"ఇలా నిదురపొండి"

"మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా" అని జాగృతి పరచినా
"నిదురపోరా సామి నా ముద్దుమురిపాల సామి" అని నిదురబుచ్చినా
"నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రావమ్మ రావే" అని జోల పాడినా
"నీవు రావు నిదుర రాదు" అని నిరీక్షించినా.....
ఇలా నిద్రపై ఎన్నో పాటలు పాడుకునే మనం.....
ఇలా నిద్రపోతే ఎలా ఉంటుందో అనే ఊహలకి.....
కవితా రూపకల్పనే "ఇలా నిదురపొండి"!!!!


వెల్లకిలా పడుకున్న వీరుడు
కలతలు ఎరుగని మగధీరుడు
కాస్త కబుర్లకి ప్రీతిపాత్రుడు
కావలసినంతే కష్టపడతాడు...




బోర్లా పడుకున్న ప్రతిమనిషి
కుచిత భావాలవైపు ఆకర్షి
తనదే వేదమనుకునే అభిలాషి
తీరుమారిస్తే కాగలడు మరోఋషి...





ఒకవైపు ఒదిగి పడుకున్న పడతి
వినయవిధేయతలే అత్యంతప్రీతి
ప్రేమ, ఆత్మస్థైర్యమే ఈమె మనోగతి
వీరిని మెచ్చును సకల జగతి...



ఒంటికాలిని వంచి ఒకవైపు నిద్రించు
ప్రతిదానికీ కలతచెంది కలవరపరచు
బేలతనమే వీరి నేస్తమై వెంబడించు
దిశమారిస్తే ధైర్యమే వీరి దశమార్చు...



ముడుచుకుని పడుకున్న నీవు
అసూయ స్వార్ధాలకి అదే నెలవు
చిరాకు విసుగు వీరి ఇంట కొలువు
మంచివారిని ఇవి దరిచేరనీయవు...






అరచేతుల్లో ఆదమరచి నిద్రించువారు
తెలివిగా ఆలోచించి పనులు సాధిస్తారు
తొందరపడి ఎవరినీ అంతగా నమ్మరు
నమ్మినవారిని ఎన్నటికీ విడనాడరు...







క్రింది నుండి ఒళ్ళంతా కప్పిన ముసుగు
నీలోనే దాగింది బిడియం మరియు సిగ్గు
తొలగించు మేకపోతుగాంభీరపు ముసుగు
లేకపోతే నీవు కాంచలేవు లోకపు వెలుగు...


నిర్భయముగా నిదురించలేనివాడు
గతాన్ని పలుమార్లు తలచి రోధిస్తాడు
ఒంటరి అయి జీవితాన్ని సాగిస్తాడు
ఎదుటివారి నుండి జాలిని కోరతాడు...





కాలుపై కాలేసుకుని దర్జాగా పడుకో
నడవడికను త్వరలో నీవే మార్చుకో
మార్పుపులు నచ్చక పోయినా ఒప్పుకో
ఇంకెలా పడుకోవాలో నీవే నిర్ణయించుకో...

13 comments:

  1. మంచి విషయమున్న పోస్ట్...అలా మార్చుకోగలమా నిద్రా సమాధి స్తితి అంటారు కదా...అప్పుడెలా వున్నామో ఎదుటి వారు చెప్తేకానీ తెలీదు కదా?? ఐనా ట్రై చేద్దాం...థాంక్యూ పద్మార్పితగారు...

    ReplyDelete
  2. మరి నిద్రలో అన్ని భంగిమల్లో తిరిగితే!:):)

    ReplyDelete
  3. అమ్మో ...ప్రశాంతంగా ఉండేది ...ఒక్క నిద్రపోఎద్తప్పుడే..
    మళ్లీ మీరు ఇందులో మనుషుల్ని జుద్గె చేసేస్తే ఎలా :)

    ReplyDelete
  4. చాలా మంచి పోస్ట్ పద్మార్పిత గారు.

    ReplyDelete
  5. ఏదో ఒక పోజు లేద్దురూ...

    మొత్తం మీద నిద్ర వస్తే అదే పదివేలు !!

    (నిద్ర రాక, పోక , కామెంటు కొడుతున్నాం అన్న మాట ఇప్పుడు!)



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. deeni gurinchi nenu intaku mundu chusanu kani antha nammasakyamga ledu....asampoorthiga undi bahusa oka charcha pedite clarity vastundemo....by the way chekree gari kalam peru padma na?

    ReplyDelete