తెలుసుకో!!!

ఇసుకలో రాతలను నేను రాయను
అవి నిలకడలేనివని నాకు తెలుసును
బండబారిన హృదయం నాదని నీవంటే
రాతిపై వ్రాసిన రాతలను చెరపలేవంటాను!

తపించి చూడు ఎదుటివారి తలపులలో
తెలుస్తుంది నీకు ప్రేమంటే ఏమిటో
అన్నిటిలా ప్రేమ అమ్ముడుపోతే అంగట్లో
ఎలా తెలుస్తుంది నీకు ఎదురుచూపు ఏమిటో!

నిన్ను చూసే నా కళ్ళు తమని తాము చూసుకోలేవు
మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు
నా నీడలో, శ్వాసలో నీవున్నప్పుడు నన్ను వీడి నీవు పోలేవు
మనసు పొరల్లో దాగిన మమతకు ప్రేమమాధుర్యమే తెలియదు!

19 comments:

 1. "తపించి చూడు ఎదుటివారి తలపులలో
  తెలుస్తుంది నీకు ప్రేమంటే ఏమిటో"
  ఎదుటి వారి తలపుల్లో తపించడం....????

  ReplyDelete
 2. మురళీగారు.....ఎదుటివారి తలపుల్లో ఎప్పుడూ ఉండమని భావమండి!
  బహుశా అక్కడ "జీవించమని" వ్రాస్తే సరి అవుతుందేమో సెలవీయండి!

  కొత్తపాళీగారు...బహుకాల దర్శనం,ధన్యవాదాలండి!

  ReplyDelete
 3. మళ్ళీ మొదలు పెట్టారా. మరి నేనూ చేరాలేమో మీ టీంలోకి. మరి ఏమని "తెలుసుకోమని" చెప్పను? :)

  ReplyDelete
 4. తపించి చూడు ఎదుటివారి తలపులలో
  తెలుస్తుంది నీకు ప్రేమంటే ఏమిటో"

  ee lines naaku baagaa nachchay padmarpitha gaaru.....

  baagaa raasaaru.....

  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 5. "మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు"నిజమే .
  చాల బాగుందండీ.

  ReplyDelete
 6. "నిన్ను చూసే నా కళ్ళు తమని తాము చూసుకోలేవు
  మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు"

  touchy lines...

  ReplyDelete
 7. బాగుంది పద్మార్పితా.. ఒక సారి వలపు పంచేసేక ఇంకా మనసు ను మందలిద్దామనే ఆశ.. ;-) బాగుంది..

  ReplyDelete
 8. ఎదుటి వారి తలపుల్లో తపించడం...చాల బాగుందండీ.

  ReplyDelete
 9. ప్రేమ గురించి మీరు భలే భావాలు వ్యక్తపరుస్తారు...అందుకే నాకు మిమ్మల్ని 'ప్రేమార్పిత' అని పిలవాలని ఉంది. :)

  ReplyDelete
 10. ఎందుకో తెలీదు ఈ కవిత మాత్రం తెగనచ్చేసిందండి.చాలా బాగా రాసారు.

  ReplyDelete
 11. ప్రేమార్పిత :)

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. ఈ కవిత ఎంత బాగుందో! నాకనాలనిపిస్తోంది "తెరచిచూడు నీ హృదయాన్ని..పలుకుతుంది ఒక రాగం" అని.

  ReplyDelete
 15. "నిన్ను చూసే నా కళ్ళు తమని తాము చూసుకోలేవు
  మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు" baga nachindi padmaripita gaaru......superb.......

  ReplyDelete