మాటలోని మర్మం!!

మాటలకి ఉన్నది ఎంతో మహత్యం!
అవి తెలుసుకుని పలకాలి మనం అనునిత్యం!

మాటలకి ఉన్నది ఎంతో కలుపుగోలుతనం!
అవి కావాలి ఎదుటివారికి మధురమైన భాష్యం!

మాటలకి ఉన్నది ఎంతో నేర్పరితనం!
అవి సున్నితమైతే అతికిస్తాయి విరిగిన మనసుని సైతం!

మాటలకి ఉన్నది ఆశని నిరాశ పరిచే గుణం!
అవి మనం చెప్పడంలోనే ఉన్నది మర్మం!

మాటలతో చేకూరుతుంది ఎంతో మనోధైర్యం!
అవి వ్యక్తం చేయడంలో చూపాలి మన నైపుణ్యం!

మాటలతో పెంపొందించగలం ఎదుటివారిలో శక్తిసామర్థ్యం!
అవి చెప్పేటప్పుడు అవలంబించాలి సరైన సమయపాలనం!

అందుకే ఆలోచించి మాట్లాడుదాం మనమందరం!
తానొవ్వక ఇతరులనొప్పించక ఆనందంగా జీవించేద్దాం!!

26 comments:

 1. baagundi padmarpita gaaru

  ReplyDelete
 2. ముత్యాల్లాంటి మాటలు చెప్పారు.

  ReplyDelete
 3. పద్మార్పిత నోరంతా తెరచి మాటలోని మర్మమిది, మనసులోని గీతమిది అని చెప్పాక కూడా అర్థంకాకపోవటమా?:)

  ReplyDelete
 4. అందుకే మాటే మంత్రము అన్నారుకదా :)

  ReplyDelete
 5. మీ మాటల మర్మం బాగుంది.

  ReplyDelete
 6. నిజమే కదా మాట లోనే వుంది మరి అంతా. బాగా చెప్పేరు..

  ReplyDelete
 7. బావుందండి మాటలు గురుంచి మీరు చెప్పిన మాటలు

  ReplyDelete
 8. మాట గురించి తానొవ్వక ఇతరులనొప్పించక చక్కగా చెప్పారు

  ReplyDelete
 9. లాస్ట్ రె౦డు లైన్లు సుపర్...బాగా రాశారు..

  ReplyDelete
 10. మాటలకి ఉన్నది ఎంతో నేర్పరితనం!
  అవి సున్నితమైతే అతికిస్తాయి విరిగిన మనసుని సైతం!
  chaalaa baagunnayi,ee lines

  ReplyDelete
 11. అందుకే ఆలోచించి మాట్లాడుదాం మనమందరం!
  తానొవ్వక ఇతరులనొప్పించక ఆనందంగా జీవించేద్దాం!!

  బాగుంది :)

  ReplyDelete
 12. పద్మార్పితగారు...మీకు ఇంత అందమైన పదాలు ఎక్కడ దొరుకుతాయండి? అదిరింది పోస్టు!

  ReplyDelete
 13. చాలా బాగుందండి పద్మర్పిత గారు. అందుకే అన్నారు "ఆరంగుళాల నాలిక ఆరడుగుల మనిషిని నిలువునా చీరేయగలదు" అని. నాలికని (మాట) ఎంతగా అదుపులో పెట్టుకోవాలో చాలా చక్కగా, మనసుకు హత్తుకునేలా చెప్పారు.

  ReplyDelete
 14. నిజమేనండీ....బాగా చెప్పారు.

  ReplyDelete
 15. కవితకి తగ్గ ఫోటో, ఫోటోకి తగ్గ కలర్ కాంబినేషన్.. భలే శ్రద్ధగా అలంకరిస్తారండీ బ్లాగుని..

  ReplyDelete
 16. నోరు మంచిదయితే ఊరు మంచిదౌతుంది అంటారు... కరక్టే ;)

  ReplyDelete
 17. మీ మాటల్లోని మర్మాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలండి!!!

  ReplyDelete
 18. మురళీగారు....మీ నోట ఈ మాట....
  నాకు అందించినది ముత్యాల మూట....
  ధన్యవాదాలు!!!

  ReplyDelete
 19. Sorry iam late, its very good.

  ReplyDelete
 20. అక్షర లక్షయీ అక్షర కూర్పు.... అభినందనలు పద్మార్పిత గారూ.ఆశీస్సులతో ..... శ్రేయోభిలాషి ....నూతక్కి

  ReplyDelete
 21. తేనెలొలుకు పలుకులతో
  మాటల మూటలు విప్పి
  తేట తెల్లం జేసి
  మాటల మహత్యాన్ని
  కోటల దాటింప చేసిన
  పద్మార్పితా !
  పద పద్మాలను అర్పించుకుంటున్నాను
  అందుకో....

  ReplyDelete
 22. క్షమించండి. ఆలస్యమైనందుకు. మర్మం విప్పిచెప్పినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 23. Devuda O machi devuda entha manchi
  Blogmithruralini prasadinchi neeku
  Hats off! because you are basically a good blo(god)

  ReplyDelete