నా నవ్వు నిన్ను చేస్తుందంటే పరవశం
స్వఛ్ఛమైన మల్లెల నవ్వులే నీసొంతం
పిలచి చూడు నా పేరులోని ఒక్క పదం
పద్మాల కొలనునై సేద తీరుస్తాను నిత్యం
ఎడారిలోని మండుటెండలో నీతో పయనం
నాకది గులాబీల తివాచిలాంటి మెత్తదనం
నీ హృదయంపై నా తలవాల్చి నిదురించడం
చామంతిపూల పరుపుపై పవళించిన చల్లదనం
నీవు నా చెంతన ఉన్నప్పుడు ప్రతినిముషం
నాశ్వాస అవుతుంది మొగలిపూల సుగంధం
మదివిప్పి మాట్లాడకుండా నీవుంటే మౌనం
నా మనసే అవుతుంది గంపెడుబంతుల భారం
ఒకరి మెడలో ఒకరం వేసుకుంటే పూలహారం
కనకాంబరాల గుత్తై చేస్తుంది నామది నాట్యం
బాగుందండీ!
ReplyDeleteLovely.
ReplyDeleteమీ కవన కుసుమం పరిమళి0చి0ది.
ReplyDeleteపిలచి చూడు నా పేరులోని ఒక్క పదం
ReplyDeleteపద్మాల కొలనునై సేద తీరుస్తాను నిత్యం
చాలా బాగుందండీ..
<<నీవు నా చెంతన ఉన్నప్పుడు ప్రతినిముషం
ReplyDeleteనాశ్వాస అవుతుంది మొగలిపూల సుగంధం..
Good one! :)
Thanks to everyone....
ReplyDeleteఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు???
ReplyDeleteవెన్నెల్లై తాకింది నీ కవిత నా మనసుకు...
అయ్యబాబోయ్....ఏంటి కవితలొచ్చేస్తున్నాయ్:)
awesome padmarpita
ReplyDeleteabboo... meeku meere chaati andi... baabu...
ReplyDeleteentainaa kaviyatri kadaa....
ఏమిటండోయి, మీరు కూడా మదురవాణి గారి బాట పట్టారు. కవిత చక్కగా ఉంది.
ReplyDeleteబాగుంది..
ReplyDeleteబొమ్మ చాల చాల బాగుంది..మీరు వేసారా?
mee header photo sooooooooooooper :))
ReplyDelete