మబ్బులా కమ్ముకుంటాయి...
ఏకధాటిగా కురుస్తాయి...
నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి...
తడిసిన మల్లెలౌతాయి...
జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తాయి...
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!
కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి...
చేతులు చిత్రాన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాయి...
కుంచె ఉంది, రంగులూ ఉన్నాయి...
నీ చిత్రాన్ని గీయాలంటే కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలో కలిపి వేసేయి...
భగవంతుడా! నీవు నాకు ఈ ఒక్క సహాయము చేయి...
rish29380Dear padma garu,
ReplyDeletenevu gurthuku vasthe na kallu ila varshisthaiyee annaru chudandi great nestama asalu
best of luck
పద్మార్పితగారు...చాలా బాగుంది!
ReplyDeleteఆ దేముడే దిగివస్తే బహుశా ఆయన పలుకులివి ;)
ReplyDeleteనువ్వు గీయలేని ఆ చిత్రం
లిఖించుకున్నది నీ హృదయం
అది బండవారి పగిలితే
ఛిద్రమయేది నీ కలల రూపం
ముగిసిపోయేది నీ కన్నిటి కలువల
మెరిసేటి ఆ జ్ఞాపకం
మరొక్కసారి తరచి చూసుకో, నీ మాట ఇదేనంటే
వేరే వేడుకోలు అవసరపడకే మరలి వస్తాను...
This comment has been removed by the author.
ReplyDeleteహరీష్ గారికి, సృజన గారికి... ధన్యవాదాలు.
ReplyDeleteఉషగారు...మీరు ఇచ్చిన సందేశాత్మక సూచన చదివాక దేవుడ్ని మరల వేడుకుంటానా చెప్పండి!
చక్కని చిత్రాన్ని గీయడానికే ప్రయత్నిస్తానులెండి! ప్రత్యేక ధన్యవాదాలండి!
Hey... you are great!!
ReplyDeleteIts very nice!!
పద్మార్పిత గారు భూమి లో కలపివేయమంటారా ఎంత దారుణం!
ReplyDeleterhymes బావున్నాయి
పోస్ట్ ఇంకా బావుంది
దుఖం మనకు సృష్టిలోని వరం. కన్నెటి పొరలవెనుక దాగిన మీ అంతరంగాన్ని అవిష్కరించింది మీ కవిత. రేపటి సూర్యోదయంపై ఆశలేకపోతే ఈ రాతిరి నిదురరాదుకదా?
ReplyDeleteపద్మా, గుండెలోని భారాన్ని ఇలా దింపేశారా లేక ఎమైనా మిగిల్చారా?
ReplyDeleteవీలైనంత త్వరగా ఆ కొలొమిలోనుండి బయటకు రావాలి. లేదంటే మన ఉనికే మిగలదు. నిజమే ప్రేమించి ప్రేమించబడక పోవడం ఒక శాపం.
చాలా బాగా చెప్పారు.
Hi Padma garu,
ReplyDeleteits very nice
mee blog chala bagundhi,
mee blog nuchi vache post la kosam wait chestu untam
alage mee dagara emmanna telugu funny jokes kani cartoons unte koncham naku papagalara endukante nenu
www.laughguru.com ane blog start chesanu.
my mail address
info@laughguru.com
Padmarpita garu ,
ReplyDeletemee badhani ila thagginchukoni, naalo badhani penchadam nyayama?
పిండేశారండి గుండెను...
ReplyDelete:(