కవితలాంటి జీవితం...

కవితలాంటి జీవితంలో....

కొన్ని భావాలు మరికొన్ని ఆశయాలు
కొన్ని కోరికలు మరికొన్ని కల్పితాలు
కొన్ని సత్యాలు మరికొన్ని ఆశలు...

హృదయమే దాని శీర్షిక
భావమే దానికి వాటిక
ఎన్నెన్నో స్వప్నాల డోలిక...

గాలితెమ్మెరలవంటి మాటలు
అలలై ఎగసిపడే భావనలు
సుగంధాలవ్వాలని తాపత్రయాలు...

అర్థం తెలియని పదాలతో తికమక
అందరినీ మెప్పించాలనే కోరిక
తీరుతుందో లేదో వేచి చూడాలిక...

17 comments:

  1. అన్ని బావున్నాయి కాని ఇంతకు నీ సంగతేంటో అర్థం కావడం లేదే!!ఒకసారేమో వీర లవ్ అంటావు నువ్వు లేక పోతే నాజీవితమే వేస్ట్ అంటావు.. ఇంకోసారేమో లవ్ తొక్క అంతా ట్రాష్ అంటావు.. పెళ్లి గిల్లి వేస్ట్ అంటావు.. అంతలోనే నేను నీ ప్రేమ కోసం పడి చస్తున్నాను అనే లెవెల్ లో బిల్డుప్ ఇస్తావు ఇంతలోనే వేదాంతం మాట్లాడుతావు.. ప్రపంచం లోని కష్టాలన్నీ నీవే అన్నట్టు ఫీల్ అవుతావు.. ఇంతకన్నా అందమైనా లోకం లేదన్నట్టు పోసే కోడతావు.. ఏంటి నీ కథేంటి అని.. కొంపదీసి లవ్ ఫైల్యురా!! లేక జస్ట్ మదిలో మెదిలిన బావాలేనా.. చాలా రోజులుల నుంచి ఓబ్సేర్వే చేస్తున్న అడుగుదామని ఇవాల్టికి టైం కుదిరింది.. అది మేటర్..

    ReplyDelete
  2. సుగంధాలవ్వాలని తాపత్రయాలు....

    ee maata caalaa baagundi.

    ReplyDelete
  3. హౄదయ శీర్షికపై కవితని నిలిపారు..ఇహ ప్రతి పదం అర్దవంతమై పరిమళిస్తాయి.

    ReplyDelete
  4. comparisation bagumdi anDi.... nice kavitha./..

    ReplyDelete
  5. కవితాత్మను ఆవిష్కరించారు..

    ReplyDelete
  6. అంత్య ప్రాసల అందం ...మీ కవిత సొంతం

    ReplyDelete
  7. know గారు ...సమయం కుదుర్చుకుని సందేహాలని వెల్లబుచ్చినందుకు సంతోషం.
    భగ్న ప్రేమికులే విషాదం గురించి,
    పూర్తి జీవితాన్ని చూసినవారే జీవితం గురించి రాయాలంటే.....
    వాటిని మీరు నేను కాకుండా మన మనవళ్ళు మనవరాళ్ళే చదువుతారేమోనండి:)
    నా మదిలోని భావాలకి
    నా అనుభవాలకి
    నా ఆశయాలకి
    నా ఆచరణలకి
    ప్రతి రూపాలు కొన్ని కవితలు.

    ReplyDelete
  8. నచ్చిమెచ్చిన వారందరికీ.....ధన్యవాదాలండి!

    ReplyDelete
  9. good baagaa raastunnaaru.. meeku time unte naa blog kudaa chusi mee coments raaste santoshistaanu.
    my blog ...
    rameshbbabu.blogspot.com

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. కొన్ని భావాలు మరికొన్ని ఆశయాలు
    కొన్ని కోరికలు మరికొన్ని కల్పితాలు
    కొన్ని సత్యాలు మరికొన్ని ఆశలు...

    అంటే భావాలు ఆశయాలు కాదా? కోరికలు కల్పితాలు కాదా?ఆశ కోరిక కాదా కోరిక ఆశకాదా , అసలు కల్పితానికి కోరికకు, కోరికకు ఆశ కు ఇన్ని లింకులా?

    హృదయమే దాని శీర్షిక
    భావమే దానికి వాటిక
    ఎన్నెన్నో స్వప్నాల డోలిక...

    దేనికి శీర్షిక హృదయం, భావము గుండెకి రంధ్రం చేసి బయటకు వస్తుందా లేకపోతే కలలో గుండెను ఉయ్యాల లో కోర్చోపెట్టి ఉపేస్తున్నారా? కళ్ళు తిరగవా అలా అయితే ;-)

    గాలితెమ్మెరలవంటి మాటలు
    అలలై ఎగసిపడే భావనలు
    సుగంధాలవ్వాలని తాపత్రయాలు...

    అంటే గుస గుసలాంటి మాటలా? గుస గుస మాట్లాడితే అలలు ఎలా పుడతాయి. ఘాట్టిగా అరవాలి కదా! అదీకాక మాట్లాడితే సుగంధాలు వస్తాయా? సెంటు కొట్టుకుంటే వస్తుంది కానీ ! :-)

    అర్థం తెలియని పదాలతో తికమక
    అందరినీ మెప్పించాలనే కోరిక
    తీరుతుందో లేదో వేచి చూడాలిక...

    అర్థం తెలియకపోతే మానె తికమక పడితే అందర్ని మెప్పించలేము. ఇక కోరిక ఎలా తీరుతుంది చెప్పండీ ;)

    హమ్మయ్య చాలా రోజులగా కామెంట్లు రాయలెదు కదా.. ఆ కసి ఈరోజు తీర్చేసుకున్నాను.:-D

    ReplyDelete
  12. రమేష్ గారు,సృజనగారు,శివరంజనిగారు, మురళిగారు,సత్యగారికి ధన్యవాదాలండి!

    ReplyDelete
  13. భాస్కర రామిరెడ్డిగారు కసితో కూడా కవిత్వంతో కమెంటిడి కవ్వించగలరన్నమాట:):)

    ReplyDelete
  14. ఊహలకే రెక్కలోస్తుంటే ...కాదేదీ అసాధ్యం :)

    ReplyDelete