చెదరిన కల!

క్షణమొక యుగమై సాగుతున్నది
మనసు మారాము చేస్తున్నది
నిదుర రాని నాకనులు నిన్నేకోరుతున్నవి!

నెలవంక నన్ను ప్రశ్నిస్తున్నది
వెన్నెల అంతా ఆవిరై పోతున్నది
ఎదురు చూసి నాకనులు కాయలు కాస్తున్నవి!

నా మనసు నీ చెంతన ఉన్నది
నీ మనసు నా మాట వినకున్నది
మదిన అలజడులు సుడులు తిరుగుతున్నవి!

ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
తలపులతో తనువు బరువౌతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువౌతున్నవి!

ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది
మరణం విజయ దరహాసం చేస్తున్నది

పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి!

స్వప్నం కూడా నిన్ను కాలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!

18 comments:

 1. chala baagundhi ,photo kooda bagundhi

  ReplyDelete
 2. me bloglo anni chadivanu,abba yenthabaga rasarandi,me (andhari)
  sthayeki yeppudu cherukuntano....

  ReplyDelete
 3. chaalaa baagumdi,manchi feel anipinchindi.bomma kudaa good.

  ReplyDelete
 4. మీరు ప్రేమలో విఫలం అయ్యరాండి?.. ఇలాంటి కవిత రాయాడానికి చాలా అనుభూతి కావాలేమో అని అనిపిస్తుంది నాకు..

  ReplyDelete
 5. చాలా బాగుందండీ.. ముఖ్యంగా మరణ విజయ దరహాసం అని చెప్పినప్పుడు.. జీవితం మైనంలా కరిగిపోయిందనడానికి పైన పెట్టిన బొమ్మ కూడా సరిపోయింది.. :) ఇంకొక సందేహమేంటంటే ఆ ఆఖరి లైనులో spelling mistake ఉందేమోనని ఒకటే doubt :P

  ReplyDelete
 6. నెలవంక వున్నప్పుడు వెన్నెల జీరో వాట్ బల్బులాగే ఉంటుందే. ఇంక ఆవిరైపోయేదేమిటి? ఆ జీరో బల్బు కాంతా ? అడిగిన కాంతా? కళ్ళు కాయలు కాసాయి, మనసుని అక్కడికి పంపించారు. ఇక అవతలి మనసు మాట వినకపోతే ఏమిటి ఆశ్చర్యం? పోనీ మీ మనసుని అవతలి మనసుని వశీకరణ చెయ్యటం కోసమే పంపించాము అనుకున్నా, మీ ఎదలో దుఃఖం ఎగసి పడ్డం ఎందుకు ? సవ్వళ్ళు తక్కువైపోతే గుండె ఆగిపోతే, మనిషీ లేడు, మనసు లేదు, వశీకరణ లేదు. కాబట్టి అది కూడా విపరీతమే. అవతల విజయదరహాసం చేస్తుంటేనో, కనపడుతుంటేనో, ఓటమి అంగీరించను అనటం కూడా విపరీతమే. జీవితం మైనంలా కరిగిపోతే, పదాల బతుకు, ఆశల మిణుగురుపురుగులు కూడా బళ్ళారిలో బలిస్థంభం ఎక్కటమే, భలే కవిత సుమండీ. మిమ్మల్ని కూడా ఆ కవి గారు (బ్లాగులోకంలో ప్రసిద్ధులు, సుప్రసిద్ధులు, సిద్ధయోగులు వారు) ఆవహించారా ఏమి సంగతి ?

  ReplyDelete
 7. nice one chala chala bagumdi

  ReplyDelete
 8. మీ కవితలన్నీ చాలా బాగుంటాయండి.
  చిన్న డౌట్..బ్లాగ్ లో పైన ఎడమవైపున్న స్కెచ్ మీరు వేసినదేనా?

  ReplyDelete
 9. చాలా బాగుంది....

  ReplyDelete
 10. "నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!" ...
  చాలా బాగుందండి..

  ReplyDelete
 11. "minugu purugavadamaa? anduloenuu aasani anta maata aneaseare!" just it's my opinion. please don't take it otherwise!

  ReplyDelete
 12. kArevaru manavAru....
  kalipi chUstE.....

  ReplyDelete
 13. చాలా బాగరాసారు అని కాకుండా ఇంకా కొత్త వ్యాఖ్య రాయాలని కాని నాకు రాదు అందుకే!!!

  ReplyDelete
 14. ఎన్నిసార్లు చదివినా ఈ కవితకు కామెంట్ ఏం వ్రాయాలో అర్థమవ్వటం లేదు. ఇలాంటి సమయాల్లో ఆదుకొనే మాట "చాలా బాగుంది".

  ReplyDelete
 15. స్పందించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు!!!

  ReplyDelete
 16. నా మనసు నీ చెంతన ఉన్నది
  నీ మనసు నా మాట వినకున్నది
  మదిన అలజడులు సుడులు తిరుగుతున్నవి

  tells all about it!

  ReplyDelete
 17. కవిత, బొమ్మ రెండూ బావున్నాయి.

  ReplyDelete