నాకై నేను!

నన్ను నేనే మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేనే అద్దంలో చూసుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు...
నన్ను నేనే సమర్ధించుకుంటాను
అది ఎదుటివారికి సమ్మతమైనప్పుడు...

నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను భాధించినప్పుడు...
నాకు నేనే శిక్ష విధించుకుంటాను
నేరం నా వలన జరిగినప్పుడు...
నాకు నేనే దూరమైపోతాను
ఎవరికీ పనికిరానప్పుడు...

నా కంటిని నేనే శాసిస్తాను
సాక్షినై సహాయం చేయవలసినప్పుడు...
నా మనసుని నేనే లెక్కచేయను
అది తప్పు అని నాకు తోచినప్పుడు...
నా ప్రాణమైనా ధారపోస్తాను
పదిమందికీ అది ఉపయోగ పడుతుందనుకున్నప్పుడు...

25 comments:

 1. నువ్వు కూడ, నీకు దూరమైతే "ఒంటరితనం"
  వేరెవ్వరూ దగ్గర వున్నా, లేకున్నా...
  నీ తో నీవుంటె , "ఎకాంతం"...

  బహుషా..అది మీ సొంతం ....

  బాగుంది మీ భావన!...

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. బాగుందండీ....ఈ ఫోటోలు ఎక్కడ నుండి తెస్తారండీ? భలే ఉంటాయి మీ టపాల్లో.

  ReplyDelete
 4. ఫోటో చాల బాగుంది ..కవిత కూడా :)

  ReplyDelete
 5. కవిత చాలా బాగుంది. మరి ఫొటోలు కూడా ఎక్క్డవో చెప్పితే హాపీ కదా... ప్రతిఒక్కరూ ఇలాగే భావిస్తే ఎంత బాగుంటుందో!

  ReplyDelete
 6. కవిత బాగుంది.

  కవిత కోసమే అలా వ్రాసారా.. లేకపోతే అవే మీ భావాలా?

  చెప్పండి. మళ్లీ చూస్తాను.

  ReplyDelete
 7. కవిత బాగుంది.

  కవిత కోసమే అలా వ్రాసారా.. లేకపోతే అవే మీ భావాలా?

  చెప్పండి. మళ్లీ చూస్తాను.

  ReplyDelete
 8. సత్యగారు, శేఖర్ గారు, చిన్ని గారు, జయగారు ధన్యవాదాలు!
  "నా కంటికి నచ్చిన వాటిని పెయింటింగ్ చేయడం, బొమ్మలు వేయడం వాటికొరకు ఇలా వెతికి కలక్ట్ చేయడం నా హాబీ.....అవి మీకు నచ్చడం, మీరు వాటిని మెచ్చడం నాకు ఎంతో హాపీ"!

  ReplyDelete
 9. సవ్వడికి........
  మనలోని భావాలే కదా కవితలకి మూలం
  కొన్నింటినైనా ఆచరించాలని నా ప్రయత్నం
  కవితని మెచ్చిన మీకు ధన్యవాదాలు నేస్తం....

  ReplyDelete
 10. కవిత బాగుంది.
  చాలా రోజులకి రాసారు!

  ReplyDelete
 11. ఇంతకీ నీవెవరివి? :)
  కవిత బాగుంది.బొమ్మ అర్థవంతంగా వుంది.

  ReplyDelete
 12. భాస్కర రామి రెడ్డి గారు..
  తెలుకోవాలనే ఈ ప్రయత్నం:)
  తెలిపి చేయవచ్చుగా సహాయం:)
  మీ మెచ్చుకోలుతో మాకు కలిగె ఆనందం!

  ReplyDelete
 13. చాలా బాగుంది. మిమ్ములను మీరు ఆవిష్కరించుకున్న తీరు. కిరణ్ ప్రభ గారి కవిత గుర్తొచ్చింది. :-)

  ReplyDelete
 14. చాలా చాలా సున్నితంగా ఉంది అక్క కవిత బావుంది ..
  ఆ ఫోటో కూడా చాలా బావుంది....

  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 15. చాలా హృద్యంగా అందంగా ఉందండి మీ వర్ణన. చాలా బావుంది. చిన్న సందేహం: "నన్ను నేనే సమర్ధించుకుంటాను అది ఎదుటివారికి సమ్మతమైనప్పుడు" అన్న వాక్యంలో "సమ్మతంకానప్పుడు" అని ఉండాలనుకుంటాను? ప్రయోగం అలా ఐతేనే సరిగా ఇముడుతుందేమోనని అనిపించి చెప్పాను అన్యధా భావించకండి.

  రాజన్
  http://naagola.wordpress.com

  ReplyDelete
 16. ఈ ఒక్కటీ మాత్రం వొప్పుకోను. :)

  "నాకు నేనే శిక్ష విధించుకుంటాను
  నేరం నా వలన జరిగినప్పుడు...
  నాకు నేనే దూరమైపోతాను
  ఎవరికీ పనికిరానప్పుడు... "

  మార్చి

  "నన్ను నేను క్షమించుకుంటాను
  నేరం నా వలన జరిగినప్పుడు...
  నాకు నేను మిగిలిపోతాను
  ఎవరికీ పనికిరానప్పుడు... "

  అంటాను. ప్రేమ, క్షమ నా నామ్మకాలు. మనని మనం పోగొట్టుకోకూడదని యే పరిస్థిలోనైనా మనని మనమే పదిలంగా చూసుకోవాలని నా అభిప్రాయం.

  ReplyDelete
 17. ఔను ఊషగారు మీరు అన్నది రైట్....నా మట్టిబర్రకు తట్టలేదు!

  ReplyDelete
 18. భావనగారు, కార్తీకి,రాజన్ గారికి, ఉషగారికి ధన్యవాదాలు!

  ReplyDelete
 19. ఒకే ఒక మాట:
  మనసులోని భావాలెన్నో
  మరువలేని గాయాలెన్నో
  వీడలేని నేస్తాలెన్నో
  వీడిపోని బంధాలెన్నో
  మరపురాని పాటలెన్నో
  మధురమయిన క్షణాలెన్నో
  కవ్వించే కబుర్లెన్నో
  మాయమయ్యే మార్పులెన్నో
  అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
  తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
  ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
  మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
  ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
  ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
  మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
  ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..................

  ReplyDelete
 20. ఒకే ఒక మాట:
  మనసులోని భావాలెన్నో
  మరువలేని గాయాలెన్నో
  వీడలేని నేస్తాలెన్నో
  వీడిపోని బంధాలెన్నో
  మరపురాని పాటలెన్నో
  మధురమయిన క్షణాలెన్నో
  కవ్వించే కబుర్లెన్నో
  మాయమయ్యే మార్పులెన్నో
  అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
  తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
  ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
  మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
  ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
  ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
  మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
  ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..................

  ReplyDelete
 21. కవిత కోసమే అలా వ్రాసారా.. లేకపోతే అవే మీ భావాలా?మీ భావన!చాలా బాగుందండీ.నా కతలా బాగుందండీ .మీకు ధన్యవాదాలు ,ఇంతకీ నీవెవరివి?
  తెలిపి చేయవచ్చుగా సహాయం;
  naa katala (sontta)unnadi

  ReplyDelete
 22. it is really superb .. your thoughts are excellent

  ReplyDelete
 23. This comment has been removed by the author.

  ReplyDelete
 24. Padmarpita gaaroo!

  Your thoughts are wonderful.Photos too. I agree with Usha....Nutakki

  ReplyDelete
 25. కవిత చాలా బాగుంది........................................

  ReplyDelete