ఇదండీ సంగతి అని రాసి మౌనంగానే ఉండేదాన్ని.... నీ తలపులలోని మార్పుతో ఆలోచించమని ఇద్దరు కలసి జీవించనప్పుడు ప్రేమ/స్నేహం అనేమాటలెందుకని,నీలోమార్పుకై ప్రయత్నించి ఓటమిలో గెలుపుని చూడమని నా ఆలోచనలు నన్ను తట్టకపోయి వుంటే....
వక్రించిన విధిని కూడా నిస్వార్ధమైన ప్రేమతో నిదురలేపి ఓ...ప్రేమ నీకు కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ నీ ప్రేమని కలసికట్టుగా అందరికీ పంచుతూ....ఎందుకు? ప్రాప్తం ఉన్నవారికే ఆమె(ప్రేమ) దక్కాలి,ప్రేమ/దోమ అన్నవారికి కూడా ఓ ప్రియతమా! నీకు అక్కరకురాని దానను కానని ఎలా తెలిపేది అని నాలో నీవు చేరి గుస గుసలాడిన ఆ తరుణం నాకు ఇప్పటికీ శిల్పి చెక్కిన సూక్తిగా గుర్తున్నది, అది నేను ఎలామరిచేది ప్రియతమా!(ప్రేమ భావాన్ని).... నీలో నేను ఎప్పటికీ ఉన్న్నానని, అందరూ మెచ్చిన జంటగా ప్రేమ పయనం చేస్తూ ప్రేమ జల్లులలో తడసిన నిన్ను కాంచిన వేళ నా వ్రాతలు(కవితలు) మీ తలపులు ఒకటవ్వాలని ఆశిస్తాను.... అతని రాకకై(నా టపా) ఎదురుచూసిన వారికి శుభాకాంక్షలు అంటూ నీ పిలుపుతో(నా కవితతో) అతడు/ఆమె నే కాక ఏడువింతల లోకంలోని ప్రతి మనసుని ఎలాచేరుకోను అని ఆలోచిస్తాను....
మనమెవరో తెలిపే ఈ రంగుల జీవితం గూర్చి తెలుసుకునే చిరుప్రయత్నంలో ప్రేమ ఎవరికైనా ప్రియమేనని నాడు-నేడు ప్రేమలో అంతరం ఉందని తెలిపిన ఓ నా కవితా ఎక్కడున్నావమ్మ అంటూ వెదికిన నాకు ప్రేమించాకే తెలిసింది(కవిత రాసాక) అది ఎంత సులభమైన కష్టమో కదా ఈ పరుగుల జీవనంలో అని....
నీ రాకకై(మీ వ్యాఖ్యకై) ఎదురు చూసే నాకు మీ ప్రోత్సాహం ఏమి చేయమంటావు(ఏమి రాయాలో)అంటూ నాతలపులను తట్టి లేపుతాయని....
ఎందుకనో మీ అందరినీ నాకు దరిచేర్చాయి ఈ విన్నవించవా అంటూ నేను చేసిన ప్రేమపోరాటాలు(రాసిన టపాలు), కన్నీటి వేడుకోలులు(కవితలు) ఎవరికి చెప్పాలి ఈ విన్నపాలు(నా భావాలు), నాలో ఈ ఆనంద ఊయల లూగించిన ఈ కలువ రాసిన కవితలు....
నా ఈ వినతిని(రచనలని) పద్మార్పితా! ఓ పుష్పమా అని పువ్వుని పలుకరిస్తే(ఆత్మీయంగా) పులకరించమని జీవితం నాకు నేర్పింది, కాయగూరలతో కబుర్లు చెప్పినా స్నేహమంటే ప్రేమని కొలచిచూడు అని అన్నా నీవుకావు రావు అంటూ ప్రేమ ఒక స్వప్నం అని రాసినా ప్రోత్సహించి సహకరించిన వారెల్లరికీ ధన్యవాదాలు....
జై భారత్ మాత అని నినాదంతో పాటు పెళ్ళిపందిరిలో ప్రకటనని సైతం మెచ్చి నా బ్లాగ్ పుట్టుకకి ఒక సార్ధకతని చేకూర్చి మీ అభిమానాన్ని నాకు బహుమానంగా ఇచ్చినది ఎప్పటికీ అందిస్తే ఎంతో బాగుంటుంది....మీ అభిమానాన్ని నేను ఎన్నడూ చెదిరిన కల కానీయక ఎదురీతతోనైనా దాన్ని నిలబెట్టుకోవడానికి నా ప్రతి పదం ప్రయత్నిస్తానంటుంది....
ప్రేమంటేనే కాదు కృష్ణమ్మ కరుణించవమ్మ అని ప్రార్ధించినా జలపుష్పాలని గాలించినా మేకింగ్ ఆఫ్ మానవా గురించి శోధించినా అంతా మీ అభిమానం....
