Sunday, January 08, 2012

తిరిగిరాక...

పరిచయమే కదా అనుకుంటే ప్రణయం అయినావు...
పరిణయబంధం వలదని నా శ్వాసలో బంధీవైనావు!

తోడైతే మరుగున పడతానని నా నీడగ అయినావు...
కౌగిలిలో కరిగిపోతావనే కంగారులో నాప్రాణం నీవైనావు!

కంటపడి కలవర పెడదామనుకుని కనుమరుగు అయినావు...
కలలో కనబడితే కలతచెందెదనని తలచి కలలే నీవైనావు!

మాటలకి మౌనందాల్చి నా ప్రతిమాట నీవే అయినావు...
మనసిచ్చి మరచిన నీవు మరణం కూడా కాకున్నావు!

ఊహల ఊయలూగుతూ ఆనందానికి దూరం అయినావు...
మరచిపోదామని తలచిన తలపులో కూడా నీవే గుర్తొచ్చావు!

ఆటుపోటుల కాలక్రమంలో ఆశల అలవోలె అయినావు...
పశ్చాతాపంతో తిరిగివచ్చిన నీవు ఎన్నడూ నన్ను వీడిపోవు!

18 comments:

వనజ వనమాలి said...

చిక్కనైన చక్కని కవిత. వెరీ స్ట్రాంగ్ ఎక్స్ ప్రెషన్. చాలా బాగుంది.

తొలకరి said...

Heart touching.Write more

తొలకరి said...

కంటపడి కలవర పెడతావని మరుపే అయినావు... (లేక)

కంటపడి కలవర పెడతావని మాయం అయినావు

రాయొచ్చేమో?

కెక్యూబ్ వర్మ said...

అబ్బురపరచే వ్యక్తీకరణతో హృద్యంగా హత్తుకుంది...మరపురాని మరణంలేని పరిమళభరితమైన భావం పంచుకున్నందుకు.........

'Padmarpita' said...

@వనమాలిగారు నచ్చి మెచ్చిన మీకు నెనర్లు.
@Thank...Q, కనపడి కలవర పెడతాడనుకుంటే కనపడకుండానే కనుమరుగైనావనే భావం రావాలన్న ప్రయత్నం తొలకరిగారు.
@కెక్యూబ్ వర్మగారు....నా భావం మీ హృదయాన్ని తాకితే, మీరు దాన్ని వ్యక్తపరచినందుకు......ధన్యవాదాలు.

yohanth said...

పద్మగారు సూపర్బ్ ఫీలింగ్స్.

C.ఉమాదేవి said...

భావం హృద్యం!అక్షర నైవేద్యం మీ కవిత!

C.ఉమాదేవి said...

భావం హృద్యం!అక్షర నైవేద్యం మీ కవిత!

నేను మీ నేస్తాన్ని said...

hmm...

kiran said...

చాలా బాగుంది..!!
మనసిచ్చి మరచిన నీవు మరణం కూడా కాకున్నావు! - ఇక్కడ ఆగిపోయా ఓ నిమిషం..
హ్మ్మమ్మ్మ్మం.................!!

సృజన said...

పద్మా....మనసే కాదు మైండ్ కూడా ప్రేమ మయమేనా:)

జ్యోతిర్మయి said...

పద్మార్పిత గారూ 'సరాగ'లో బొమ్మా చాలా చాలా బావుంది. అభినందనలు.

"చిన్ని ఆశ" said...

చాలా బావుంది, బొమ్మా మీరేసిందేనా?

జయ said...

బొమ్మల రాణి కి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి మరి.

మధురవాణి said...

బాగుంది.. మరీ ముఖ్యంగా ఈ వాక్యం చాలా నచ్చింది నాకు.. *మనసిచ్చి మరచిన నీవు మరణం కూడా కాకున్నావు!*

Balu said...

మీ blog picture & కవిత చాలా బాగున్నాయి.

'Padmarpita' said...

అన్నివిధాల...
అభిమానించి...
అభినందించే...
అందరికీ...
అభివందనలు...
సంక్రాంతి శుభాకంక్షలు!

సీత said...

మనసిచ్చి మరచిన నీవు మరణం కూడా కాకున్నావు!........
simly superb andi.........