అనురాగాలమూటకి శ్రీకారమీ బంధం
ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం
సాగరానికి కెరటానికి ఉన్నది ఈ సంబంధం
జాబిలికి వెన్నెలతో ఉన్నది ఇదే అనుబంధం
అనుమానాలకి చోటివ్వని బంధం
నమ్మకంతో బలపడితే ఈ రాగబంధం
కలకాలం నిలుస్తుందదే అనురాగబంధం
ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం
సాగరానికి కెరటానికి ఉన్నది ఈ సంబంధం
జాబిలికి వెన్నెలతో ఉన్నది ఇదే అనుబంధం
అనుమానాలకి చోటివ్వని బంధం
నమ్మకంతో బలపడితే ఈ రాగబంధం
కలకాలం నిలుస్తుందదే అనురాగబంధం
సరే అలాగే కానివ్వండి మరి. ప్రేమబంధమూ ఎంత మధురమూ .... ;) ఈ అనుబంధంలోజీవించటం నాకు కరతలామలకం కనుక... నా వోటు మీకే...
ReplyDeleteఏంటమ్మాయ్ పద్మార్పితా... ఇంతలోనే అలక తీరిందా.. ఇలాఅయితే కష్టమే మరి :)
ReplyDeletechinni kavithinaa baavam peddadi..
ReplyDeleteee kavithanu enni lines ayinaa podiginchukuntu povachchu.....
గూగుల్ వాడు మీ కవితల కోసమే కొన్ని ఫోటోలు ప్రత్యేకంగా పెడుతున్నాడేమో అనిపిస్తోందండి.. అతికినట్టుగా సరిపోయే ఫోటోలు సంపాదిస్తారు మీరు.. కవిత బాగుంది..
ReplyDeleteఇంతకీ వాళ్ళు ములుగు తార?తెలతారా ?పద్మార్పిత గారు?
ReplyDeleteమీ ప్రేమ మద్యలో రవిని మున్చేసారే(బొమ్మలో)?
@ఉషగారు మీ బాటనే నా మాటండి....
ReplyDelete@భాస్కర్ గారు మరీ తెగేదాకలాగడం ఎందుకని:)
@కార్తీక్ మీరన్నది కరెక్ట్...ఇలా ఎంతైనా పొడిగించవచ్చు ఈ కవితని!
@మురళీగారు ధన్యవాదాలండి... థ్యాంక్స్ టు గూగుల్!
@ రవిగారు...వాళ్ళు మునిగినా తేలినా మిమ్మల్ని ముంచరులెండి. వారి ప్రేమలో రవి మునగడం అంతా భ్రమ(బొమ్మలో)
ReplyDeleteపద్మా ఇది మాత్రం బొమ్మకొరకే కవితలా వుంది అవునా!!:)
ReplyDeleteఏ బంధమయినా తెగిపోతుందేమోగాని ఈ బంధం మాత్రం శాశ్వతం. మీరేమీ అనుకోనంటే...చిన్న విషయం.
ReplyDelete' అనురాగాల మూటకి ఆకారమీ బంధం 'అంటే ఇంకా బాగుంటుందేమా ఆలోచించండి.
ఈ అనురాగ బంధం చాలా చాలా బాగుంది. ప్రేమ బంధం ఏనాటికైనా, ఎక్కడున్నా ఎప్పటికీ శాశ్వతమే.
ReplyDeleteఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం... ఎంత బాగా చెప్పారండి. చాలా బాగుంది.
ReplyDeleteబావుందండి.
ReplyDeleteమీరు అసలు ఇంత సూట్ అయ్యే ఫొటోస్ ఎలా సంపాదిస్తారో నాకు అర్ధం కావటం లేదు
చాలా బాగుంది ..
ReplyDeleteనూతన సంవత్సర శుభాకంక్షలు..
నా కానుకగా ఈ టపా అందుకోండి:
http://creativekurrodu.blogspot.com/
chaalaa baaraasaaru. pic superb.
ReplyDeletebaagundi padmarpita...
ReplyDeleteఎన్నాలు ఎమ్ మిస్ అయ్యానో అర్ధం అవుతుంది ...హార్ట్ లో గుచుతాయి ని కవితలు...
ReplyDeleteపద్మార్పిత గారూ! మీ బంధంలో ప్రేమజీవుల్ని అంబుధిలో, ప్రేమాంబుధిలో పెనవేశారు చూశారూ ! అధ్భుతం.గొప్ప గ్రాఫిక్స్ సంపాదించారు.యిక కవిత......రెండు మూడు నాలుగు చరణాలు "బంధం" తో అంతమౌతూ పద చలనానికి యిబ్బందిగా వుందనిపించింది. యీ క్రింది విధంగా ..
ReplyDeleteఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం అన్న చోట ... ఒకరినొకరు పెనవేసుకొనేదీ
ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం అన్నచోట.... ఒకరికొకరి నిరీక్షణలో పెరిగేదీ.... అంటే ఎలా వుంటుందంటారూ? ఆలోచించి చూడండి....
Nutakki