వెలిగిస్తున్నా!!!



నరకచతుర్థినాడు నరికేసాను...
నాలోని అహాన్ని
అది కలిగిస్తున్న అంతరాయాన్ని!

అమావాస్యనాడు తొలగిస్తున్నాను...
నాలోని అంధకారాన్ని
మార్చాను వెలుగువైపుకి నా గమ్యాన్ని!

దీపావళి జ్యోతులతో వెలిగిస్తాను...
రెక్కలులేని ఊహల భూచక్రాలని
మమతల్ని విరజిమ్మే మతాబులని
హద్దులు దాటని ఆశల చిచ్చుబుడ్లని
అలుకలా మాయమైపోయే సిసింద్రీలని
ఆకాశానికి ఎగిరే ఆశయాల తారాజువ్వలని!
బాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!!

12 comments:

  1. చాలా బాగుంది


    మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు......

    ReplyDelete
  2. మీ కవిత బాగుంది దానికి తగ్గట్టు చిత్రం కూడా బాగుంది! మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. చాలా బాగుందండీ!
    అహం, అంధకారం తొలగిపోతే ఇక అంతా వెలుగే కదా! :)
    మీరు ఎంచుకున్న పెయింటింగ్ చాలా చక్కగా ఉంది.
    దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. పద్మార్పిత గారు మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు..

    ReplyDelete
  5. చిచ్చుబుడ్డిలా కళ కళ లాడుతూ ఉన్నాయి మీ శుభాకాంక్షలు. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు...

    ReplyDelete
  6. Kavitha Chala Bagundi.

    "Happy Diwali to U nd Ur Lvng Family"

    ReplyDelete
  7. రంగుల చిత్ర దీపాలే కాదు, మౌనంగా వెలుగుతున్న మాటలూ బాగున్నాయి.
    మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    ReplyDelete
  8. కవిత బాగుందండీ... మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. చక్కని కవితని వెలిగించారిక్కడ.. మీక్కూడా దీపావళి ' సుభా ' కాంక్షలండీ.

    ReplyDelete
  10. meekunu andhariki deepaavali subhaakankshalu :)

    ReplyDelete
  11. నరికేసాను...
    నాలోని అహాన్ని

    idi nijangaa chesinaaraa... meeru...


    దీపావళి జ్యోతులతో వెలిగిస్తాను...
    రెక్కలులేని ఊహల భూచక్రాలని
    మమతల్ని విరజిమ్మే మతాబులని
    హద్దులు దాటని ఆశల చిచ్చుబుడ్లని
    అలుకలా మాయమైపోయే సిసింద్రీలని
    ఆకాశానికి ఎగిరే ఆశయాల తారాజువ్వలని!
    బాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!

    chala bagunnaai... heheheh

    ReplyDelete