ఆలుగడ్డగాడు...:-)

హాయ్!....మొన్న వనభోజనాల్లో నా పరువు కాపాడిన దగ్గరనుండి నాకు కూరగాయలతో అత్యంత సాంగత్యం ఏర్పడిందండోయ్!!!!
దాని పర్యవసానంగా వెజిటేబుల్స్ తో చాటింగ్స్ అండ్ డ్రీంస్ లో మీటింగ్స్!!!

వాటిల్లోని ఒక నజరానా ఇక్కడ పోస్టింగ్......జస్ట్ ఒక లుక్ వేయండి ప్లీజ్!!!


అలనాడు ఒకానొక చలికాలం ఒల్లంతా తిమ్మిరెక్కి.....
మిష్టర్.పోట్స్ గాడు (అదేనండి మన
ఆలుగడ్డ /బంగాళాదుంప/ Potatoes) లవ్లీగా ఒక లవ్ మెసేజ్ పంపాడంట మిస్.లేఫ్ కి (బెండకాయ/లేడీఫింగర్/Lady fingers) కి.....
మిస్.లేఫ్స్ గారు కాల్ చేసి మిష్టర్.పోట్స్ గాడిని..
నీకు నాకు సాంగత్యమా?
బండలా ఉండే నీవెక్కడ? నాజూకు నడుమున్న తెలివైన నేనెక్కడ?

పో!...పో! అని ఘోరంగా అవమానించేసరికి మన ఆలుగాడు ఆలోచన మీద ఆలోచనచేసి కనిపించినదాన్నల్లా (లేడీ కూరగాయల్నిలెండి!
అపార్థము వలదు ప్లీజ్ ) లవ్లీగా లౌక్యంతో లోబరచుకుని(పటాయించి).

ఇలా రోజుకొకరితో
మచ్చుకి.....

ఆలు-గోబీ, ఆలు-పాలక్, ఆలు-మటర్,
ఆలు-బైగన్ etc.....

అంటూ కంబైండ్ కాపురం వెలగబెడుతుంటే:-)

మిస్.లేఫ్ గారు మాత్రం ఒంటరినైనాను అంటూ అప్పుడప్పుడు......టమాటాని తోడు రమ్మని తన తోడుకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నదంట.:-)


ఆలుగడ్డగాడు చెప్పిన నీతి:-
నిన్ను నీ అందాన్ని నీవే చూసుకుని మురవకు!!
నలుగురిలో మసలేవేళ నీవు వారి ఆకారాన్ని చూడకు!!

(ఇది కేవలం ఆలుగడ్డ వెల్లబెట్టిన వేదాంతం అనుకుని చదవండి!
అంతేకానీ!..ఇందులో లాజిక్కులు మాజిక్కులు వెతకవద్దని మనవి!)

9 comments:

 1. హహహహ క్యూట్ :-))) మీ కూరగాయలతో మైత్రి ఏమో కాని మాకు మంచి మంచి కథలు, బొమ్మలు దొరుకుతున్నాయ్ :) ఆ రోజు కామెంట్ రాసే టైం లేక వెళ్లిపోయాను కానీ మీ సలాడ్ అరేంజ్మెంట్స్ అద్భుతం అసలు.

  ReplyDelete
 2. బాగుందండీ ఆలూ తత్వం..

  ReplyDelete
 3. భలే రాసారు..:)

  ReplyDelete
 4. 'ముదురు బెండకాయ' అంటారు కానీ 'ముదురు ఆలుగడ్డ' అనకపోవడం వెనుక ఇంత తాత్వజ్ఞానం దాగి ఉన్నదన్నమాట.

  ReplyDelete
 5. బహు బాగుంది:):)

  ReplyDelete
 6. very lively...so cute feelings...thanks for sharing with us...

  ReplyDelete