స్వీట్స్ ప్రపోసల్

ఓ...అమ్మాయి!!!
నీవే నా పీచుమిఠాయి
ఓరకంట చూడమాకే ఓ పిల్లా
నాకు గుర్తుకొస్తుంది రసగుల్లా
నీ అధరాలపై దరహాసం
నాకది సేమ్యా పాయసం
నీవు నడుస్తుంటే భలే మజా
తలపిస్తుందది తాపేశ్వరం కాజా
నీ జడలోని గులాబీ
నాకు అక్కర్లెద్దు జిలేబీ
నీ బుగ్గలపై పడే సొట్లు
నా మదిలో మెదిలే బొబ్బట్లు
నీ చీరమాటున దాగిన బొడ్డు
గుర్తుచేస్తుందది తొక్కుడులడ్డు
నీ నల్లని కురుల సిరులు
రాసులై కనిపిస్తున్న పూతరేకులు
అమ్మో! నీ అందాన్ని కొల్వ
సరిపోదు నూరుకిలోల హల్వ
నాకు నీవే సరి అయిన సిరి
నీవుంటే నాజీవితం రవ్వకేసరి
కాదని అనకే ఓ! డింగ్రీ
నేనౌతా తీపిలేని జాంగ్రీ
సరే అని ఒప్పుకోవే నా చెలీ
అందరికీ పంచుదాం చక్కెరపొంగలి!!!

అభ్యర్ధన:-అమితంగా స్వీట్స్ ని ఇష్టపడే ఓ అబ్బాయి తన ప్రేయసికి చేసిన స్వీట్స్ ప్రపోసల్......స్వీట్ స్వీట్ గా చదివి ఆనందించండి, ఆరగించకండేం:):)

19 comments:

 1. అమ్మాయి వూఅంటే వెంటనే ఆ పిల్లోడు డయాబెటిక్ అవుతాడో ఏం పాడో మరీ అంత స్వీట్ ప్రపోజలా...

  ReplyDelete
 2. అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయికి ఇన్సులిన్
  అమ్మాయి కాదనంటే అబ్బాయికి ఎండ్రిన్

  బావుంది మీ తీపి కవిత..
  ఆ మిటాయి కొట్టు సీను గాడు రాసిన లెటర్ మీకు ఎక్కడ దొరికింది.

  ReplyDelete
 3. కవిత బాగుంది.నల్లని కురులను తెల్లని పూతరేకులతో పోల్చారేంటండి.

  ReplyDelete
 4. abbooooo..... chaalaa sweet propasal...!

  ReplyDelete
 5. భావనగారు.....ఆమె ఇచ్చే జవాబు అతనికి "ఇన్సులిన్" లా పనిచేస్తుందో ఏమో వేచిచూడాలి:):)

  చందుగారు...."ఇన్సులిన్" అయితే ఓకే "ఎండ్రిన్" ఎందుకండి ఎంచక్కగా ఏదో ఒక మిఠాయితో ఎంజాయ్ చేస్తాడులెండి:)

  ReplyDelete
 6. అనుగారు....నల్లని కురులేంటి?? తెల్లనివేంటి?? ఏదైనా మీరు స్వీట్స్ భాషలోనే అతని మనసుకి తాకేది....అంతే మరి:):)

  గీతికగారు....స్వీట్ స్వీట్ గా ఉంది కదండి:):)

  ReplyDelete
 7. ఈ మధ్య ఏమైనా పెద్ద పెళ్ళికి వేల్లోచ్చరా ఏమండీ..? హ హ హ. సరదాగా ఉంది..బాగా రాసారు

  ReplyDelete
 8. హ హ్హ హ్హ...పద్మార్పితాగారు చంపేసారు కదండి (actually వైరాగ్యపు కవితకానిది రాసి బ్రతికించారు :) )

  ఆ అబ్బాయిగారికి అమ్మాయిగనక వాకే అంటే జన్మంతా మిఠాయి భాండార్‌లో గడపాల్సొస్తుందేమో.. :))
  >>ఓ...అమ్మాయి!!!
  నీవే నా పీచుమిఠాయి
  ఓరకంట చూడమాకే ఓ పిల్లా
  నాకు గుర్తుకొస్తుంది రసగుల్లా

  >>నీవు నడుస్తుంటే భలే మజా
  తలపిస్తుందది తాపేశ్వరం కాజా

  >>అమ్మో! నీ అందాన్ని కొల్వ
  సరిపోదు నూరుకిలోల హల్వ

  >>కాదని అనకే ఓ! డింగ్రీ
  నేనౌతా తీపిలేని జాంగ్రీ
  సరే అని ఒప్పుకోవే నా చెలీ
  అందరికీ పంచుదాం చక్కెరపొంగలి!!!


  హ హ్హ హ్హ...లోళ్ళే లోళ్ళు
  Still can't stop laughing...marvelous.
  Thanks for writing this master piece.... :))

  ReplyDelete
 9. Fond of mudiv...found of music kadu......ardam cheskuntaru.

  ReplyDelete
 10. శివచెరువు గారు....ఏ పెళ్ళిలో అన్ని స్వీట్స్ ఒకేసారి పెడతారో కనుక్కోండి వెళదాం:):)

  ప్రవీణ్ గారు...Next so hot (తప్పుగా అనుకోకండి మిక్చర్, కారబ్బూందిలాంటివి అన్నమాట)!:):)

  ReplyDelete
 11. నాగార్జునగారు....అమ్మయ్య! మొత్తానికి మిమ్మల్ని నవ్వించాను, ఇంద్రధనస్సు విరిసిందిగా:):)

  మల్లిక్ గారు..Iam sorry, అర్థం కాలేదండి!

  ReplyDelete
 12. So cute... and the picture is nice

  ReplyDelete
 13. యమ్మీ..యమ్మీ స్వీట్స్:):)

  ReplyDelete
 14. అమ్మో ఎన్ని స్వీట్లో:)

  ReplyDelete
 15. తేలికైన పదాలతో బాగున్నాయి మీ కవిత లు .

  ReplyDelete
 16. హ హ ..భలే బాగున్నాయండి ..మీ కవితలు .

  ReplyDelete