జై భారత్ మాత!

దివిని భువికి బహుమతిగా ఇద్దాం
తారా చంద్రులతో అలంకరించుదాం....
ఇంటింటా విద్యాజ్యోతుల్ని వెలిగిద్దాం
దేశపురోగాభివృద్దికి పాటుపడదాం....
విధ్రోహశక్తుల వెన్ను విరిచేద్దాం
మన శక్తిసామర్ధ్యాలని నిరూపించుకుందాం....
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదిరిద్దాం
మనకి మనమేసాటి అని తెలియ చెబుదాం....
చెడుకి బానిసలం కామని ప్రమాణం చేద్దాం
దేశమాతకి ముద్దుబిడ్డలమని చాటిచెబుదాం....
భరతమాత ఒడిని సుఖఃసంతోషాలతో నింపేద్దాం
బాట కఠినమైనా, గమ్యాన్ని మనం చేరుకుందాం....
పైన వ్రాసిన వ్రాతల్ని చేతల్లో చేసి చూపిద్దాం
బ్రహ్మాండమైన సంబరాలు మరింకెన్నో జరుపుకుందాం....

10 comments:

  1. ఇంతకు మించిన సంబరం ఏమైనా వుందా మనమంతా ఐకమత్యంగా జరుపుకోను. మీవి నావి కలలు కల్లలు కావని ఆశిద్దాం, పద్మార్పిత.

    ReplyDelete
  2. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

    ReplyDelete
  3. మీ కలలు కల్లలు కాకూడదని ఆశిస్తూ..

    ReplyDelete
  4. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..పద్మా

    ReplyDelete
  5. స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. మీ కలలు నిజమవ్వాలని కోరుకుంటూ
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. స్వాతంత్ర్యం -- భారతావని జననం

    ఇది కాదులే జననం
    ప్రతి దినం ఓ మరణం
    సరిహద్దున రణం
    సమరం ఆగెను సంధితోన
    చేజారిన కాశ్మీరం

    ఇది కాదులే జననం
    నిలువెత్తున నిర్జీవం
    ఆక్సాయ్ చిన్ ఆక్రమణం
    చైనా దేశ దురాక్రమణం
    సగమైనది కాశ్మీరం
    భారతావని శిరచ్ఛేదం



    ఇది కాదులే జననం
    నిలువెల్లా రాజకీయం
    పదవీ దుర్వినియోగం
    నేలకొరిగిన మహావృక్షం
    తడిసెను ఈ నేల
    సిక్కుల ఊచకోతతో
    ఇదియేన ప్రజాస్వామ్యం
    ఇదియేన లోకతంత్రం

    ఇదికాదులే జననం
    మతం ఎరుగని మూర్ఖత్వం
    మనిషి మరచిన మానవత్వం
    నిప్పు రగిలిన రైలు భోగి
    నేల రాల్చెను ఓ రాజ్యం
    ఇదియేన మతతత్వం
    ఇదియేన మానవత్వం
    ఇదికాదులే జననం
    హలం పోయె, పొలం పోయె
    పైరు పోయె, పల్లె పోయె
    చెట్టు పోయె, పక్షి పోయె
    వనం పోయె, మృగం పోయె
    చెరువు పోయె, ఏటిలోన నీరు పారదాయె
    మట్టిని నమ్మిన రైతు పోయె
    మట్టినమ్మినోడు ధనికుడాయె
    ఇదికాదులే జననం
    నీడ నరికి మేడకట్టి
    ఇసుక పట్టి నీరు ఇంకబట్టె
    ఎండగారి ఏరు ఎడారులాయె
    దాహమొచ్చి ఎన్నో దారులెతికె
    ఏమి దరిద్రం డబ్బుతోన దాహం తీరె
    గాలి పీల్చిరి ముక్కున గుడ్డ కట్టి
    స్వేచ్ఛ పోయెలే స్వచ్ఛమైన గాలి పీల్చుటకు
    నీది(సైనికుడు) కాదులే మరణం
    నీకు (సైనికుడు) రాదులె మరణం
    నీవు చేరిన తరుణం
    ఈ తల్లి అయినది కన్నీటి సంధ్రం
    నీవు నిలిపిన ఊపిరితో
    నాకైనది (మాతృభూమి) మరో జననం

    ReplyDelete
    Replies
    1. బాగా రాశారు!ఓ వారం పది రోజుల వ్యవధిలో లక్షమంది హిందువుల్ని నరికి చంపిన కిరాతక ఖిలాఫత్, మోప్లా జెహాదీ భూతాల్ని నా సోదరులని అక్కున జేర్చుకుని ప్రతీకారం కోసం తహతహలాడుతున్న హిందువుల్ని వెనక్కి లాగిన గాంధీయే భారతదేశం యొక్క మొదటి శత్రువు.ఆరోజున హిందువుల్ని ఆపకుండా ఉంటే ఎక్కడి వాళ్ళని అక్కడ మళ్ళీ హిందువుల మీద కత్తి ఎత్తకుండా పాతిపెట్టి ఉండేవాళ్ళు - దేశవిభజనతో సహా ఏ దరిద్రమూ మన నెత్తిన పడేది కాదు!

      Delete
  8. రాష్ట్ర విభజన జరుగకపోయి ఉంటే ఎలా ఉండేదో దేశ విభజన జరుగకపోతేనూ అలాగే ఉండేది కాదంటారా ?

    ReplyDelete
  9. దేశపురోగాభివృద్దికి పాటుపడదాం....

    గా తీసెయ్యండి . అదనంగా పడినట్లుంది .

    ReplyDelete