చేయూత!!

నేను ఒంటరినై ఉన్నప్పుడు,నెమరైన ఙ్జాపకానివై నీవురావాలి!

మౌనం నన్ను చుట్టేసినప్పుడు,నీ పలకరింపులే తోడుకావాలి!

సమస్యల వలలో చిక్కిన్నప్పుడు,నేనున్నానని నా వెన్నుతట్టాలి!

గమ్యాన్న అవరోధాలున్నప్పుడు,మధురమైన భవిష్యత్తుగా కనపడాలి!

బ్రతుకు పయనంలో అలసినప్పుడు,నీ వెచ్చని ఒడిలో సేదతీరాలి!

చీకటిలో నేను దారితప్పినప్పుడు,ఆశల దీపమై వెలుగు చూపాలి!

జీవనయానంలో పోరాడేటప్పుడు,నన్ను వెంటాడే నీడవైపోవాలి!

42 comments:

 1. అమ్మో ఇన్ని పనులు నావల్ల కాదండోయ్ ;-)

  ReplyDelete
 2. అందుకేగా చేయూతనీయండి చాలంది:)

  ReplyDelete
 3. చేతికి గ్లొజ్ లు వున్నాయి. కష్టమబ్బా ( చలి : -7 Deg C)

  ReplyDelete
 4. ప్చ్..ప్చ్ ఏం చేస్తాం అడ్జస్ట్ అవుతాం:)

  ReplyDelete
 5. very very nice...నా చెయ్యి ఇస్తూన్నా ఇదిగో ఇక్కడ...ఇటూ వైపు ..కనిపి౦చి౦దా!!!

  ReplyDelete
 6. బాగుంది ...బాగా రాసారు
  అయితే మరి నాకు తెల్సింది మాత్రం సుత్తి కొట్టడమే కదా కావాలంటే సుత్తి ఇవ్వగలను

  ReplyDelete
 7. ఓ అలాగ అడ్జెస్ట్ అవుతానంటే నాకు ఓకే.. ;)

  Jokes apart, good work padmarpita.

  ReplyDelete
 8. padmarpitagaaru! "nemaraina" ii padaprayoegam kottagaa vundi! "nemareasukona" leadaa "nemareayanu" ani antea... Anyway, kotta pada prayoegaaniki abhinandanalu.

  ReplyDelete
 9. చేతులు, సుత్తులు, కత్తులు విత్ ఆర్ వితౌట్ గ్లౌస్........దేనికైన రెడీ!:):)
  @సుభద్రగారు, వంశీకృష్ణగారు, భాస్కర్ గారు....ధాంక్సండీ!
  @అశ్వినిశ్రీగారు నెమరువేసుకునే ఙ్జాపకానివై రమ్మని నా భావనండి...మెచ్చినందుకు ధన్యవాదాలు!

  ReplyDelete
 10. చాలా బాగా వ్రాసారండి. సరదాకోసం మీ కవితపై నా వ్రాతలు

  ఒంటరిగా ఉన్నప్పుడు తుంటరిగా ఏమన్నా వ్రాయండి
  మౌనం చుట్టు ముట్టేస్తే సరదాగా ఏదైనా గానం చెయ్యండి
  సమస్యలొస్తే వాటికి శతకోటి నమస్సులు చెప్పి పంపించెయ్యండి
  చివరిగా
  చేయూత ఇచ్చిన వాడికి ఓ కవిత వ్రాసి చేతిలో పెట్టండి
  ఇవనన్నవాడికి కాల్చి వాతలు పెట్టండి

  రాజన్
  http://naagola.wordpress.com/

  ReplyDelete
 11. ఎంతటివారికైనా కాస్తా ఆసరా కావాలి తనలోని భావాన్ని పంచుకునేందుకు. బాగుంది మీ కవితాత్మక అభ్యర్థన.

  ReplyDelete
 12. so beautiful dear... ఈ కవిత చదివనవెంటనే నేను అనుకున్న మాట. దాన్నే మీకు చెప్తున్నా!

  ReplyDelete
 13. "బ్రతుకు పయనంలో అలసినప్పుడు,నీ వెచ్చని ఒడిలో సేదతీరాలి!

  జీవనయానంలో పోరాడేటప్పుడు,నన్ను వెంటాడే నీడవైపోవాలి! "

  ఈ రెండు పంక్తులు నాకు బాగా నచ్చాయండి. బాగా రాశారు.

  ReplyDelete
 14. మరి మీ నాయిక తన వైపునుండీ రెసిప్రొకేట్ చేస్తుందా అవన్నీ? ;)

  ReplyDelete
 15. నా నీడే నీవు కదా! అంతటి చేయూత ఉండాలి కదూ! చాలా బాగుంది.

  ReplyDelete
 16. మాయమయ్యే నీడలా కాదు,
  ఒక్కటయ్యే తోడులా వుంటాను.

  ReplyDelete
 17. @రాజన్ గారు...థ్యాంక్సండీ! అంత సాహసం చేయమంటారా?:)
  @కెకె వర్మగారు నిజమే కదా!కమెంటిడినందు
  @ సవ్వడి స్పందనకి ధన్యవాదాలు!

