ఒక కల...

ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని!!!

ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!

ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని!!!

ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!

ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని!!!

19 comments:

  1. ఒక కల అజ్ఞాతంగా అంతమవాలని...,
    ఒక కల మరణించీ జీవించాలని.....

    (may be remix....)

    ReplyDelete
  2. correction : above comment to be read without 'may be'

    ReplyDelete
  3. @పద్మార్పిత

    మీ పేరు చాలా బాగుంది అండి. మీ కవిత కూడా అందంగా ఉంది. అక్కడక్కడ spelling mistakes ఉన్నాయి. వీలు కుదురినప్పుడు సరిచూసుకోగలరు.

    మీ కలలన్నీ నెరవేరుతాయి అండి. స్త్రీ కళలకు ప్రతిరూపం. ఆమె అనుకోవాలే కానీ కళలు ఆమె ముఖంలోనైనా, చేతిలోనైనా ఠక్కున వాలిపోతాయి. నాకు ఈ రెండు వాక్యాలు బాగా నచ్చాయి:

    ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలనినా జీవితం అందరికీ ఆదర్శం కావాలని
    ఒక కల...హాయిగా అంతమైపోవాలనిమరణించి అందరిలో జీవించాలని

    మనలో ప్రతీ ఒక్కరూ ఇలాగే అనుకోవాలి, ఆలోచించాలనీ ఆశిస్తున్నాను.

    ReplyDelete
  4. మొత్తానికి బాగుదండి మీ కల.

    ReplyDelete
  5. పద్మార్పిత గారు! బాగుంది
    ఈ మధ్య మీరు రాసినవాటిలో ఇది బాగా నచ్చింది.
    ఆ ఫొటో కూడా బాగా కుదిరింది. మంచి కవితకు మంచి ఫొటో!

    ReplyDelete
  6. @పద్మార్పిత
    చాలా అందమైన కవిత .

    ReplyDelete
  7. కవిత చాలా బాగుంది. చాలా కవితల్లో మీ శైలి తేలిక పదాలతో చదివించగలిగేలా చేస్తుంది. ఏమీ అనుకోనంటే... ఒక చిన్న మాట "జీవకల" కాదు... "జీవకళ".

    సరిచేస్తారని ఆశిస్తూ...

    ReplyDelete
  8. ఒక కల...హాయిగా అంతమైపోవాలని
    మరణించి అందరిలో జీవించాలని!!!

    ii line superb!!!
    chala bavundandi mee kavitha...

    ReplyDelete
  9. yemiledu oka kala ane padam kakundaa inkaa mottam nachindi mee kavitaa ani vraasinaa antee

    ReplyDelete
  10. ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
    నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!
    ee padam chaala chaalaa nachindi nestam naaku

    ReplyDelete
  11. చాలా చాలా బాగుందండీ మీ కల..కవిత..:) నిజం కావాలని కోరుకుంటూ..

    ReplyDelete
  12. నాగార్జునగారు...కాపీ కొట్టేసాగా:) Thank Q!

    సందీప్ గారు...సరిచేసానండి,థ్యాంకండి!

    ReplyDelete
  13. @అశోక్ పాపాయిగారు...మొత్తానికి
    మెప్పించానండి
    మిమ్మల్ని:)

    @సవ్వడిగారు,Priyamaina,Geetika,kiran,
    Seshu,మనసు పలికేగారికి
    థ్యాంకండి!!!

    ReplyDelete
  14. All your recent posts are very sensible,touching and funny too. Keep going. :)

    ReplyDelete
  15. మీ కలలోని కళలన్నీమీసొంతం కావాలని...

    ReplyDelete
  16. "ఒక కల...మంచి కవిత వ్రాయాలని
    నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!" ...ఇంకా కలే అంటారా??

    ReplyDelete
  17. Wonderful...

    ReplyDelete