జరిగేనా???


పడతిలో పడుచుతనాన్ని చూస్తున్నారు!
తెరచిన కళ్ళలో స్వప్నమై రమ్మంటున్నారు!
ఒంటరినైన నన్ను ఎవరో వెంటాడుతున్నారు!
కపటమెరుగని కంటికి లోకాన్ని చూపుతున్నారు!
వెనుతిరిగిన నన్ను విజయోస్తని ఊరడిస్తున్నారు!

నిలువుటద్దంలోనైనా పాత ప్రతిబింబాన్ని ఎలాచూపను?
గాయమైన మనసుకి గాట్లు ఇంకెన్ని నేను పెట్టను?
అమావాస్య నాటి రేయిలో వెన్నెల్లో విందేమివ్వను?
వెనుభాగమేసిన చిత్రానికి ముఖకవళికలు ఏమద్దను?
గుండెభారమైన వేళ యుగళగీతం ఎలా ఆలపించను?

11 comments:

 1. The Picture is so very beautiful. No words !!

  ReplyDelete
 2. గొప్ప భావుకతను ఆర్థ్రతతో సమ్మేళవించి పడతి అంతరంగాన్ని మరో గొప్ప చిత్రంతో ఆవిష్కరించిన మీకు అభినందనలు Padmarpita గారు...

  ReplyDelete
 3. బావుంది భావుకత...బొమ్మకి రాశారా? రాశాక బొమ్మని చూశారా?

  ReplyDelete
 4. @వనమాలిగారు థ్యాంక్యూ వెరీమచ్...
  @Surabhi...thanks a lot!
  @కేక్యూబ్ గారు...అర్థం చేసుకుని అభినందించినందుకు ధన్యవాధాలండి!
  @ చిన్ని ఆశ గారు...రాసాకే చిత్రం చూసాను... నచ్చినందుకు నెనర్లు.

  ReplyDelete
 5. Beautiful expressions padmagaru.

  ReplyDelete
 6. bhale rasaru :) picture is super

  ReplyDelete
 7. నీ బ్లాగ్ పేరు బావుంది! నీ కవిత ఇంకా
  బావుంది నీ శైలి మరి మరి బావుంది!
  నీ బ్లాగ్ చూడగానే
  హాయిగొలిపేలా వుంది!
  ఎంతయన కాస్తో కూస్తో భావుకత్వం ఉన్నదాన్ని
  అందుకే ఈ నా ఆనందస్పందన!!!

  ReplyDelete