వేచివున్నా....నా నూరు టపాలని పూర్తిచేసిన ఓ నా జీవితమా నీవు తెలుసుకో సంపాదించుకో అందరి మనసులలో స్థానం....అదే నా ఈ మాటల మర్మం....
నా చిట్టి బ్లాగ్ బంగారం...
ఇదే నీ మొదటి జన్మదినం....
చేయి అందరికీ వందనం....
పొందు ఆశ్శీసులందరివి ఈదినం!
నీలిరంగులోని పదాలు ఈ సంవత్సరం వ్రాసిన నా టపాల సూచికగా గుర్తించండి... వాటిని క్రమబద్దీకరణ చేయడంలో భావ ప్రకటనలోని లోపాలని మన్నించండి...
శుభాకాంక్షలు.కొద్దిగా కష్టమైనా టపాలకు లింకులిచ్చి ఉంటే బాగుండేదేమో.
ReplyDeleteశుభాకాంక్షలు. ఎంత పయనం, ఎన్ని వైనాలు. అభినందనలు. నిజానికి నేను గత డిశంబర్ లో నా కవితల వ్రాయటమ్ మొదలు పెట్టిన క్రొత్తలో అమితంగా ఇమ్ప్రెస్ అయిన బ్లాగులు మీది, ఆత్రేయ గారు, బాబాగార్లవే. ఆ అభిమానం ఎప్పటికీ పోదు, నేస్తం.
ReplyDeleteశుభాకాంక్షలు.
ReplyDeleteవిజయమోహన్ గారన్నట్లు టపాలకు లింకులు కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.
తొలి సంవత్సరం వంద టపాలు దాటినా, ఈ సంవత్సరం ముచ్చటగా మూడు రెట్లైనా ఉంటాయని ఆశిస్తూ..
నరేష్ నందం.
శుభాకాంక్షలు
ReplyDeleteబ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
ReplyDeleteపద్మ గారు..ఇంచుమించుగా మీ టపాలన్నీ కలిపి ఇంకోటపా భలే రాసారు....అందుకోండి శుభాకాంక్షలు...మరి ఈ సుదినాన మాకు స్వీట్లు గట్రా ఏమీ లేవా? :-)
ReplyDelete"నా బ్లాగు ప్రారంభించి ఏడాది పూర్తయిందోచ్"అని ఇంత కవితాత్మకంగా, అందంగా చెప్పొచ్చన్నమాట. వాహ్! చాలా బావుంది. ప్రతి ఏడాదీ ఇదే రోజు ఇలాంటి టపా రావాలని ఆకాంక్ష!
ReplyDeleteశుభాకాంక్షలు
ReplyDeleteశుభాకాంక్షలు
శుభాకాంక్షలు
అభినందనలు
అభినందనలు
అభినందనలు
రాస్తూవుండండి! రాస్తూవుండండి! రాస్తూవుండండి!
జాన్ హైడ్ కనుమూరి
బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు .
ReplyDeleteపద్మార్పితగారు , శుభారంభ దినోత్సవ శుభాకాంక్షలు.....ఎల్లప్పుడూ మీ బ్లాగ్ వికసితపద్మంలా విరాజిల్లాలని మనసారా కోరుకుంటున్నా!
ReplyDeleteనేను బాగా ఇష్టపడే బ్లాగ్ ల లో మీ బ్లాగ్ ఒకటి . అందరి అభిమానం మీకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .
ReplyDeletecongratulations...keep writing...
ReplyDeleteబ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.....
ReplyDeleteఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తూ, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మా అందరితో పంచుకోవాలని కోరుకుంటూ,
ReplyDeleteశుభాకాంక్షలతో....
బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలండీ.. నేను బ్లాగులు చదవడం మొదలు పెట్టి సంవత్సరం. ఇంచుమించుగా మొదటి నుంచీ చదువుతున్నాను మీ బ్లాగు..
ReplyDeleteనేను మీ బ్లాగ్ రెగ్యులర్ రీడర్ నే ,,శుభాకాంక్షలండీ
ReplyDeletebujji blog ki happy bith day!
ReplyDeleteMy hearty congrats to you Padmarpita. I am a fan of you. Please, keep it up.
ReplyDeleteఇంక రాబోయే, మీ రచనలన్నీ, పూర్ణ వికసిత పుష్ప సౌరభం కావాలి.
మీ రచనల్లో మేము, తియ్యతియ్యటి తెలుగు పలుకులను ఆస్వాదించాలి.
మణిహారం లో కొలికి పూసలవలె భాసించాలని ....కోరుకుంటున్నాను.
బ్లాగు జన్మదినా మా ఆకాంక్షలకు దీటుగా మీరచనలు.ఆ రచనల పద్మార్పిత కు శుభాకాంక్షలు.అలుపులేక సంవత్స్రరం ప్రయాణించిన ఈ ప్రేమార్పిత కు పాఠకుల ప్రేమ జల్లులు. మరిన్ని జన్మదినాలను కోరుకునే మీ నేస్తం.
