"ప్రేమించుకుందాం రా"

ప్రియమైన మిక్కీ మామ.... మినీ రాస్తున్నది ఏమిటంటే!!!
( అందరూ SMSలు, Mailలు చేస్తుంటే నీకిదేం మాయరోగం అనమాకు మామ )
మనం ఎంత ఇంగ్లీషోల్లమైనా మన వాలంటైన్ డే ని తెలుగులో చేసుకోవాలని బహు ముచ్చటగుంది.
అందుకే నువ్వు ఏడో తేదీన గులాబీని పంపిన రోజునుండి థింకింగ్.....థింకింగ్....థింకింగ్,
ఇంక ధైర్యం చేసి ఈరోజు రాసేస్తున్నా , ఈ రెండు రోజులు నువ్వు ఎలాగో తిట్టవు,
తిట్టినా ఎలాగో ప్రేమనంతా ఒలకబోస్తావన్న ధీమా....
ఇంకెందుకు ఆలస్యం???
"ప్రేమించుకుందాం రా".....
వాలంటైన్ వీక్ ( ప్రేమికుల వారం ) అంటే ఈ ఒక్క వారం ప్రేమించమని కాదు మామ....
ఇలా ప్రేమించడం మొదలు పెట్టిన కలసిన దగ్గరనుండి కడవరకు ఎన్ని వారాలు ఉన్నాయో
అన్ని వారాలు ఇది ఫాలో అవ్వమనీ ( మధ్య ఇంగ్లీష్ ఎందుకు అంటావా? ఎంతైనా ఇది ఇంగ్లీష్ పండగ కదా మామ అందుకే ఒగ్గెయ్! )
ఇంక మాటర్ లోకి వస్తే....ఇంక నీకు తెలుసు కదా మామ నా వీక్ పాయింట్ ప్రాసని కవితని చెప్పి తవికలు రాసి నిన్ను తికమక పెడతాను, ఇంకో మాట మామ...... ఇంగ్లీషును తెలుగులోకి మార్చేటప్పుడు పదాలు దొరక్కపోతే కూడా క్షమించెయ్!!!! ప్లీజ్...ప్లీజ్.....ప్లీజో ప్లీజ్!!!
అయినా నా మీద లవ్ తో నువ్వు కాదనవనుకో........
కాచుకో మరీ!!!:-) :-) :-)

7 ఫిబ్రవరి...
రోజ్ డే/ గులాబీ రోజు
అందమైన గులాబి పువ్వు
ప్రేమతో అందించు నువ్వు
విసిరింది ఆమె చిరు నవ్వు
గాలిలో తేలిపోయావు నువ్వు!8 ఫిబ్రవరి...

ప్రపోసింగ్ డే/ప్రతిపాదన రోజు
గొప్పలు నీగురించి చెప్పెయ్
తనేమన్నా నువ్వు వినేసెయ్
ప్రేమిస్తున్నా అని చెప్పేసెయ్
కలలకు అంకురార్పణ చేసెయ!9 ఫిబ్రవరి...

చాక్లెట్ డే/మిఠాయి రోజు
స్వీట్స్ & చాక్లెట్స్ తినిపించు
తీయదనాన్ని ఆస్వాదించు
నీలోని ప్రేమను తనకి పంచు
జీవితాన్ని అందంగా ఊహించు!
10 ఫిబ్రవరి...

టెడ్డీ డే/బహుమతుల రోజు
టెడ్డీని బహుమానంగా ఇచ్చిచూడు
అందులో ఉన్నది నీవేనని చెప్పిచూడు
హృదయానికెలా హత్తుకుందో చూడు
ఇరువురూ ఒకరికి ఒకరు ఈడు-జోడు!11 ఫిబ్రవరి...

ప్రామిసింగ్ డే/ బాసచేసుకునే రోజు
చేతిలోన చెయ్యేసి ఒట్టు వేసుకో
తనని వదలి పోనని బాస చేసుకో
నీలోని భావాలని తనతో పంచుకో
భవిష్యత్తును నీకణువుగా మలచుకో!12 ఫిబ్రవరి...
కిస్ డే/ముద్దు రోజు
ముద్దుముచ్చట్లలో ముందు ముద్దు
దీనికి ఉంటేనే బాగుంటుంది సరిహద్దు
అప్పుడప్పుడు చిలిపిచేష్టలు అదో ముద్దు
మితిమీరి ఇరువురూ దాటకండి హద్దు!13 ఫిబ్రవరి...

హగ్ డే/ కౌగిలింత రోజు
భావోధ్రేకాల సమ్మేళనం కౌగిలి
మదిని చేస్తుంది ఇది చక్కిలిగిలి
మనసుదోచిన వాడి కౌగిలిలో చెలి
అది చూసి కొంటెగా నవ్వింది జాబిలి!14 ఫిబ్రవరి...

వాలంటైన్ డే/ప్రేమికులరోజు
ఈరోజేనంట వాలంటైన్ డే
ప్రేమించే మనసుంటే 365 డే
ప్రతిరోజు మనకి ప్రేమికుల డే
హ్యాపీ హ్యాపీగా వాలంటైన్ డే!

9 comments:

 1. ప్రతి రోజూ ప్రేమించే మనసుంటే ప్రేమికుల రోజే...బాగా చెప్పారు..అభినందనలు పద్మ గారూ...

  ReplyDelete
 2. చాన్నాళ్ళకి చాలా ప్రేమగా పిలిచారు పద్మార్పితగారు:)

  ReplyDelete
 3. పద్మగారు...అలా రమ్మని పిలిస్తే ఎలాగండి????:)

  ReplyDelete
 4. Aha!...prathi rojuki oh kavitha chakkaga rasaru :)

  ReplyDelete
 5. ఎంత చక్కటి ప్రేమో. నాకు భలే నచ్చేసింది.

  ReplyDelete
 6. మొదటిసారి మీ టపా చదివాను....
  భలే రాసారు కదండి - ఒక్కో రోజుకి ఒక్కొక్కటి...హాగ్ డే డి ఐతే సూపర్
  "మనసుదోచిన వాడి కౌగిలిలో చెలి
  అది చూసి కొంటెగా నవ్వింది జాబిలి!"
  వాహ్ వా, వాహ్ వా

  ReplyDelete