ఎందుకో ఏమో?

ఎందుకీ దాగుడుమూతలు? ఎందుకీ దోబూచులు?
నాలోనే ఉన్న మీకు ఎందుకీ ఎడబాటు దొంతరలు?
ఒంటరినైన నాకు మౌనంతో స్నేహం కుదిరింది
మౌనంగా భారమైన భాధని భరించాలని ఉంది
గత స్మృతులను తలచి మది పరితపిస్తుంది
గీసిన చిత్రాన్నే మనసు పలుమార్లు గీస్తుంది
చిత్రంలోని ముఖము మాత్రం అటు తిరిగుంది.

ఎందుకీ ఎదురుచూపులు? ఎందుకీ తడబాట్లు?
నాది కాని నాపైనే నాకెందుకిన్ని మమకారాలు?
పలుమార్లు ద్వారంవైపే చూపు మళ్ళింది
నాలో నేలేనని తెలిసి నన్నెవరో పిలుస్తుంది
ఎవరికోసమో నా హృదయం నిరీక్షిస్తుంది
ఏమిటో నాలోని వింత నాకే తెలియకుంది
నాదైన హృదయం వేరొకరికై స్పందిస్తుంది.

ఎందుకీ అలజడులు? ఎందుకీ కలవరింతలు?
నాకు చెందని నీపైనే నాకెందుకని ఆరాటాలు?
నిన్ను చూడాలని నామది కోరుకుంటుంది
నీవులేని చిరుగాలి కూడా చిరాకుపుట్టిస్తుంది
నవ్వుని నియంత్రించి ధుఃఖాన్ని మ్రింగుతుంది
పలకరిస్తే పెదవి విచ్చి గుండెలయ తప్పుతుంది
కలనైనా చూడాలని కనులు తెరచి నిద్రిస్తుంది.

14 comments:

 1. పద్మార్పితగారు మీదైన శైలిలో కవిత బాగుందండి.

  ReplyDelete
 2. @పద్మార్పితగారు,

  చాలా చాలా బాగుందండి.....

  ReplyDelete
 3. @ sarmaji thank Q!

  @ yohanth ధన్యవాదాలు!

  @ raf raafsun...మీరు మెచ్చినందుకు ధన్యవాదాలండి! Thanks for visiting my blog.

  ReplyDelete
 4. హృదయాంతరాళలోని స్పందనను ఆవిష్కరించిన మీకు సుమాంజలులు పద్మార్పితగారూ...మరోమారు శుభాభినందనలుః-)

  ReplyDelete
 5. తెలియ కుండ నేను " ఎందుకో?ఏమో! " ని అయ్యాను !
  ఎప్పుడు అయినానో తెలియదు?
  ఎలా అయ్యానో తెలుసు!
  రేయింబవళ్ళు భేదము పట్టక
  నిద్రాహారాల జాడే తెలియక
  అనునిత్యమదే యావలో ...... నేను "అదే?!" అయితిని.
  ఇప్పుడు మటుకు అచ్చు గుద్దినట్లు అచ్చం మీరు ఇచట వ్యక్త పరచిన భావ వాహినికి నిదర్సనమై నిలిచున్నాను
  నిజమే నేటి నా మనో స్థితి ఇదే !
  యిది నా మనసును కాక నన్ను తాకినది కనుక ఈ స్పందన అంతకు మించి మరేమీ లేదు
  భావనలో మర్పేమో బాహ్యము మారినట్లే అగుపిస్తున్నది...
  అందుకే ఎందుకో?ఏమో! ని ప్రస్తుతానికి ఎండమావులు అయ్యింది.
  పాత పథం మార్చుకుంది ....
  కొత్త దారిలో నడుస్తున్నది.
  కానీ ఒక్కటి మటుకు నిజం
  మీ ఈ భావం ప్రస్తుత నా మనసుకు దర్పణం
  (క్షమించాలి తమ పరంగా కాక నా(self ) పరంగా చూచు చున్నందులకు )
  ధన్యోస్మి

  అద్దానికి ఉన్నది చూపటం తెలుసు,
  బాగోగులు దానికి పట్టవు .....

  అట్లాగే

  నన్ను చూపే అద్దానికి నేను ఏనాడు THANKS చెప్పను

  ఎందుకో?ఏమో!
  ?!

  ReplyDelete
 6. పద్మా భావవెల్లువతో కేక పుట్టించావుగా....

  ReplyDelete
 7. @ కెక్యూబ్ వర్మగారు...అభినందనలు అందజేసిన మీకు నమసుమాంజలలు!

  @ ఎందుకో ఏమో...ఎందుకో ఏమో అని పేరు పెట్టి పొస్ట్ చేస్తూ అనుకున్నాను ఎందుకో ఏమోగారు ఏమనుకుంటారో ఏమో అని....అందంగా అద్దంతో పోలిస్తే ఇంకేం అనను...ఇంత ఆనందం ఎందుకో ఏమో!:-)

  @సృజన, సాయిగార్లకు...ధన్యవాదాలు!

  ReplyDelete
 8. chaala chaala bagundandi....

  ReplyDelete
 9. చాలా చాలా బాగుందండి.....

  ReplyDelete
 10. పద్మార్పిగారూ మీ కవిత్వం ప్రవాహం. రియల్లీవండ్రఫుల్. మీ అంతటి వారు నా బ్లాగులోకి వచ్చి వున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ధన్యవాదములు

  ReplyDelete