్మార్పిత జట్టు పచ్చీ అందని మరి... ;)

  ReplyDelete
 3. పద్మార్పిత గారు,నిజమేనండీ బీరకాయని మర్చిపోయారు ..పథ్యానికి అవసరం కదా ..ఉషాగారన్నట్టు అలిగిందేమో ...బుజ్జగించండి మరి !

  ReplyDelete
 4. చాలా బాగుందండీ....నేను కూడా వాటితో కబుర్లు చెప్తుంటాను .వంట గదిలో ఒంటరిగా .:)

  ReplyDelete
 5. హా... ఏమిటో అందరికి బీరకాయ లేకపోయేసరికి దిగులుపట్టుకున్నది :-P

  ReplyDelete
 6. @భాస్కర్ గారూ థ్యాంక్సండి!.... :):)
  @మందాకినీగారు1...ఏదో మీ అభిమానమండి...:)
  @ఉషగారు...బీరకాయని మరిచానని అలిగిందండి, బంకమట్టితో నిండిన బ్రెయిన్ ని బెంగతో భాధపెట్టడం భావ్యమా చెప్పండి?
  @పరిమళగారు బీరకాయని బ్రతిమిలాడదామని వెళితే,....బీరు బాబులు మరచిన మన్నించేదాన్ని భామవి నీవేల మరచితివని బోరు బోరు మందండి.
  @పానీపూరీగారు..బ్లాగ్ మిత్రులు అన్నది బీరకాయ గురించి, బీరుకాయ అనుకున్నారా ఏమిటండి?:)

  ReplyDelete
 7. నేనొప్పుకోను మామిడి కాయ ఊసే లేదు ఎంత అవమానించారు.దోసకాయని కూడా మిస్ కొట్టారు హు...నేనలిగాను అంతే ...

  ReplyDelete
 8. మామిడికాయ, దోసకాయ ఇలా మరికొన్ని కాయలన్నీ కలసి ఊరగాయల సీసన్ అయిపోయిందని ఊరెళ్ళాయండి, అందుకే నాకు వాటి కబుర్లు అందలేదండి....అదీ సంగతీ!!

  ReplyDelete
 9. కూరగాయలతో కూడా కబుర్లు మీరే చెప్పేస్తే... నాలాంటి వాళ్ళం ఏమిరాయాలి చెప్పండి?

  ReplyDelete
 10. మీకు ఇష్టమైన కూరలగురించి మాత్రమే రాశారేమో అని సందేహం...

  ReplyDelete
 11. మావి(మి)డికాయ దోస్కాయ లతో ఊరగాయలే కాదు, పప్పు, రోటి పచ్చడి, పామిడి కొబ్బరి పచ్చడి, దోస్కాయ పచ్చడి ఎన్నైనా చేస్కోవచ్చు. హమ్మా!!! ఇక్కడ నలభీములు గట్రా ఉన్నారు సుమా :):)

  ReplyDelete
 12. ఎంత బాగా వ్రాశారండీ! మీ కవిత్వంతో కూరగాయల జన్మలు ధన్యమై పోయిందండీ!

  ReplyDelete
 13. బాగా చెప్పారు..

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. ఇంత చక్కగా చెప్పడం మీ వల్లే అవుతుందండి. బాగా చెప్పారు.

  ReplyDelete