బయోడెటా...:-)

బ్లాగమిత్రులకు పద్మార్పిత అందించు
వివరణాసూచికను తమరెల్లరూ కాంచు:-)
మిక్కిలి స్నేహశీలి
చిరునవ్వే ఆమె చెలి
పసిడి మేను ఛాయ
కంటినిండా కలదు దయ!

ఎత్తు ఐదడుగుల ఆరంగుళాలు
కురచైన నల్లనివి ఆమె కురులు
హృదయకవితలే ఆమె చిరునామ
మనసు మాత్రం పదిలమే సుమా!

ఆమెది ఒక చిరు ప్రభుత్వ ఉద్యోగం
జీవనానికి చేయక తప్పని పయనం
చిత్రలేఖనమే ఆమె చిన్ననాటి నేస్తం
కవితలు అందించినవి తమ ప్రియహస్తం!

18 comments:

 1. "మిక్కిలి స్నేహశీలి
  చిరునవ్వే ఆమె చెలి
  పసిడి మేను ఛాయ
  కంటినిండా కలదు దయ!"

  చూడచక్కని పద్మార్పిత...

  ReplyDelete
 2. nice..:)
  'చిత్రలేఖనం' ఏకవచనం కాబట్టి చివరన 'నేస్తం' అనీ, చివర లైన్ లో 'హస్తం' అని రాస్తే కూడా బావుంటుందేమో ఆలోచించండీ..

  ReplyDelete
 3. జ్యోతిర్మయి....Thank Q!
  తృష్ణగారు....చాలారోజులకి నా బ్లాగ్ కి విచ్చేసి చక్కగా సరిచేసారు "బయోడెటా" ని ధన్యవాదాలండి!

  ReplyDelete
 4. అంతేనా ఇంకేం వివరాలు లేవాండి:)

  ReplyDelete
 5. బయోడేటాని కూడా ఇంతందంగా రాయొచ్చని ఇప్పటిదాకా నాకు తెలీదు సుమీ! ;)

  ReplyDelete
 6. This painting speaks to me; I have no idea what it's saying but it speaks to me.
  ---Wayne Person

  Very good painting and excellent bio-data! - curriculam vitae!

  ReplyDelete
 7. పెయింటింగ్ మీరు వేసిందేనా? చాలా బావుంది :-)

  ReplyDelete
 8. అయితే నేను కూడా త్వరలో ఒక మంచి చిత్రాన్ని అందుకోబోతున్నానన్నమాట.

  ReplyDelete
 9. చక్కగా ఉంది బయోడేటా

  ReplyDelete
 10. Padmarpitha garu....
  bavundandi me kavitha....me kavitha chadutu unte meru entha manchivaro telustundi :)

  ReplyDelete
 11. ఓ ...
  మిక్కిలి భాగ్యశాలి
  చక్కటి సౌమ్యశీలి
  మీ కుంచెలో మాయ
  కవితలో లయ...

  ఐదడుగుల ఆరంగుళాల పద్మార్పిత
  నీ కర విన్యాసంతో పంచుతున్నావు అమృత
  నీవు విడువనంతవరకు నీ చిరునామా
  మా మన్సులేల్ల ఆనందమే సుమా...

  నీ జీవన పయనానికి చేస్తున్నావు ఉద్యోగం
  కాని నీ జీవిత పరమార్థానికి చేస్తున్న ఈ సద్యోగం
  నిన్ను నిన్నులా చూపే ఆభరణం
  చివరగా మీ రాత, గీత ఎంతో ఆకర్షణం ......!!!

  ReplyDelete
 12. బయోడేటాలో మీ మనసును ఆవిష్కరించే ప్రయత్నం బాగుంది...కంగ్రాట్స్..

  ReplyDelete
 13. చాన్నాళ్ళ తర్వాత వచ్చానిటు.. కొత్త టెంప్లేట్ చాలా బాగుందండీ.. బయోడేటా కూడా :-)

  ReplyDelete
 14. బయోడెటాని ఇలా అందంగా నీవే రాయగలవు పద్మా...అభినందనలు!

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. చాలా బాగారాసారండీ. "బహుముఖ ప్రఙ్ఞాశీలి" అనాలి అసలుకి..బయోడేటాలో డేటా ఒక్కటే ఉంటే కంటికానదు నిజానికి, కానీ అందమైన ప్రాసలో ఇంకా అందమైన భావంతో ఇలా రాస్తే అది ఇంఫర్మేషన్ అనిపించుకొంటుంది. ఇంటెలిజెన్స్ అనిపించుకొంటుంది..మనసుని హత్తుకొంటుంది.

  నైస్ టూ మీట్ యూ

  ReplyDelete
 17. alati alati padaalalo analpa ardhaalu.. bhaava veechikalu,, hrudaya rekhaa chitraalu... so nice of u padmarpita..

  ReplyDelete