ReplyDeleteandukondi subhakankshalu...
ReplyDeleteబ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలండీ..
ReplyDeleteపద్మార్పితా నీవంటే అందుకే మాకింత అభిమానం..
ReplyDeleteనీవు ఏమి రాసినా అది తాకుతుంది మా హృదయం..
అందుకో నీవు శుభాకాంక్షలు మావి ఈ సుదినం.
చాలా బావుంది..శుభాకాంక్షలు :)
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు!
ReplyDelete-రాఖీ
జన్మదినం కావాలి జగతికే సంబరం
జనుల జేజేధ్వనులే తాకాలీ అంబరం
తరాలెన్ని మారినా తరగనీకు నీ కీర్తి
కావాలి మహిలోన నీవే ఆదర్శమూర్తి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ. ౧
పుట్టుకతో ఎవ్వరూ కాలేరు గొప్పవారు
బాల్యంలో అందరూ పెరిగేదీ ఒకేతీరు
క్రమశిక్షణ బ్రతుకైతే నీ భవితే పూలతేరు
లక్ష్యమొకటి తోడైతే నడకే నల్లేరు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ .౨
గతమంతా ఒకసారి నెమరువేసుకోవాలి
భవిష్యత్తు ప్రణాళికలు సరిచూసు కోవాలి
పట్టుదలా కృషీ నీకు నేస్తాలు కావాలి
అంచెలంచెలుగా నీవే గమ్యాన్ని చేరాలి
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ
దయ క్షమ నీకెపుడూ దగ్గరే ఉండాలి
ఇవ్వడానికెప్పుడూ నీవే ముందుండాలి
ఫలితమన్నది ఎప్పుడూ విజయమే కాబోదు
పథమంతా ప్రతిక్షణం ఆనందం చవిచూడు
అందుకో ఆనంద అభినందనం
అందుకో అభిమానయుత చందనం
హ్యాప్పీబర్త్ డే టూయూ- హ్యాప్పీబర్త్ డే టూయూ
.............................
మీ బ్లాగులను అందంగా అలంకరించడం లో మీకు మీరే సాటి...పద్మార్పిత..పరిమళం.. సత్య... ఇలా ఎందరెందరో
ఏంచేస్తే అలా సౌందర్యం సంతరించుకొంటాయో కాస్తతెలుపరూ..నేస్తాలూ..!
నా లాగే బండగా .. ఓ మట్టి కుండగా...ఎడారిలో ఎండగా..
ఏ సౌకుమార్యమెరుగని గుండెగా...నా బ్లాగ్ ఉండగా....
ఎవరు చూస్తారు..అటువంటిదాన్ని..
తొలిచూపులోనే ఆకర్శించలేనిదాన్ని..
మీ తోడ్పాటు.. మీ అనుగ్రహపాటు ..కోరుకొంటూ..
సద మీ స్నేహాభిలాషి
రాఖీ
pl visit www.raki9-4u.blogspot.com
ReplyDeletewww.rakigita9-4u.blogspot.com
www.raki9dash4u.wordpress.com
sadaa
mee snEhaabhilaashi
raki
జన్మదిన శుభాకాంక్షలు .. మీ బ్లాగ్కు..
ReplyDeleteమీ టపాల సమాహారం భలేగావుంది
హేపీ బ్లాగ్ బడ్డే టూ యూ..
ReplyDeleteమోహన్ గారి కోరికే నా కోరిక..
Belated birthday wishes to my favorite blog.....
ReplyDeleteపద్మర్పిత అక్క నా తరపున కూడా చిరునవ్వుల శుబాకాంక్షలు :) :)
ReplyDeleteWWW.THOLIADUGU.BLOGSPOT.COM
పద్మార్పిత గారు! మీరే నా బ్లాగుకి విచ్చేసిన మొదటి అథిది. కాబట్టి మీరు ఎప్ప్పటికీ నా అభిమాన బ్లాగరే.. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీ బ్లాగుకి నా జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడే మీ బ్లాగుని చూసాను. ఇక మీ బ్లాగులో ఉన్న అన్ని టపాలు చదవడమే తరువాయి. మీకు మళ్లీ కలుస్తా.. బాయ్!
ReplyDeleteమీ బ్లాగ్ రాయడానికి ప్రేరేపించిన మీ మిత్రుల గురించి రెండు ముక్కలు రాసి వుంటే బావుందేమో?
ReplyDeletei love ur blog padma.. i never commented on any post, but i used to follow it frm a long time.. like 6 months or so..
ReplyDeleteur poems are stress relievers to me.. lol.. keep going.. :) ..
శుభాకాంక్షలు ..
ReplyDeleteChalaaa baagaa rasaroo,
ReplyDeleteaksharalathoo kudina padaluu karuvu ayyayee mee varnanii abhivarninchataniki...