ప్రేమని కొలచిచూడు!

ప్రేమకి కొలమానం నీవడిగిన వేళ
నా గుండె గొంతు విప్పి చెబుతున్నానీవేళ
నీపై నాకున్న ప్రేమను హృదయకవాటాలని తెరచిచూడు
నమ్మకపోతే నా హృదయంతో నీ హృదయాన్ని మార్చిచూడు.

నా ప్రతిశ్వాసపై నీపేరే లిఖించాను
నీకై నా అస్థిత్వాన్నే నేను మరిచాను
నీవుకూడా ప్రేమలో హద్దులు దాటి చూడు
నా నిద్రలేని రాత్రులతో నీ రాత్రుల్ని మార్చిచూడు.

నా ప్రేమ కన్నీరై ప్రవహించినవేళ
ఆనీరే నీ హౄదయాన్ని కడిగి వేస్తుందావేళ
ఆరోజు కుడా నా పెదవి నీపేరే పలుకుతుంది చూడు
ఆ పలుకులకి ప్రతిస్పందనగా నీవేమైనా పలికి చూడు.

నీకై నా జీవితాన్నే అర్పిస్తాను
నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను
అప్పుడు నీ హృదయమెలా ఘోషిస్తుందో చూడు
నా ప్రేమని నీ ప్రేమతో కొలచివెల కట్టలేవు చూడు.

22 comments:

 1. పద్మార్పిత గారు...అధ్బుతంగా రాశారు...లోతైన భావాన్ని చాలా చక్కగా వర్ణించారు ..

  ReplyDelete
 2. మీ ప్రేమని కొలిచే ధైర్యం వుందాండి! అమ్మో..:)

  ReplyDelete
 3. నమ్మకపోతే నా హృదయంతో నీ హృదయాన్ని మార్చిచూడు -- బాగుంది పద్మార్పిత...

  ReplyDelete
 4. నిజమేనండోయ్.. ఇకనుంచి ప్రేమను.. ప్రేమవాహిక ద్వారా కొలువడానికి నిర్ణయించాము. దానికి యూనిట్ గా "మనోనేత్రం" అని నిర్ణయించాము. jk.

  ReplyDelete
 5. baagundandi..........
  artham ayyindi........
  naaaku raayadam chetakaadu gaani...

  2nd para adirindi

  ReplyDelete
 6. అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 7. "ye zindagi usi ki hai..jo kisi ka ho gayaa..pyar mein hi kho gaya.."పాట గుర్తు వచ్చింది మీ కవిత చదవగానే...ప్రేమించటం కన్నా ప్రేమించబడటం ఎంతో విలువైనటువంటి విషయం...కానీ అది ప్రేమింపబడేవారికి తెలియచెప్పటం కూదా అవసరం!ఈ కవిత ఆ పనిని సంపూర్ణం చేసిందండి!!

  ReplyDelete
 8. padma garu.. superga chepparu...
  mee daggara nundi enko poem kosam eduru chustu vuntaa..

  ReplyDelete
 9. ఇక్కడ కూడా కొలతలు, తూనికలు పెట్టేస్తే ఎలా మేడం? కాస్త కనికరించి ఏదో అలా అలా అలిగి, సణిగి, గొణిగి [నా మాదిరిగా] ముద్దుగా నిందించి దారికి తేవాలి కానీ... :) ఇంతటి వేదన నాకు పరిచితమే. దాన్ని అధిగమించను ఇలా జాలువారటమూ పరిపాటే. తనకీ అలవాటే. ఇదో ప్రేమ ఈక్వేషన్. పరిష్కరించుకోవటంలోనే మీ నేర్పరితనం వుంది ఇలా నలుగురిలో పంచాయితి పెట్టేయకుండా.

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. ప్రేమకి కొలమానం అడిగేవాడు ప్రెమికుడే కాదు

  ReplyDelete
 12. బ్లాగ్ వైపు తొంగి చూసి, నా కవితకి కొలతలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
  ఉష గారు...పదిమందితో పంచుకుంటేనే కదండి తెలుసుకునేది, నేర్చుకునేది...నేర్పరితనాన్ని:)

  ReplyDelete
 13. "నీకై నా జీవితాన్నే అర్పిస్తాను
  నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను"
  పద్మార్పిత గారు,బాగుందండి.

  ReplyDelete
 14. నీకై నా జీవితాన్నే అర్పిస్తాను
  నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను
  అప్పుడు నీ హృదయమెలా ఘోషిస్తుందో చూడు
  నా ప్రేమని నీ ప్రేమతో కొలచివెల కట్టలేవు చూడు.
  Its impossible to any one..

  ReplyDelete
 15. ప్రేమ సైతం మీ ప్రియుణ్ణి చూసి అసూయ పడుతుందేమో! ఎందుకంటే అంతటి అదృష్టం దానికి కూడా కలిగిందో లేదో!

  ReplyDelete
 16. పువ్వంటారు,ఫుష్పమంటారు ..... ప్రేమంటారు,స్నేహమంటారు...కూరగాయలన్నారు,జీవితమన్నారు అన్ని అందంగా చెప్పారు.వేరు వేరు మంచి ఆలోచనల్ని అందంగా చెప్పారు.I like ur different thoughts

  ReplyDelete
 17. This comment has been removed by the author.

  ReplyDelete
 18. బావుందండి...ప్రేమ కవితలు చాలా అందంగా వ్రాస్తున్నారు. మీరు మీ ఇంట్లోవాళ్లకి పద్మార్పిత అయినా చదివే వాళ్ళకి మాత్రం ప్రేమార్పిత!

  Rajan PTSK

  http://naagola.wordpress.com/

  ReplyDelete
 19. Baagundi Padmarpita gaaru mee kavita

  ReplyDelete