పెళ్ళిపందిరిలో ప్రకటన!!

పెళ్ళిపందిరిలో వధువు కావలెను అనే ప్రకటనని ఎవరెవరు ఎలాఇచ్చారో ఒక్క లుక్ వేయండి:)...:)

డాక్టర్....కొద్దిరోజుల క్రితమే నాకు ప్రేమ అనే బాక్టీరియా సోకి పెళ్ళి అనే రోగానికి దారితీసింది. కావున అందమైన రోగిణులు మందు మాకు గురించి తెలిసిన వారు ముందుగా రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించవలసిందిగా ప్రార్ధన. రోగనిర్ధారణ(అన్ని అభిప్రాయాలు కలిస్తే) జరిగిన పిమ్మట నేను ఒక మంచి వైద్యునిగా(భర్తగా) సేవలందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను!!!

లాయరు(న్యాయవాది).... నేను భర్తగా ఆమోద యోగ్యతను పొంది, వివాహమాడ తలచినాను కావున అవివాహితల నుండి ధరఖాస్తులను కోరడమైనది. ఆమె తన పరిధిలో నాకు మనసావాచా అర్పితమవ్వాలి. ఎటువంటి అభ్యంతరమున్నా ఓవర్ రూల్డ్ కావించబడుతుంది, సస్టండ్ చేయబడదు!!!

బిక్షగాడు....అయ్యా దేవుని పేరుపై నాకు ఒక సహధర్మచారిణిని దానం చేయండి. వేరొకరి పత్ని కాకపోయినా మీపత్ని అయినా పర్వాలేదండి. మీరు ఒకళ్ళని దానం చేస్తే మీకు భగవంతుడు నలుగురిని ప్రసాదిస్తాడు. అ
య్యా ఆలోచించక దానం చేయండి బాబయ్యా!!!

బ్యాంకర్....వధువు కావలెను, ఎవరైతే వారి ఆస్తిని జమా చేసి చక్రవడ్డీ లాంటి సేవలతో లాభాలని అందించగలరో అటువంటి అమ్మాయిల నుండి నెలలోపు ధరకాస్తులను కోరడమైనది. గడువు తరువాత అయినచో ఆలస్య రుసుముతో స్వయముగా సంప్రదించ గలరని ప్రార్ధన!!!

కవి....బహుకాలానికి నాకొక కోరిక కలిగినది,
పెళ్ళికై నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది,
ఇన్నాళ్ళు పెళ్ళితో నాకేమీ పనిలేదన్నది,
ఇప్పుడిక ఇంటపని బయటపని నాతో కాకున్నది.
అందుకే సరి అయిన జోడీ కొరకు వెతుకుతున్నది!!!

కారు మెకానిక్....పాతదైనా కొత్తమోడల్ గా కనబడే వధువు కావలెను. మంచి కండిషన్ లో ఉండి తక్కువ సొమ్ముతో ఎక్కువ హంగూ ఆర్భాటాలు చేయగలిగి, సంవత్సరంలో రెండు సర్వీసులు( సినిమాలు) మాత్రమే కోరుకునే 362436 మోడల్ వధువునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్రోకర్లను వదలి పార్టీ డైరెక్టుగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము!!!

తాగుబోతు....నాకు పెళ్ళాం కావాలి. పిల్ల తండ్రికి తప్పక సోడా ఫ్యాక్టరీఉండి తీరాలి. నేను ప్రతిరోజూ కాకుండా వారానికి ఏడు రోజులు మాత్రమే తాగుతాను. ఇంటి వద్ద కాదంటే బార్ లో సరిపెట్టుకుంటాను. బార్ నుండి నన్ను ఇంటికి మోసుకెళ్ళే అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సోడాని సాంపుల్ గా పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!!!

గమనిక:- ఇప్పటి వరకు పై వ్యక్తుల ఆలోచనల మేరకు ప్రకటనలను ఇవ్వడం జరిగినది. ఎవరైనా ఆశక్తిగలగిన వారు తమకి తోచిన విధముగా ప్రకటనలు ఇవ్వదలచిన వ్యాఖ్యల రూపంలో ప్రకటించమని అభ్యర్ధన!!!

బ్లాగ్ మిత్రులారా! ఇది కేవలం హాయిగా నవ్వుకోవడానికి చేసిన చిరు చిలిపి ప్రయత్నమే కాని ఎవ్వరి మనసునీ నొప్పించాలని మాత్రం కాదని మనవి....



20 comments:

  1. మమ్మల్ని(రైతుల్ని) మరచిపోయినట్లున్నారు రాజకీయ నాయకులంటున్నట్లు దేశానికి వెన్నెముకలు,మేమెలాగూ(రా.నా) వీళ్ళ వెన్నెముకను ముక్కలు చేసాము వీళ్ళు పనికిరారనుకున్నారా ఏంటి ?

