స్నేహమంటే!!!

చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంకాదు స్నేహమంటే
జీవితంలో పైకి ఎదగడానికి మెట్టది***
రోజూ ఒకరినొకరు చూసుకోవడంకాదు స్నేహమంటే
మనల్ని మనం అద్దంలో చూసుకుంటే గుర్తుకొచ్చేదది***
కాలక్షేపానికి రోజూ కబుర్లు చెప్పుకోవడంకాదు స్నేహమంటే
గుండెలపై చేయివేసుకుంటే గుర్తుకొచ్చే అనుభూతది***
పేరు పేరునా పిలచి పలకరించుకోవడంకాదు స్నేహమంటే
పదిమందిలో మనపేరుతో పాటు పలుకరించే పదమది***
ఎన్నటికీ ఎడబాటే ఎరుగనిది స్నేహమంటే
దూరమైనా దగ్గరగా ఉన్నామన్న భావమది***
కలసి ఉండాలని కలుకనడంకాదు స్నేహమంటే
భాధ ఇక్కడైతే అక్కడ కన్నీరు కార్చేదది***
ఆనందంగా జీవించడానికి ఔషదంలాంటిది స్నేహమంటే
అన్నింటినీ మరిపించి హాయిగా నవ్వించగలదది***
ఒక్కరోజు శుభాకాంక్షలతో సరిపుచ్చుకుంటే సరిపోదు స్నేహమంటే
చిన్ననాటి నుండి చివరివరకు ఉండే చక్కని బంధమది***
నేను ఒప్పుకోను మన బ్లాగ్ మిత్రులంతా దీన్ని కవిత్వమంటే
నన్ను తిట్టినా మొట్టినా మీకందరికీ అంకితమిది***

17 comments:

 1. బాగా చెప్పారు.
  స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. మరువం కూడా కొత్త స్నేహపు చివురు తొడిగి ఆనందం తొణికిసలాడగ ఉల్లసంగా వెల్లువైంది, పద్మార్పితా, చూసి రండి. మీకు స్నేహపూరిత శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. బాగుంది మీ ఫ్రెండ్షిప్ డే కానుక...

  ReplyDelete
 4. chala baga cheppavu, nestam,
  neeku kuda happyfriendship day

  ReplyDelete
 5. చాల చాల బాగుంది.
  9వ లైన్లో "కాదు" మిస్సయిందేమో ... చూడండి. లేకపోయినా సమన్వయం సరిపోయిందిలెండి !
  మీకు "మైత్రీ దినోత్సవ" శుభాభినందనలు !

  ReplyDelete
 6. బాగా రాసారు.happy friendship day!!

  ReplyDelete
 7. బాగుందండి . మీకు శుభాకాంక్షలు .

  ReplyDelete
 8. చాల బాగుందండి.మీకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు

  ReplyDelete
 9. ఒక్కరోజు శుభాకాంక్షలతో సరిపుచ్చుకుంటే సరిపోదు స్నేహమంటే
  చిన్ననాటి నుండి చివరివరకు ఉండే చక్కని బంధమది***

  చాలా బాగా చెప్పారు. స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 10. ఆనందంగా జీవించడానికి ఔషదంలాంటిది స్నేహమంటే
  అన్నింటినీ మరిపించి హాయిగా నవ్వించగలదది***

  చాలా బాగా చెప్పారు. స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. బాగుంది happy friendship day

  ReplyDelete
 12. పద్మా నీకు నా స్నేహితులరోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 13. Excellent words about friendship. i am very curious to look at ur blog every time i came to net. why are you taking that much time to post a single poem, try to publish a poem per a day for us please....

  thank you.

  ReplyDelete
 14. చాలా బాగా చేప్పారు.picture కూడా చాలా బాగుందండి.

  ReplyDelete
 15. padmarpita gaaru adbutam..

  thank u snehanni baagaa nirvachincharu

  ReplyDelete