"వెజిటేబుల్ సలాడ్"

"అలోచనలతో బుర్రలో తిరుగుతున్నాయి సుడులు
ఏమి వండి వడ్డించాలని గుండె నిండా గుబులు
అంతగా వంటరాని నాపై నాకే చెప్పలేని దిగులు
ఎన్నో రుచులవంటలకై జిహ్వ ఎదురుచూపులు
వనభోజనాల నాడు మెప్పుకై చేయాలి జిమిక్కులు
లేకపోతే తప్పవు పాకప్రావీణ్యులతో మొట్టికాయలు"

ఏంటి పద్మా! నీకు చెప్పిందేమిటి నువ్వు చేస్తుందేమిటి? వంటావార్పుతో వనభోజనాలకి రమ్మంటే పదాలకూర్పుతో తవికలల్లి దిగులని గుబులని నేర్పుగా తప్పించుకోకు అంటారని నాకు తెలుసు అందుకే.......తెల్లవారుజామునే అయిదు గంటలకే తలంటుకుని చెంగావిరంగుపై ఎరుపు, ఆకుపచ్చ రంగంచున్న చీరకట్టి ( ఎందుకు డ్రెస్స్ కోడ్? అని అడక్కండి మీకే తెలుస్తుంది మున్ముందు ).......
భగవంతునికి దీపం, ధూపం వందనమాచరించి....అవిఘ్నమస్తు! అందరి మెప్పులు ప్రాప్తిరస్తు! అని నాకు నేనే ఆశీర్వదించుకుని వంటగదిలో వంద ప్రదక్షణాలు చేసినా ఒక్కవంటైనా నన్ను కనికరిస్తే కదా వండి వడ్డించడానికి......
ఏదో నాలుగు ప్రాస పదాలతో కవిత వ్రాసుకోక జ్యోతిగారి బ్లాగ్ లోకి వెళ్ళి మరీ ఈసారి చేసేస్తా పెట్టేస్తానని ప్రగల్భాల వ్యాఖ్యలు పెట్టనేల అని నన్ను నేను పరిపరి విధముల తిట్టుకొనుచుండగా......

పూర్వము నా బ్లాగ్ లో ఒకానొక పోస్ట్ "కాయగూరలతో కబుర్లు!!!" చెప్పితినని అవి నన్ను కనికరించి "కూరగాయోపదేశము" చేసి నా చేతికి కత్తిరించమని కత్తినిచ్చినవి.....
ఉపదేశమెట్టిదనగా.....
పిచ్చి పద్దూ.... "ఈ యాంత్రిక జీవనశైలిలో వంటావార్పెందులకు? కడుపుమంటా, షుగర్, బీపీలను పెంచేందులకు!
అంటూ మంతెన సత్యనారాయణగారి లాంటి నలుగురి ప్రముఖుల పేర్లను రెఫరెన్స్ గా చెబుతూ....
పద్దు! నీవు వంట జోలికి వెళ్ళవద్దు....
పచ్చి కూరగాయలతో నీవు చేసేయి "వెజిటెబుల్ సలాడ్"
అది అతిగా భుజించకుండా ఏర్పరుస్తుంది ఒక సరిహద్దు....
ఆ హద్దుతో ఆఖరున భుక్తాయసమంటూ ఎవరూ బాధపడరు....
అదే మనందరికీ ఎంతో ముద్దు"
అని అంటూ....

నీ హస్త కళానైపుణ్యముతో నన్ను అందంగా మలచు అంటే నన్ను అంటూ కారెట్, కీరదోసకాయ, బీట్ రూట్, కాప్సికం, ఉల్లిపొరక, టమాటాలు నేనంటే నేనంటూ నా ముందుకు నర్తించాయి....

పరువుని కాపాడిన కూరగాయలపై ప్రేమతో అలా ఆ చీర మాచింగ్ అన్నమాట...:)
మరింక ఆలస్యమెందుకు?
ఆరగించండి అందరూ.....
నేనందిస్తున్న "వెజిటేబుల్ సలాడ్"

ఏదో ఒట్టి చేతులతో కాకుండా నేను సైతం ఒక వంట(అమ్మో!వంట అంటే తంతారేమో!!:) తెచ్చాను అనుకుని
మీరంతా "సలాడ్స్" ని ఆరగిస్తే......
ఉపదేశించినందుకు కూరగాయలు,
మీ అందరితో వనభోజనం చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తానండి!
(Serving With Love)

ఇట్లు,
ప్రేమతో
పద్మార్పిత!!!

