ప్రేమ ఒక స్వప్నం

ప్రేమ ఎంత మధురం అని అనుకున్నా
ప్రేమించి ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నా

ప్రేమలో నేను ఇంతగా కూరుకు పోయివున్నా
అసత్యాలని కూడా సత్యమని నమ్ముతున్నా

ప్రేమలో నా కంటిని నేనే నమ్మకున్నా
మెరిసేదంతా పసిడి అనుకుంటున్నా

ప్రేమలో ఎవ్వరినీ లెక్కచేయనన్నా
స్నేహితులు చెప్పింది పరిహాసమనుకున్నా

ప్రేమ నన్ను ఎంతగా మార్చిందో చెప్పలేకున్నా
నా అన్నవారినందరినీ దూరం చేసుకున్నా

ప్రేమతో నా హృదయాన్ని నేనే గాయపరచుకున్నా
మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా

ప్రేమ ఒక స్వప్నమైతేనే బాగుంటుంది అనుకున్నా
నా ప్రేమకి ఇంక అక్కడే స్థానం కల్పిస్తున్నా......

19 comments:

 1. ప్రేమ నిజమండీ ....ఆకర్షణ ఒక స్వప్నం అనండీ.....

  ReplyDelete
 2. prema Oka swapnam annaru chala bagundi... mere ila ante ela nandi... kani chala bagundi :)

  ReplyDelete
 3. prema oka swapnam ithe baaguntundi anukunna...............

  nenu ila chaala saarlu anukunna......asalu prema anedi ento telusukoni.........pondalenapudu hhhhhh...swapnam avvalanae anukuntam.............

  ReplyDelete
 4. ప్రేమ నిజంగా నిజం
  ప్రేమ తత్వం, విలువ..... ప్రెమించే, ప్రేమించబడే మనిషిని బట్టి ఉంటుంది

  ReplyDelete
 5. @విజయమోహన్ గారు ధన్యవాదాలు!!
  @చిన్నిగారు అది నిజమైన ప్రేమే ఐతే మీరన్నది నిజం!!
  @దీపుగారు ప్రేమకి మీరేంటి ?..నేనేంటి? చెప్పండి?

  ReplyDelete
 6. @ వినయ్ గారు ప్రేమ దొరకని వారికి స్వప్నమేకదండి!
  అందని పళ్ళు పుల్లన అని అందుకే అన్నారుకదండి!

  @ సంతోష్ గారు ప్రేమని పొందినవారికి పొందనివారికి తేడా చాలా ఉంటుందండి!

  ReplyDelete
 7. వికసించని ప్రేమలకే విరబూస్తాయి ఈ పూలు(కవితా పుష్పాలు)
  ఝలిపిస్తాయవి కావ్యాలు..వినిపిస్తాయవి రాగాలు

  మీరు అన్నట్టు
  నిజం .. ప్రేమ పొందదానికి , పొందకపొవడానికి చాల తేడ ఉంది...

  ReplyDelete
 8. ప్రేమను ఎన్ని రూపాలలో ఊహించినా దాని స్వరూపం నిత్యం, నిర్వికారం. మీ భావన అనిర్వచనీయం.

  ReplyDelete
 9. "మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా.." బాగుందండీ...

  ReplyDelete
 10. బాగుందండీ. ఆకర్షణనే ప్రేమ అనుకుంటే కవితలో వ్యక్తపరిచిన భావాలు అనుభవపూర్వకమవుతాయి.
  పైన చిన్ని గారు బాగా చెప్పారు. ప్రేమ నిజం..ఆకర్షణ ఒక స్వప్నం..

  ReplyDelete
 11. "మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా.." బాగుందండీ...

  ReplyDelete
 12. గాయ పడిన హృదయపు గుండెకోత చదవటానికి బాగుంటుంది,
  అనుభవించటానికి కాదు...

  ReplyDelete
 13. చాలా బాగా రాసారు పద్మ

  ReplyDelete
 14. వర్మగారు అది మీ అభిమానమండి!

  మురళీగారు, నేస్తం, సృజనగారికి ధన్యవాదాలండి!

  శేఖర్ గారు..మీరన్నట్లు ఏదైనా అనుభవపూర్వకంగానే తెలుస్తాయండి. చక్కగా చెప్పారు!

  భావనగారు...మీరన్నది అక్షరాల నిజమండి, ధన్యవాదాలండి!

  ReplyDelete
 15. ప్రేమ ఒక నిజం
  జీవతమొక సత్యం
  ప్రేమైక జీవనం ఒక స్వప్నం.

  ఉరుకుల పరుగుల పరువాన
  కనరాని లోకం
  అలసి పోయిన జీవితాన
  కనిపించని ప్రేమ

  ReplyDelete
 16. ప్రేమకి నిర్వచనాలు నిజం కాకపోవచ్చు. ప్రేమ మాత్రం నిత్య సత్యం. అందుకే అది నిరంతరంగా జాలువారుతుంది. అపాత్రదానం అవొచ్చు కానీ అందులో స్వఛ్ఛత మారదు. కాదా?

  ReplyDelete
 17. "ప్రేమతో నా హృదయాన్ని నేనే గాయపరచుకున్నా
  మరచిపోవాలని నన్ను నేనే మరచిపోతున్నా"
  ప్రేమ అంత మధురమేం కాదేమో ..
  చేదూ తీపిల కలయికేమో ....
  జీవితం లాగే ..

  ReplyDelete
 18. ప్రేమ గురించి వ్యఖానించడినికి నా ప్రస్తుత జీవిత అనుభవం చాలడంలేదు. కాని నాకు ఓ 60 లేదా 70 వసంతాలు నిండాక కూడా ప్రేమ గురించి చెప్పగలనో లేదో అని సందేహం మాత్రం వస్తున్నది. మీ ప్రయత్నం అభినందనీయం.

  ReplyDelete