ఎదురీత...

భయమన్నది నాకు తెలీదు
ఓటమి అనేదే నాకు లేదు

కెరటాలతో సంఘర్షణ నేర్చుకున్నా
ఎదురీది గెలుపుని కైవసం చేసుకున్నా

గాలిమేడలు ఎన్నడూ నేను కట్టుకోను
గుడిసెనే మహలుగా మలచుకుంటాను..

ఆలోచనలు ఉంటేనే సరిపోదు
ఆచరించకుండా ఏదీ సాధ్యం కాదు

కర్మ సిధ్ధాంతాలని వల్లించడంకన్న
లక్ష్యసాధనలో సాగిపోవడం మిన్న

బాటలోని ముళ్ళని చూసి భయపడితే
గమ్యంలోని పూలు నీకు దక్కవంతే..

28 comments:

 1. చివరి వాక్యం చాలా బాగుందండి...

  ReplyDelete
 2. మొదటి లైనులో ఏదో సరిపోవటం లేదండి. టైపు చేసేటపుడు పోయిందనుకుంటా.

  ReplyDelete
 3. సత్యగారికి, రవితేజగారికి, విజయమోహన్ గారికి...ధన్యవాదాలు!
  సహృదయముతో సరిచేసుకోమన్నందుకు భాస్కర్ గారికి కృతజ్ఞతలు!

  ReplyDelete
 4. మీదైన శైలిలో ఉందండి.. అప్పటికప్పుడు ఆశువుగా రాసేస్తారా? లేక కాగితం మీద పెట్టి దానిని బ్లాగులో కాపీ చేస్తారా? చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను...

  ReplyDelete
 5. మురళీగారు....!!
  మనసులో ఏది వస్తే అది రాస్తానండి అప్పటికప్పుడు!
  తప్పోఒప్పో తెలియక భంగ పడుతుంటాను అప్పుడప్పుడు!
  మీలాంటివారి మెప్పులు పొందుతుంటాను మెచ్చినప్పుడు!
  మీ అందరి అభిమానం పొందాలలి నేను ఎప్పుడూ!!!

  ReplyDelete
 6. chala bagundi naku baga nachindi

  ReplyDelete
 7. లక్ష్యసాధన చేయడమే కర్మసిద్దాంతానికి మూలం. :)
  "పరుగాపక పయనించవె తలపుల నావా....కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా !
  ఎదిరించిన సుడిగాలిని జయించినావా....మదికోరిన మధు సీమలు వరించి రావా !!"
  ఈ పాట స్వర్ణకమలం లోది. విన్నారా? ఎందుకో అది తలపుకొచ్చింది మీ కవిత చూస్తుంటే...

  ReplyDelete
 8. చాలా బాగుంది.
  ప్రతి పాదం ఒక సందేశం.

  ReplyDelete
 9. Obviously nice. Very very optimistic

  ReplyDelete
 10. నాకు మాత్రం పూలు దక్కాయి గాని ఫలం దక్క లేదు ముళ్ళ గాయాలు తప్ప.

  ReplyDelete
 11. బాటలోని ముళ్ళని చూసి భయపడితే
  గమ్యంలోని పూలు నీకు దక్కవంతే..

  nice :)

  ReplyDelete
 12. అన్ని పూలకి ముళ్ళు వుండవు గా పద్మార్పిత గారు?ముళ్ళు లేని పూల దగ్గరికి వెళితే సరి .

  ReplyDelete
 13. కర్మ సిధ్ధాంతాలని వల్లించడంకన్న
  లక్ష్యసాధనలో సాగిపోవడం మిన్న

  బావుంది

  ReplyDelete
 14. చాలా బాగుంది. nice work...

  ReplyDelete
 15. కామెంట్స్ తో నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు....

  ReplyDelete
 16. First time I have gone through your blog

  good

  keep it up

  all the best

  ReplyDelete
 17. గుడిసెనే మహలుగా మలచుకుంటాను..


  this line is suuper

  ReplyDelete
 18. hi padma garu mee kavitalu bagunaimaku oka manchi kavita pampandi
  k.saradhi5@gmail.com

  ReplyDelete
 19. hi padma garu mee kavitalu bagunaimaku oka manchi kavita pampandi
  k.saradhi5@gmail.com

  ReplyDelete