    ReplyDelete
  2. అందరికీ ఒకటే సమాధానం
    ఫెమినిస్ట్ :- ఆయ్..మేమేమన్నా సంతలో పశువులమా..మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని రూల్స్ పెట్టడానికి ...బేరాలాడడానికి.మేము అబలలం కాదు సబలలం..ఆజ్ కీ నారీ ..నేటి మహిళలం...మహిళలను అవమానించే రీతిలో ప్రకటనలను ఇచ్చినందుకు ఆందోళణలు చేస్తాం ...ఖబడ్దార్ మహిళ అంటే కేవలం ఉప్పు,పప్పు వండే రోజులు పోయాయి ఇప్పుడు మహిళ అంటే నిప్పు..ఎక్కువ చేస్తే తగలపెట్టెస్తాం.. భర్త అంటే భరించువాడు అని అర్ధం కాబట్టి మేము ఏంచేసినా, ఎలా ఉన్నా మమ్మల్ని భరించాలి తప్ప ఇలాంటి తొక్కలో రూల్స్,తొక్కలో ప్రకటనలు ఇస్తే ఒప్పుకోమంతే ...ఆగండి కాస్త మంచి నీళ్ళు త్రాగివస్తా :)

    ReplyDelete
  3. am so happy for you, my friend. finally you are out of that mood and in to the cheerful mood. mere coincidence I might be penning down a hilarious one as my next post too.

    ReplyDelete
  4. చిలమకూరు విజయమోహన్ గారు ఎంతమాటండి! రైతులు అసలే వర్షాలు లేక బాధ పడుతుంటే వారికి పెళ్ళి మూడ్ ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి? అందుకేనేమో వారు ప్రకటించలేదు. మీరు మరొక్క సారి గమనికని చూడవలసిందిగా మనవి...:)

    ReplyDelete
  5. సృజన రామానుజన్ గారు, పరిమళంగారు అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి:)
    నేస్తమా! మరీ ఇంత ఆవేశమా!!!! మాఫ్ కర్ దోనా:)...:)
    Usha thanks for caring!!Wish u good luck my friend...:)

    ReplyDelete
  6. సాఫ్ట్ వేర్ ఇంజనీరు : అమ్మాయి ఆన్ సైట్ లో క్లైయింట్ చేత అప్ప్రూవ్ చేయబడి ఆఫ్ షోర్ లో( అత్తగారిల్లు) ఏ టైం లో నైనా సేవలు అందించడానికి సిద్దంగా ఉండాలి. షాపింగ్ లో చీరలు అవీ కొన్నప్పుడు టైం డెడ్ లైన్స్ ని మీటవ్వాలి. కాస్ట్ కటింగ్ లో భాగంగా కేబుల్ టీవి తీసేసినా, అవుటింగ్ కి తీసుకెళ్ళక పోయినా పక్కింటి పంకజాక్షి తో కాలక్షేపం చేసుకునేటట్టు ఉండాలి. అన్ని పండగలకి భర్త ని ఆన్ సైట్ (ఆమె పుట్టిల్లు)కి తీసుకెళుతుండాలి. భర్త క్రియేట్ చేసిన ఇష్యులు( తప్పులు ) తన ఇష్యులు గా తీసుకుని ఫిక్స్ చేయాలి. ఉద్యోగం లోకి చేరడానికి ఇంటిపనులు చేయడంలో అరవైశాతం మార్కులు ఉండాలి. గత ఆరునెలల్లో ఆప్లై చేసిన వారు మరల అప్లై చేయనవసరం లేదు.

    :))

    ReplyDelete
  7. 362436 మోడల్ వధువు is everybody's preference. Not only Car Mechanics'. Haa haa! Lovely it is.

    ReplyDelete
  8. రైతు: ఎన్నాళ్ళని ఒంటిగా కాడిమోత్తాను. అందుకే నానూ పెళ్ళి సేసుకుందారనుకుంతున్నను. నాతోపాటు భుమ్మీద కట్టాన్ని, సొరగంలో సుకాన్ని పంచుకోటానికి, అవసరమైతే పురుగులమందుని కలర్ సోడా లాగా అనందంగా తాగేసే దైర్నవున్న అమ్మయి కావాలి. ముందు సరతు: తాకట్టుకి ఎప్పుడడిగినా కాదనకుండా తాళిబొట్టు తీసిచ్చెయాలి.
    విజయమోహన్ గారూ కరెక్ట్ గ చెప్పానా?

    ReplyDelete
  9. మరి లెక్చరెర్ ఎలా ప్రకటన ఇస్తారో చెప్పరా ప్లీజ్......ప్లీజ్ ....

    ReplyDelete
  10. మరి లెక్చరెర్ ఎలా ప్రకటన ఇస్తారో చెప్పరా ప్లీజ్......ప్లీజ్ ....

    ReplyDelete
  11. లలితగారూ మాతరపున మాబాగా చెప్పారండీ !

    ReplyDelete
  12. లలితగారు, బాగ చెప్పారు..!

    ReplyDelete
  13. హా..హా..అదిరింది టపా:)

    ReplyDelete
  14. Really superb... I laughed like anything after read your new Concept... Keep rocking...

    ReplyDelete
  15. కుక్:నాకు వంటొచ్చు కాబట్టి వధువుకు వంట రాకపోయినా పరవాలేదు :) అలిగిన యెడల నేనే స్వయంగా వంట చేసి పెట్టెదను.తాను తినకున్ననూ నేనే వండుకుని తినేసి వెళ్లెదను.సర్వకాల సర్వావస్తలయందు కాఫి,టీలందుకుంటూ ఇడ్లి-సాంబారులా,పెసరట్టు-ఉప్మాలా కలసి మెలసి ఉండగలిగిన యువతులు వారి అభిరుచుల రెసిపిలు పంపగలరు..!!

    ReplyDelete
  16. nenu oka doctor ga sevalandinchukontanu budhuu okna

    ReplyDelete