తలపెందుకని?

సూటిగా అడిగాను మనసుని
ఈ ఒంటరితనం నాకెందుకని?
మనసు బదులు చెప్పలేనని
నిన్ను తలచింది ఎందుకని?

శ్వాసలేనిదే నేను లేనని
తెలిసి శ్వాసలో నీవెందుకని?
ఊపిరిని బిగపట్టాను ఆగమని
తన్నుకొచ్చింది నీతలపు ఎందుకని?

నీ తలపుల లేత కలువలని
మనఃసరోవరంలో విసిరావెందుకని?
తలపుల తడి ఆరనే లేదని
తెలిసినా దాహం తీరదు ఎందుకని?

నిన్ను మరచి పోవాలని
వేడుకుంటున్నా నిన్నేందుకని?
తలచినాను నిన్ను మరచితినని
కానీ మరింత దగ్గరైనావు ఎందుకని?

18 comments:

 1. కవిత బాగుంది అండి

  ReplyDelete
 2. kekaga....baagaa raasaaru padmaarpita gaaru...

  ReplyDelete
 3. తల పెందుకనీ?

  తలపు పద్మార్పిత మైయింది, అందుకని.


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 4. బావుందండీ మీ కవిత.

  ReplyDelete
 5. chala chala bagundi nestam...

  naaku saahityam teliyadu telisiunte meeku manchi bavatho pampevaadini naa hrudayalo kaligina anubhootini...

  ReplyDelete
 6. నీటిని వీడి పద్మం ఉండనట్లు తలపుని వీడి వలపు ఉండజాలదు. వలదన్న వినని మనసు కి ఒంటరితనం అన్నది తుంటరి చేష్ట కదా.. ! తామరాకు మీద నీటి బొట్టులా.. మనసు నూ..

  ReplyDelete
 7. మనసులో చేరిన మధుర భావం ఊపిరి చివరి దాకా పరిమళిస్తూనే వుంటుంది కదా పద్మ గారూ...well versed fragrance of love...Congrats..

  ReplyDelete
 8. తలపులలో ప్రేమార్పిత తిరిగి వచ్చిందన్నమాట:)

  ReplyDelete
 9. కవిత బాగుందండి.

  ReplyDelete
 10. శ్వాసలోనే తలపులనీ, సహచరినీ బంధించేసి ఉంచారు. ఇక తలపెందుకులెండి...

  ReplyDelete
 11. కవిత చాలా బావుందండి.

  ReplyDelete
 12. కవిత బాగుంది.

  ReplyDelete