కరిగిన కలలో నిజాన్ని చూస్తున్నా
రాతిగుండెలో ప్రేమని వెతుకుతున్నా
ఎంతటి పిచ్చిదాన్ని నేను...
మాటేరానివాడ్ని ఒట్టేసి చెప్పమంటున్నా!
మోసాల అంగట్లో మంచిని బేరమాడుతున్నా
అనామకుని కళ్ళలో నన్నునేను వెతుకున్నా
మనసేలేని చోట నేను...
మమతలసామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!
చెవిటివాని ముందు కోయిలనై కూస్తున్నా
విరిగిన కొమ్మ చిగురించాలనుకుంటున్నా
ఒడ్డున దొరికిన శంఖంలో నేను...
స్వాతిముత్యాలకై అన్వేషిస్తున్నా!
ఇసుక నుండి తైలాన్ని తీయాలనుకున్నా
నడి సముద్రములో నావనై నేనున్నా
ప్రేమని ఆశించిన నేను...
కన్నీటికెరటాలలో ఎదురీదుతున్నా!
చాలా బాగా రాసారు. These lines exactly reflect my state of mind now.
ReplyDeleteమనసేలేని చోట నేను...
ReplyDeleteమమతలసామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!
no words for these lines.. u rock.. :)..
అంతేనంటారా? ;)
ReplyDeleteపద్మార్పిత,
ReplyDeleteబాగా చెప్పారు. భావం బావుంది. టైటిల్ మాత్రం తేలిపోయిందనిపించింది. ఇంకేదైనా మంచిది పెడితే బావుంటుందేమో. ఆలోచించండి. ప్రేమ అంతే ఏడిపిస్తుంది. ఆ తర్వాత వోదార్పు నిస్తుంది.
“ ఎంతటి పిచ్చిదాన్ని నేను...
మాటేరానివాడ్ని ఒట్టేసి చెప్పమంటున్నా!
ప్రేమని ఆశించిన నేను...
కన్నీటికెరటాలలో ఎదురీదుతున్నా!”
కల్పనారెంటాల
బాగుంది. కాపీరైట్స్ ఉల్లంఘన చట్టాన్ని వెనక్కి నెట్టి మా వోడి మీద అలిగాను కనుక ఇదే కాపీ యథాతథంగా పంపేస్తున్నాను.
ReplyDeleteమాటలాపితే, వడేసి పిండే బాధ ఇది. ప్రేమలో రెండు వైరుధ్యాల మధ్య నడుమ సంఘర్షణ ఇది. ప్రేమ ఇది అను అనుకోకపోతే అన్నిటా గోచరమౌతుంది. ఎపుడైతే దాన్నీ ఒక పాత్రలోనో మూసలోనో చూస్తామో [నేనూ చేస్తా] అపుడీ వేదనలు వెలికివస్తాయి.
త్వరలో వెలికి వచ్చి యుగళగీతం ఆలాపించండి.
అనామకుని కళ్ళలో నన్నునేను వెతుకున్నా
ReplyDelete"true"
@శ్రావ్యగారు..ప్రేమని ఆస్వాదించడమే కాని అన్వయించుకుంటే కష్టమేమో ఆలోచించండి!కవిత నచ్చినందుకు ధన్యవాదాలు!
ReplyDelete@Venu thanks a lot...
@భాస్కర్ గారు...అంతేకదండీ:):)
కల్పనగారు కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి.
ReplyDeleteపడిన పాట్లు చేసిన ప్రయత్నాలన్నీ వృధాయేకదాని అలాపెట్టాను.
ప్రేమ ఏడిపించినా ఓదార్చినా ప్రేమ ప్రేమే కదండీ:)
ఉషగారు...మీ కమెంట్ చదివి వెంటనే పాడేస్తున్నా ఒక యుగళగీతం "నింగి నేలా ఒకటాయెలే మమతలూ మనసులూ పూలై విరిసెలే" తరువాత చరణం అందుకోండి:):)
చిన్నిగారు....చాలారోజులు అయినట్లుంది మీరురాక...Its True!
"మోసాల అంగట్లో మంచిని బేరమాడుతున్నా
ReplyDeleteఅనామకుని కళ్ళలో నన్నునేను వెతుకున్నా"
చాలా నచ్చింది.
A master piece
ReplyDeleteబాగా చెప్పారు!
ReplyDeleteసరిలేరు మీకెవ్వరు కవితలరాణీ పద్మార్పితా.
ReplyDeleteపద్మ గారు మీ భావం బాగుంది. కవిత కూడా బాగుంది కాని స్పష్టంగా లేదనిపిస్తోంది. అసలు మాట రానివాడిని ఎందుకు ప్రేమించినట్టు.. మోసం చేసాడని తెలిసాక మోసగాడని అనకుండా అనామకుడు అని అంటారేం!
ReplyDeleteచివర రెండు పేరాలు చదివినప్పటికి క్లారిటి వచ్చింది.
"మనసేలేని చోట నేను...
ReplyDeleteమమతలసామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!"
'ప్రేమని ఆశించిన నేను...
కన్నీటికెరటాలలో ఎదురీదుతున్నా!"
హృదయవేదన సునామీలా ఎగసింది !
మా ఎదుట ఇలా కవితై నిలిచింది !
బాగుంది
ReplyDeleteసృజన,ప్రదీప్,సునీత,యోహంత్,సవ్వడి,పరిమళం,పవన్ స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి!
ReplyDeleteబాగా రాసారు..ఫోటో కూడా అతికినట్టుంది..
ReplyDeleteఆలస్యం గా చూసాను. ..
ReplyDeleteచాలా బాగా వ్యక్తపరిచారు. అభినందనలు !
good expression of feel. Best suits for a rejected love.
ReplyDeleteప్రేమ ఏడిపించినా ఓదార్చినా ప్రేమ ప్రేమే కదండీ:) This line reflects ur depth in LOVE.
ReplyDeletegood!
ReplyDeletevery nice padma garu..
ReplyDeleteWords are not enough to Appreciate you padma...
ReplyDeleteWe Can't say thanks enough..
You always sizzles..