నీ తపన!

పువ్వుపై వాలాలన్న ఈ తపన....
ఇది నీలో చెలరేగిన వింతైన ఆలోచన
తెలియదు ఆ మదికి నీదైన ఈ ఆలాపన!

పంచరంగులపై నీకేల యోచన....
అది తెలుపుపై సూర్యకిరణాల పరివర్తన
ఆకర్షణలకు బానిసవై చెందకు ఆవేదన!

నీకే సొంతం కావాలన్న భావన....
వాలితేనే వడలివంగిపోయే పువ్వుపైన
ఎందుకీ చెంచలమైన వాంచల జడివాన!

10 comments:

 1. బాగుందండీ కవిత.

  ReplyDelete
 2. బోలెడంత శృంగారం, ఇంకా బోలెడంత సైన్స్ తో కలిపి ఓ తియ్యని చాకొలెట్ లాంటి కవిత....ఈ రోజుకి యాప్ట్ గా! అభినందనలు

  ReplyDelete
 3. ఆ పువ్వు వికసించడానికి తన రెక్కలతో విసురుతూన్నట్టు లేదూ...
  తాజాదనం పోకుండా తన చిన్ని శక్తినంతా చూపుతూ శ్రమిస్తున్నట్టు లేదూ....


  బాగుంది పద్మగారూ మీ పుష్పరాగం...ః-)

  ReplyDelete
 4. తెలుగుపాటలు,sarma garu, చిన్నిఆశ, Yohanth garu.....థ్యాంక్సండి!

  వాసు దేవ్ గారు అందులో అన్ని ఉన్నాయంటారా:-) thanks a lot.

  కెక్యూబ్ గారు...మరీ ఇంత పాసిటివ్ తింకింగా...Be positive:-)Thank Q!

  శేషగిరి గారు...hmm...అంటే నిట్టూర్పా???:-)

  ReplyDelete
 5. chala bhaga rasaru padma

  ReplyDelete