  ReplyDelete
 18. @ శిశిరగారికి ధన్యవాదాలు!
  @ ఉషగారు నా నాయిక తప్పకుండా రెసిప్రొకేట్ చేస్తుంది అందులో సంశయమే వలదు మీకు:)
  @ జయగారు...థ్యాంక్యూ!
  @ హనుగారు..ఓకే!థ్యాంక్యూ:)

  ReplyDelete
 19. పద్మార్పిత గారు ఆఖరి పంక్తి లో ఏదో అపశ్రుతి గోచరిస్తోంది?
  వెంటాడే నీడవై పోవాలి అంటే మీ కష్టాలు తీరాక అతను పొవాలన?
  అప్పుడు ఇంకెవరన్నా రావాలి అన్న భావం వస్తోంది
  దానికంటే వెన్నంటే నీడవై నిలవాలి అంటే బావుండేదేమో?

  ReplyDelete
 20. మనం కూడా వారికి ఇలానే అయితే ఇంకా బాగుంటుంది కదండీ...ఇతరులు కుళ్ళుకునే భందం మన సొంతం..

  ReplyDelete
 21. బహు బాగుంది....

  ReplyDelete
 22. This comment has been removed by the author.

  ReplyDelete
 23. This comment has been removed by the author.

  ReplyDelete
 24. లేనిది చూపలెను
  ఉన్నది దాచ లేను

  నాకు నేను ఎమీ కాకుండా, నీకు ఎమీకాను?
  ప్రేమించు కొకుండా, నిన్ను ప్రేమించ లేను
  వారించు కోకుండా, నిన్ను వారించ లేను
  నేను లెనై నిన్ను ఊహించు కొను.

  లేనిది చూపలెను
  ఉన్నది దాచ లేను


  నాదేమి లేదను కుంటూ, అంతా నీదంటాను..
  సుఖాన్ని ధారపోసి,నిన్ను సాధించు కుంటాను. .
  దరి దొరకనీ నిన్ను దాచుకుంటాను
  దారి దొరకనీ గుండెలపై నడిపించుకుంటాను...

  లేనిది చూపలెను
  ఉన్నది దాచ లేను

  ReplyDelete
 25. చేయూత ఒక్కరినడిగితే ఎన్ని చేతులో చూశారా .....బ్లాగు బంధమూ ...ఎంత మధురమూ ...పాడేసుకోండి మరి :)

  ReplyDelete
 26. ప్రేమ ఓడిపోతే-
  మనసు చచ్చిపోతే-
  ఏముంటాయి నేస్తం!
  ఎడారి లో ఎండమావులు...
  స్మశానం లో మండే చితులు!!
  .....................
  ధన్యవాదాలు! మీరు నా ఆహ్వానం మన్నించి అప్పుడప్పుడూ మా యింటికి దయచేసినందుకు!!
  మా (బ్లొగ్) యింటి తలుపులు మా వొంట తలపులు..
  ఎప్పుడూ తెఱచే ఉంటాయి మాపై దయచూపేటందుకు!!
  సదా మీ స్నేహాభిలాషి
  రాఖీ

  ReplyDelete
 27. @@@ బ్రతుకు ఎడారిలో..
  భవిత స్మశానం లో

  ReplyDelete
 28. చాలా బాగా చెప్పారు padmarpita గారు..

  అవును ఈ padmarpita అంటె ఏందండి..?

  ReplyDelete
 29. "గమ్యాన్న అవరోధాలున్నప్పుడు,మధురమైన భవిష్యత్తుగా కనపడాలి!" good..

  ReplyDelete
 30. మీ చేయూత బాగుంది .
  ఇప్పుడే లలిత గారి బ్లాగ్ లో చదివాను , డిసెంబర్ లో మీ పుట్టిన రోజని ,
  జన్మదిన శుభాకాంక్షలు .

  ReplyDelete
 31. http://tammunililalu.blogspot.com/2009/12/blog-post.html

  ReplyDelete
 32. కవిత కోసమే అలా వ్రాసారా.. లేకపోతే అవే మీ భావాలా?మీ భావన!చాలా బాగుందండీ.నా కతలా బాగుందండీ .మీకు ధన్యవాదాలు ,ఇంతకీ నీవెవరివి?
  తెలిపి చేయవచ్చుగా సహాయం;
  naa katala (sontta)unnadi

  ReplyDelete
 33. Sorry late ga chusanu..nice one

  ReplyDelete
 34. చాలా బాగా వ్రాసారు .....మీరు మరిన్ని కవితలు వ్రాస్తారని కోరుకుంటూ .
  మీ శ్రేయోభిలసి..........సూర్య

  ReplyDelete
 35. చాలా బాగా వ్రాసారు .....మీరు మరిన్ని కవితలు వ్రాస్తారని కోరుకుంటూ .
  మీ శ్రేయోభిలసి..........సూర్య

  ReplyDelete
 36. చాలా బాగా ఉంది.. మీ బ్లాగు. నా బ్లాగు వెనకాల ఎవరున్నారో అనుకుంటూ next blog ని నొక్కాను.. మీ కవితాఝరిలో మునిగితేలాను.. చాలా బాగా వ్రాశారు.

  ReplyDelete
 37. chalaa baagundi. mee perutone naa bloglo post cheyadaaniki anumativvalani vinati. plz

  ReplyDelete
 38. chalaa baagundi. mee perutone naa bloglo post cheyadaaniki anumativvandi. plz

  ReplyDelete
 39. chalaa baagundi. mee perutone naa bloglo post cheyadaaniki anumativvalani vinati. plz

  ReplyDelete
 40. బ్రతుకు పయనంలో అలసినప్పుడు,నీ వెచ్చని ఒడిలో సేదతీరాలి!

  జీవనయానంలో పోరాడేటప్పుడు,నన్ను వెంటాడే నీడవైపోవాలి!

  ఈ వాక్యాలు చాలా బావున్నాయి.

  ReplyDelete