స్వీట్స్ ప్రపోసల్కి హాట్ ఆన్సర్!

ఓయ్...కుర్రాడా!
నువ్వే నా ఆవడా
నీ దొంగ లుక్స్...
వేడి వేడి ఆలుచిప్స్!
నీ హెయిర్ స్టైల్...
విడివడిన మాగీనూడిల్!
నీ రెండు నయనాలు...
గుర్తొస్తున్నాయి చిట్టిచెకోడీలు!
నీ మీసకట్టు...
మాడిన పెసరట్టు!
మొటిమలతో నీ చెంపలు...
తలపిస్తున్నాయి శెనగపప్పుచెక్కలు!
నీలో ఏముందో నాకు తెలియకుంది...
అయినా నువ్వే నాకిష్టమైన కారప్బూంది!
నీపై ఆలోచనలు సన్నకారప్పూస...
నీ మనసు మాత్రం వెన్నపూస!
నచ్చింది నాపై నీకున్న ఆశ...
అది కమ్మని మసాలాదోశ!
సై అంటున్నాను నీ స్వీట్స్ ప్రపోసల్ కోయ్...
తిందాం చిన్ని ఉల్లి సమోసాలు పదవోయ్!:)

14 comments:

 1. అహా ఎంత మంచి "హాట్" ఆన్సరో కదా. తిట్టిన తిట్టు తిట్టకుండా ;)

  ReplyDelete
 2. prasa sarigaaledu anipistundi choodandi nestam (oye reply ichaavaa debbalu padutaai)

  ReplyDelete
 3. next so hot అంటే ఇదా.. :)
  చాలా బాగుంది. very creative.

  ReplyDelete
 4. ఆ...ఈ హాట్ కవిత అంతబాగోలేదండి. తీపి కవితే సూపరు... [నోటిదూల: ఒక అమ్మాయి చెప్తుంది కాబట్టి బాగోలేదా.. ;) ]

  ReplyDelete
 5. భాస్కర్ గారు....తిట్టినా మొట్టినా అమ్మాయే కదండి:)
  అయినా మనలో మాట అవి తిట్లా???

  శేషుగారు....hmmm దెబ్బలు పడతాయిగా మరి అందుకే:)

  ReplyDelete
 6. ప్రవీణ్ గారు....క్లూ ఇచ్చాను కదండి హాట్ అంటే అపార్థం చేసుకోవద్దని, థ్యాంక్యూ:)

  నాగార్జునగారు..తెలుసుగా మీకు తీపంటే బహుప్రీతని!
  ఇంక ఎవరంటారు చెప్పండి నోటిదూలని!!:):)

  ReplyDelete
 7. వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. పద్మా....ఏంటి! ఇంత అల్లరిపిల్లా...బాగుంది:):)

  ReplyDelete
 9. తెలుగు సినిమా పాటల కన్నా బావుంది... ఇంకా నయం ప్రేమకుడితే చికెన్గున్యా లాంటి దరిద్రాలు రాయలేదు ...
  :-)

  ReplyDelete