నాకివ్వు...
నాకు నీపై చెప్పలేని అనురాగం...తప్పలేదైనా మనమధ్య దూరం...దొంగిలించావు నాశ్వాసలోని సగం...అంటున్నావు చేయలేదని ఏనేరం...ఈ దూరాన్ని ఎడబాటు అనుకోకు...నా మౌనాన్ని అలుక అని అనుకోకు...నిన్నేతలచే నన్ను అలుసుగా చూడకు...విధివ్రాతకు మన బ్రతుకును బలికానీకు...ఆనందాన్ని అందరికీ పంచి నీ నవ్వుని నాకివ్వు...సమయాన్ని అందరికిచ్చి నీ జీవితాన్ని నాకివ్వు...ఆప్యాయాన్ని పదిమందికిచ్చి నీ హృదయాన్ని నాకివ్వు...ఎందరు నిన్ను ప్రేమించినా నీ ప్రేమను మాత్రం నాకివ్వు...
నీ అందాలన్నీ చూసే ఆనందం నాకివ్వు
ReplyDeleteఇటువంటి ఎన్నో మంచి కవితలని మీరు మాకివ్వండి!
ReplyDeleteఇలా అన్నీ నాకివ్వు అని అడగడం కన్నా
ReplyDeleteఅన్నీ తనకె ఇచ్హి చూడండి!
ఇక నాకూ నీకూ ఇవ్వడానికీ ఏవీ మిగలవు!
అన్నీ వారికే ఆనందో బ్రహ్మ!
Padmarpitha...chala bavundi :)
ReplyDeleteచాలా బావుంది.
ReplyDelete@రావుగారు...కనులుమూసుకుని మీ మనోఃసౌందర్యాన్ని తిలకించండి!
ReplyDeleteఅంతకు మించిన అందం ఆనందం ఉందా చెప్పండి??
@రసజ్ఞగారు తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నిస్తాను...థ్యాంక్సండి!
'ఎందరు నిన్ను ప్రేమించినా నీ ప్రేమను మాత్రం నాకివ్వు '. బాగుంది. చాలా రోజులైంది మీ కవితలు చూసి. మార్చిన టేంప్లేట్ చాలా బాగుంది.
ReplyDelete@జిలేబి...
ReplyDeleteఅన్నీ ఇచ్చి చేతులు దులుపుపోవడం కన్న...
ఇచ్చి పుచ్చుకోవడం మిన్న...
కాదంటారా?:-)Thank Q!
@వల్లి, జ్యోతిర్మయి, జయగార్లకి ధన్యవాదాలు.
మీ కవితకి నా వాక్యం "నీ అందాలన్నీ చూసే ఆనందం నాకివ్వు" జోడించి చదువుకుంటాను. ఎందుకో నాకయితే అతికి పోయినట్టు ఉంది.
ReplyDelete"అందాలు ఇచ్చే ఆనందం కనులు మూసుకుంటే కనపడదేమో", పోస్టులో వేసిన బొమ్మలు చాలు చూసి ఆనందించటానికి.
చాలా రోజులకి మీ కవితతో మైండ్ ఫ్రెష్ అయిన ఫీలింగ్....గుడ్!
ReplyDeleteపద్మ బాగుంది ఎప్పటిలాగానే:)
ReplyDelete@ రావుగారు మీకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే కవితని అలాగే చదువుకోండి.
ReplyDeleteకనులకి కనపడే బాహ్యసౌందర్యం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో ఆలోచించుకోండి:)Just kidding, thanks for comments.
@ Yohanth,సృజనగారు థ్యాంక్సండి...
@పద్మార్పిత గారు మీరు వర్ణించిన ప్రేమ ఎంతో అందమైనది.. మీకు జీవితాన్నే అంకితమిచ్చి సమయాన్ని మాత్రం పరులకు కేటాయించాలని..ఆప్యాయాన్ని పది మందికి పంచి హృదయం మాత్రం మీకు ఇవ్వాలని కోరారు.. మీ వాక్యలలో భౌసా మనసులో కూడా కావచ్చు సమాజ స్పృహతో పాటు ప్రేమ కలిగుండటం ఆనందదాయకం... మరియు నలుగురి ఆనందానికి కారణమైన తన నవ్వులను చూడాలని అంటే కచ్చితంగా అది స్వచ్చమైన విన్నపమే.... ఇదేనేమో స్వార్ధం తో కూడిన నిస్వార్ధ ప్రేమ అంటే... మొత్తానికి చాలా బాగా చెప్పారు... మీరు అనుకున్నవి జరగాలని నా ధన్యవాదాలు...
ReplyDeleteచాలా బావుందండీ మీ ప్రేమ భావం.
ReplyDeletehmmm.... chala bagundi andi...
ReplyDeleteతప్పకుండా ఇస్తానండీ.. కాని మీరు నేనడిగింది ఇవ్వలేదుగా. కవిత చాలా బాగుంది పద్మ గారు.
ReplyDelete@చిన్ని ఆశ...నా భావాన్ని మెచ్చిన మీ మనోభావాలకి నెనర్లు!
ReplyDelete@నేను మీ నేస్తాన్ని....థ్యాంక్సండి!
@subha గారు...ధన్యవాదాలండి!
అడిగిందిస్తే లేదు ఆనందం...
అడగక అందినదే అహ్లాదం...
కాదంటారా??:):)
పద్మార్పిత గారికి దీపావళి శుభా కాంక్షలు
ReplyDeleteఈ దూరాన్ని ఎడబాటు అనుకోకు...
ReplyDeleteనా మౌనాన్ని అలుక అని అనుకోకు...
నిన్నేతలచే నన్ను అలుసుగా చూడకు...
simple words superb expression.great chaala bagundi.
But anniTikanna bomma chalA bAgA nachchindi naaku.meeru vEsinadEna???