22 comments:

 1. బాగుందండోయ్ మీ కూరగాయల సలాడు. నిజమే అరోగ్యానికి ఆరోగ్యం..ఎక్కువ భుజించకుండా హద్దులు ఉంటాయి. మీ చీర కూడా చాలా బాగుంది.

  ReplyDelete
 2. అన్నీ బావున్నాయి పద్మ ముఖ్యంగా మొదట పెట్టిన ఫోటో. మరి మీరు చేసిన సలాడ్ చివరిలో ఉన్నదా. ఫోటో పెట్టి ఊరుకుంటే ఎలా. కాస్త వివరించవచ్చు కదా. కాని ఈసారైనా తప్పించుకోకుండా వంట ప్రయత్నం చేసినందుకు అభినందనలు..

  ReplyDelete
 3. కలర్ ఫుల్ గా ఉందండీ మీ సలాడ్
  ఫస్ట్ ఫొటో భలే ఉంది

  ReplyDelete
 4. మొదటి చిత్రం చాలా బాగుంది. చాలా బాగా చేశారు. ఎంత ఓపిక కావాలో కదా అలా చేయడానికి. Wonderful.

  ReplyDelete
 5. Simply super.

  పోయినసారి మినరల్ వాటర్..ఈ సారి సలాడ్:)

  ReplyDelete
 6. అబ్బా సలాడ్ అంటే ఇదండి. సూపర్.

  ReplyDelete
 7. మీ వెజిటబులె సలాడ్ సూపర్ అండి . చాలా చాలా బాగుంది .

  ReplyDelete
 8. Simply Superb మీ సలాడే కాదండోయ్ మీరు వడ్డించిన విధానం కూడా..

  ReplyDelete
 9. ఆరోగ్యకరమైన విందుభోజనం చాలా అందంగా అందించారు. అభినందనలు..

  ReplyDelete
 10. కూరగాయలతో తీర్చిన మొదటి చిత్రం అత్యద్భుతం...

  ReplyDelete
 11. చాలా బాగుంది మీ సలాడ్ కూరగాయలతో చేసిన మొదటి చిత్రం అత్యద్భుతంగా ఉంది!

  ReplyDelete
 12. భలే ఉన్నాయ౦డీ

  ReplyDelete
 13. అయ్యో ఆలీసంగా వచ్చాను..మిగిలిందో లేదో! చూడ్డానికి సూపర్గా ఉంది..తింటే ఇంక ఎలా ఉంటుందో! వంటా రాని వారమనీ దిగులు ఎందుకూ...ఇంకా మంచి మంచి కళలు మాకు చూపు ముందుకూ (రాగ యుక్తంగా పాడుకోండి..యేదో మీలా ప్రాసలు కలుపుదామని వ్రాసానండీ...మీనింగు ఖరాబ్ అయ్యిందేమో...వంట రాదని దిగులు చెందకుండా ఇలాంటి మంచి మంచి కళల్ని మాకు ముందు ముందు చాలా చూపించండీ అని!!!!)

  ReplyDelete
 14. పద్మార్పితా,
  వంటలదేవుంది లెండి కడుపు నింపుకోడానికే...
  మీ పోస్ట్ చూసాకా,చదివాకా హృదయం నిండిపోయింది...
  అభినందనలు.
  మల్లీశ్వరి

  ReplyDelete
 15. Simply Awesome..!!!

  hahaaa Kavitha Bagundi Pilla:D:)

  Ee Kavithalone 1st Pic Chalachalaa Bagundi.
  and

  Blog Pic Ithe Inka Inka chala chala bagundi..Awesome Blog Pic

  ReplyDelete
 16. పిక్చర్ ఆండ్ ప్రెజంటేషన్ రెండు పర్ఫెక్ట్ పద్మార్పిత! గుడ్... గుడ్...వెరీగుడ్!

  ReplyDelete
 17. ఆస్వాధించి
  ఆరగించి
  ఆనందించి
  అభినందించి
  ఆదరించిన
  అందరికీ
  అభివందనములు!

  ReplyDelete
 18. Ah pictures and me salad gurinchi vinnaka...ventane naku try cheyalani undi...:D

  ReplyDelete
 19. ఎంత తెలివండి పద్మ గారు మీకు...
  అందరు పాపం..ఉప్పు,కారం,గిన్నె అంటూ kastapadi పడ్డారు..మీరు సింపుల్ గ చాకు తో అయిపోగోట్టారు..:)

  ReplyDelete